భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం 101

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు నమ్మక పోతే ఇదిగో నీ కోర్టు ఉత్తరువు’అని ఇచ్చాడు. దాన్ని చూడగానే అన్నాచించనీకర్ కు చాలా బాధవేసింది. ఏమిటి మనమిన్నాళ్లు ఈ బాబా నే నమ్ముకొని ఉంటే చివరకు మనం ఓడిపోయేట్లు చేస్తాడా అని ఆక్రోసించాడు. వెంటనే మసీదు కు బయల్దేరి వెళ్లి బాబాను కోపంగా చూస్తూ ‘‘బాబా నీవేమీ చేయలేవా.. ఇదేనా నీవుచేసింది’’ అని గట్టిగా అడిగాడు.
‘అన్నా.. నీకు బుద్ధి లేకుంటే నేను ఏమి చేస్తాను. నా దగ్గరకు వచ్చినవాళ్లు ఎవరైనా దేనిలోనైనా ఓడిపోయారా. నీవే చెప్పు.. ఎందుకు ఏమీ తెలుసుకోకుండా అంత లావున ఎగరడమూ నిదానంగా చూడు. నీకే అంతా తెలుస్తుంది. ముందు నీ గదికి నీవు వెళ్లు ’అని చెప్పాడు.
చేసేది ఏమీ లేక అన్నా తన వసతికి వెళ్లాడు. అతడు వెళ్లగానే కోర్టు బంట్రోతు వచ్చి ఉన్నాడు. అతడు అన్నాచించనీకర్ కు ఒక నోటీసు ఇచ్చాడు. అందులో అన్నాచించనీకర్ గెలిచినట్లు అతనికి 1800రూపాయలు వచ్చినట్లు ఉంది. అతడు ఆ పైకాన్ని కూడా అన్నాచించనీకర్‌కు ఇచ్చివేశాడు. దాన్ని చూసి అన్నాచించనీకర్ కు ఎక్కడ లేని ఆనందం వేసింది. అపుడే అయ్యో నేను ఇపుడే బాబాను తూలనాడానే అని దుఃఖమూ కలిగింది. వెంటనే అన్నాచించనీకర్ మసీదుకు వెళ్లాడు. బాబాను తనను క్షమించమని అడిగాడు. అప్పుడూ బాబా ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ‘‘అన్నా కోపం తీరిందా సుఖమే కలిగిందా? సంతోషమేనా ’అని నవ్వుతూ బాబా అడిగారు. అన్నాచించనీకర్ బాబా పాదాలమీద పడి బాబా మమ్ముల్ను క్షమించు అనిప్రార్థించారు. ఆ కోర్టు ద్వారా వచ్చిన పైకాన్ని పెట్టి చావడిని అంతా మరమ్మత్తులు చేయించారు. మిగతా భక్తులంతా కలసి మీ పేరు తర్వాతి తరాలకు కూడా గుర్తుండాలి అని చెప్పి లక్ష్మీబాయి దామోదర్ బాబరే అన్నపేరును చావడికి చెక్కించారు. అలా చావడి ఉత్సవం బహు పసందుగా బాబాకు జరిపించేవారు. ఊరంతా కలసి వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనేవారు. బాబా కూడా చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆశీర్వదించేవారు.
***
బాబా ఎపుడూ తాను గురువునని, భగవంతుడినని చెప్పేవారు కాదు. ఒకరోజు నూల్కర్ అను నతడు వచ్చి బాబా నేను మిమ్మల్ని సద్గురువుగా భావిస్తున్నాను. మిమ్మల్ని నేను పూజించుకుంటాను అని అడిగారు. అదిగో ఆ స్తంభాన్ని పూజించుకో గురువు సంతోషిస్తారు అన్నారు బాబా.
‘స్తంభాన్ని మేమెందుకు పూజించాలి. మేము మిమ్మల్నే పూజించుకొంటాం ’అని నూల్కర్ తోపాటు అందరూ బాబాకు గంధం అక్షతలు సమర్పించి పూజించారు. హారతి పాటలు పాడారు. ఆరోజు మహిల్సాపతివారికి గురుపూర్ణిమ అందుకే సాయి గురువును పూజించుకోమని చెప్పారు అని ఆయన కూడా గులాబీపూలు తెచ్చి బాబాకు ఇచ్చి నమస్కారం చేశాడు. బాబా ‘మహిల్సాపతి! నీవు మసీదు పక్కకు వెళ్లి చూడు అక్కడ ఓ పండు ముదుసలి కూర్చుని ఉంటాడు. ఆయన్ను ఇక్కడకు తీసుకొని రా’’అన్నారు.
మహిల్సాపతి వెళ్లి చూస్తే మసీదు పక్కనే ఓ ముసలాయన చాలా నీరసంగా కూర్చుని ఉన్నాడు. అతడిని మసీదులోకి తీసుకొని రాగానే బాబానే స్వయంగా అతడి ముఖము, కాళ్లు చేతులు కడిగి అతనికి అంతకు తనకు భక్తులు సమర్పించిన ప్రసాదాలను తినిపించారు. అందరూ బాబానే చూస్తున్నారు.
‘ఎందుకు అలా చూస్తున్నారు. తోటివారికి చేతనైనంత సాయం చేస్తే భగవంతునికి సేవ చేసినట్లే అవుతుంది కదా’అన్నారు. అప్పట్నుంచి శిరీడి వాసులంతా బాబా చెప్పిన మార్గంలో నడుచుకునేవారు. శ్రీరామనవమి ఉత్సవాలు, ఉరుసు ఉత్సవాలను కూడా మసీదులో చేస్తుంటే బాబా చిరునవ్వుతో చూసేవారు.
***
బాబా దగ్గర మహిల్సాపతి, దాసగణు, హేమాదిపంతు చాలామంది కూర్చుని ఉన్నారు. ఒక ధనవంతుడు కారులో వచ్చి మసీదు ముందు దిగాడు. అతడు మెడలో చాలా నగలు వేసుకొని ఉన్నాడు. మంచి సిల్కు చొక్కా పట్టు పంచె ధరించి ఉన్నాడు. అతడు లోపలికి వస్తుంటే బాబా చిరునవ్వుతో చూశారు.
అతడు వచ్చి రాగానే పెద్ద గొంతుకతో‘‘ బాబా మేము నమస్కారాలు మీకు సమర్పిస్తున్నాం’’ అన్నారు. దానికి బాబా దగ్గర నుంచి సమాధానమేమీ రాలేదు.
అక్కడ వారిని పురమాయించి తనకు ఒక కుర్చీని తెప్పించుకునివేసుకొని కూర్చున్నారు.
బాబా ఎదురుగా ఎవరూ ఆసనం పైన కూర్చునేవారు కాదు. ఆ ధనికుడు అది ఏమాత్రం పట్టించుకోకుండా కూర్చుని ఉన్నాడు. ‘‘బాబా భగవంతుని దయవలన నాకు అన్నీ చేకూరాయి. అన్ని హంగులను భగవంతుడు నేను అడగకుండానే ఇచ్చాడు.
-ఇంకా ఉంది