భక్తి కథలు

యాజ్ఞసేని-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంపిల్య నగరం దగ్గరపడగా దుర్యోధనుడు దుశ్శాసన, యయుత్సుడితో పెక్కుమంది రాకుమారులతో కలిసి పట్టణాన్ని ముట్టడించాడు. ఒక్క పెట్టున పైబడ్డ దండయాత్రను తెలిసికొన్న ద్రుపద మహారాజు కోపించి తన అంతులేని రథ గజ తురగ పదాతి దళాలత వచ్చి కౌరవులను ఎదుర్కొన్నాడు.
ద్రుపదుడి బాణపరంపర వర్షాకాల మేఘాలు పెద్ద జలధారలతో పద్మాలతో కప్పివేసినటుల కౌరవ సేననంతటినీ కప్పివేశాడు. అతడికి తోడుగ కాంపిల్యంలోని ప్రజలంతా విజృభించి సింహనాదాలు జేస్తూ కత్తులూ, రోకళ్ళూ, కర్రలూ చేతబట్టుకొని కౌరవ సేనలోని మేటి వీరులందరితోనూ తలపడ్డారు.
కౌరవులు కూడా సావధానులై తమ తమ బాణ పరంపరతలో సూర్య మండలాన్ని కప్పుసిన చందాన ద్రుపదుడిని కప్పివేశారు. కోపించిన ద్రుపదుడు కూడా విజృంభించి వారి బాణాలను మధ్యలోనే తుత్తునియలుగావించి, కౌరవ వీరుల ఆయువుపట్లు అదిరేటట్లుగా కొట్టాడు. ద్రుపదుడి ధాటికి కురుకుమారులందరూ భయపడి నిలువలేక పాండవుల వద్దకు పరువెత్తారు. అది చూచిన అర్జునుడు గురువైన ద్రోణాచార్యుడికి, అన్న ధర్మరాజుకీ నమస్కరించి..
‘‘మీరిక్కడే ఉండండి! నేను ఇప్పుడే ద్రుపదుడిని పట్టి తెస్తాను’’ అని బయలుదేరగా భీమసేనుడు తన సైన్యానికి ముందు నడువగా, నకుల సహదేవులు తనకు చక్రరక్షకులుకాగా, ద్రుపదుడి సైన్యాన్ని సమీపించాడు.
భీమసేనుడు పెద్దగాఅరుస్తూద్రుపదుడి ఏనుగుల సమూహాన్ని ఎదుర్కొని తన గదా ఘాతలచేత వాటి చెక్కిళ్ళనూ, కుంభస్థలాలనూ, దంతాలను, తొండాలనూ, ముఖాలనూ పగులకొట్టాడు.్భముడి గదాఘాతానికి శత్రు సైన్యం విలవిలలాడింది. గజాశ్వరథా సమూహాలు కొన్ని బలహీనపడి పలయనం చిత్తగించాయి.
అంత అర్జునుడు ఆకాశంలో సూర్యుడి చందాన ప్రకాశిస్తూ ద్రుపదుడి గజాశ్వరథ సైనిక సమూహాలను తన బాణాల చేత కప్పివేశాడు. అది చూచిన ద్రుపదుడి తమ్ముడైన సత్యజితుడు అనేవాడు గొప్ప విల్లును చేబూని పటాటోపంతో అర్జునుడిని మూర్కొన్నాడు. శరబాణ పరంపరతో అర్జునుని కొట్టాడు. కానీ అర్జునుడు వాటినన్నింటినీ మధ్యలోనే ముక్కలు ముక్కలు చేశాడు. సత్యజితుడు అర్జునుడి ధాటికి వికలుడై పరువెత్తిపోయాడు. అతడి సైన్యం కూడా కుప్పలుగా నేలగూలుతాయి.
అర్జునుడితో తలపడి పారిపోయిన తమ్ముని చూచిన ద్రుపద మహారాజుకు కోపం కట్టలు తెంచుకుంది. వ్యవధి లేకుండా బాణాలను సంధించి అకాల యముడో అన్నట్లు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. ద్రుపద పార్థులొకరినొకరు ఎదుర్కొని చేస్తున్న పోరు భయంకాకృతిని దాల్చింది.
వారి బాణాలు ఆకాశాన్ని కప్పివేయగా అంతా చీకటిమయమయింది.
తక్కిన సైన్యమంతా పోరాటం మాని రాత్రి అయిందేమోనని భ్రాంతిలో పడ్డారు.
అట్లా జరిగిన గొప్ప ద్వంద్వ యుద్ధంలో ద్రుపదుడు అర్జునుడి విల్లును నడిమి భాగానికి విరగేటట్లు కొట్టి పెద్దగా అరిచాడు. అందుకు ఆగ్రహించిన అర్జునుడు ఒక్క పట్టున కత్తిని చేత బూని ద్రుపదుడిని రథంపైకి కొదమ సింహంవలె దూకి అతడిని గట్టిగాపట్టుకొన్నాడు.
అట్ల పట్టుకొన్న ద్రుపదుని తన రథ చక్రానికి బంధించి తెచ్చి ద్రోణాచార్యునికి గురుదక్షిణగా సమర్పించాడు.
ద్రోణుడు సంతోషించాడు.
ద్రోణుడు ఆనందించాడు. శిష్యుని పరాక్రమానికి సంతోషించాడు. ద్రుపదుడితో అన్నాడు- ‘‘రాజా! నేన మరలా నీతో మైత్రినే కోరుతున్నను. యజ్ఞసేనా! రాజుకానివాడు రాజకు మిత్రుడు కాలేడన్నావు కదా! అందుకోసమే, రాజ్యంకోసమే నేను నీతో యుద్ధం జేసి రాజ్యాన్ని సంపాదించాలనుకున్నాను. ఇప్పటినుండి నీవు గంగానదికి దక్షిణ దిక్కుగా రాజుగా ఉండుము. ఉత్తర దిక్కుకు నేను రాజును’’ అని అనగా, ద్రుపదుడు, ద్రోణా అట్లానే కానీ! మహామతీ! నీకు ఇష్టమైన విధంగా మన పూర్వపు స్నేహాన్ని దృఢంగా ఉండనీ!’’ అని అన్నాడు.
అలా పరస్పరం మాట్లాడుకొని ఎవరి స్థానాలకు వారు వెళ్లిపోయారు.
6
అలా వెనుదిరిగిన ద్రుపదుడు అవమానభారంతో క్రుంగిపోయాడు. మనసు ప రిపరి విధాల ఆలోచించపసాగింది.
జరిగిన అవమానభారిన్న సహించలేక వ్యాకులయ్యాడు. ద్రోణుడిపై ప్రతీకార వాంఛ ఎక్కవైంది. యుద్ధంలో ద్రోణుని వధించగల ఒక పుత్రుడినీ, మహావీరుడూ, తనను పట్టి బంధించిన శస్త్రాస్త్ర విద్యా నిపుణుడు అయిన అర్జునునికి భార్యకాగల ఒక పుత్రికను పొందాలని నిర్ణయించాడు. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము