భక్తి కథలు

యాజ్ఞసేని-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిదినము బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులున్న ప్రదేశాలను సందర్శించివారికి సేవ చేయనారంభించాడు. ఒకనాడు ద్రుపదుడు గంగాతీరంలో కల్మాషీనగర ప్రాంతంలో వానప్రస్థాశ్రమ జీవనం గడుపుతున్న ఇద్దరు బ్రహ్మర్షులను చూ చాడు. వారు దీక్షితులు. వేదాధ్యయనంలో లగ్నమైన వారు.
వారు కాశ్యప గోత్రజులైన ‘యాజుడు, ఉపయాజుడు’ అనే యిద్దరు అన్నదమ్ములని తెలిసికొన్నాడు. సూర్యోపాసకులు, యోగ్యులు, సర్వదా వ్రతాచరణలో ఆసక్తిగలవారని గ్రహించి వారి వద్దకు వెళ్ళాడు. వారిలో చిన్నవాడు, తపోమహిమలో పెద్దవాడు అయిన ఉపయాజుడిని చూచి, అతడిని పూజించి అతడితో..
‘‘ఓ ముని శ్రేష్ఠా! నాకు మంచి కుమారుడిని ప్రసాదించే యజ్ఞాన్ని జరిపిస్తే ధన్యుడనౌతాను. ఒక లక్ష గోవులను లేగదూడలను కూడిన పాడి ఆవులను సమర్పించుకుంటాను’’ అని అన్నాడు.
అలా అన్న ద్రుపద మహారాజుతో ఆ మునిశ్రేష్ఠుడైన ఉపయాజుడు ఇలా అన్నాడు.
‘‘రాజా! నేను లాం ఫలాన్ని ఆశించడం లేదు. నీకు ప్రతిఫలం ఆశించేవాళ్ళు ఎవరైనా దొరికితే వారి వద్దకు వెళ్ళుము’’.
ఎదుటివారి తత్త్వం తెలిసికొనకుండా వారికి ప్రతిఫలం ఇస్తానని అనటం అవివేకవౌతుంది. అల్పులైనవారు అందుకు సంతోషిస్తారు. కానీ మహాత్ములు, తపఃసంపన్నులు ప్రతిఫలాన్ని ఆశించరు. అలాంటి ప్రతిపాదన వస్తే అది అవినయంగా, అహంకారంగా భావిస్తారు.
అలా నుడివిన ఉపయాజుని మాటలకు నిరాశ చెంది ద్రుపద మహారాజు అప్పటికి ఎదురు మాటాడక వెళ్లిపోయాడు. తన కోర్కె నెరవేరాలంటే వారిని ప్రసన్నం చేసికొనటం తప్ప మరొక మార్గం లేదని భావించిన ద్రుపదుడు నిరాశజెందక ప్రతిరోజూ ఉపయాజుని దర్శనం గావించుకొని ఒక సంవత్సరం పాటు అతడిని విడువక సేవించటం మొదలుబెట్టాడు.
ద్రుపదుడు తన వద్దకు వచ్చి తనను సేవించడం చూచిన ఉపయాజుడు అతడిపై జాలి కలిగి ఒకరోజు అతడితో..
‘‘ఓ ద్రుపద మహారాజా! మా అన్న ‘యాజుడు’ పాపరహితమైన నడవడి కలవాడు. ఒకనాడు అతడు శుచియైనదా కాదా అని భావించక నేల మీద పడిన పండునొకదానిని తెలిసి కూడా దాన్ని గ్రహించాడు. అది చూచిన నేను అతడు ప్రతి వస్తువును గ్రహించడానికి వెనుకాడడని తెలిసికొన్నాను. గురుకులంలో ఉండి వేదాధ్యయనం చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు ఇతరులు వదలిపెట్టిన భిక్షను తినేవాడు. పైగా నిస్సిగ్గుగా ఆ అన్నంలో రుచిని మెచ్చుకొనేవాడు. దాన్ని బట్టి ఆలోచిస్తే నా సోదరుడు కేవలం ఫలాసక్తుడనిపించింది.
ఫలాన్ని కోరేవాడు దానికి సంబంధించిన దోషాలను లెక్కలోనికి తీసుకొనడు. కావున ఆ మునిశ్రేష్ఠుని చూచి అతడిని యాచించము. అతడు నీవు కోరినదానిని చేయగలడు. నీ చేత యాగం చేయించగలడు’’ అని అన్నాడు.
ద్రుపదుడు అమితానందభరితుడయ్యాడు. సంతోషంతో ఉపయాజునికి మనస్సులో శత సహస్ర నమస్కారాలు చేశాడు. తన కోరిక ఫలించగలదనే ఆశ చిగురించింది.
వేదాధ్యయన సంపన్నుడూ, పంచమహాయజ్ఞాలయిన దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం మరియు బ్రహ్మయజ్ఞం చేసేవాడు, పొలాలలో పైరుకోసిన తరువాత రాలిపడిన (జారిపడిన) వెన్నులు, గింజలు మొదలైన వాటిని ఏరుకొని ఉంఛవృత్తిని పాటించేవాడు, భిక్షాటన చేసి దాని చేత కుటుంబ భారాన్ని వహిస్తూ భయంకరమైన తపస్సు జేసేవాడిని గంగాతీరంలో నివాసమున్న ‘యాజుడి’ని దర్శించుకొన్నాడు ద్రుపదుడు.
‘‘మునిశ్రేష్ఠా! పాంచాల దేశ రాజునైన నేను ‘ద్రుపదుడు’ అనేవాడిని నీకు నమస్కరించుకున్నాను. నా కోరిక ఫలించేటట్లు నాకు సహాయం చేయండి. స్వామీ తమకు ఎనిమిది వేల ఆవులను సమర్పించుకొంటాను. నా చేత యాగం చేయించండి. ద్రోణుని మీద పగతో తపించిపోతున్నాను. నాకు మిత్రుడు. అతణ్ణి గౌరవించలేదన్న ఆలోచనతో నన్ను పరాభవించాడు. బుద్ధిమంతుడు, కౌరవుల గురువులలో ముఖ్యుడు. అతడిని మించిన క్షత్రియుడు లోకంలో ఒక్కడూ లేడు. అతడి బాణ సమూహం శరీరాన్ని, ప్రాణాలను కూడా హరించగలవు.
బ్రాహ్మణ రూపంలో నున్న క్షాత్రమే ద్రోణుడు. ఆయన అస్తబ్రలం భీకరమైనది. అతడిలో బ్రాహ్మక్షాత్ర తేజస్సులు రెండూ ఉన్నా బ్రహ్మ తేజేస్సే ఎక్కువ. కేవలం క్షాత్రబలం కారణంగా నేను అతడికన్నా తక్కువే.
కావున బ్రహ్మ తేజ సంపన్నులైన మీ శరణు కోరుచున్నాను. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము