భక్తి కథలు

యాజ్ఞసేని-9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రోణుని సంహరించగల కుమారుని పొందాలని కోరుచున్నాను. నా మనోరథాన్ని సఫలం చేయండి! పది కోట్ల ఆవులనయినా ఇస్తాను’’ అని చేతులు జోడించి వేడుకొన్నాడు.
ద్రుపదుడి దీనాలాపనలను విన్న యాజుడు ప్రసన్నుడైనాడు. ద్రుపదునితో-
‘‘ద్రుపద మహారాజా!
నీ కోరికకు తగిన ఒక కుమారుడు, ఒక కూతురు నీకు జన్మిస్తారు. భయపడవద్దు. యజ్ఞ సాధనాలనూ, పదార్థాలను సిద్ధంచేసుకొని రమ్ము. అంతేకాదు నా తమ్ముడైన ఉపయాజుని సహాయకుడిగా యాచించుము’’ అని అన్నాడు.
ఆ మాటలకు సంతృప్తి చెందిన ద్రుపదుడు తిరిగి తన రాజధాని కాంపిల్యానికి వచ్చాడు. మంత్రులను, తదితర పరివారాన్ని పిలిపించాడు యజ్ఞానానికి కావలసిన వాటిని సిద్ధం జేయటానికి పురమాయించాడు. యజ్ఞవాటికకు కావలసిన స్థలాన్ని, తగిన సౌకర్యాలను ఏర్పర్చడానికి తగిన వారిని నియమించాడు.
బ్రాహ్మణులకు భోజన సదుపాయాలను, దాన ధర్మాలను చేయడానికి కావలసిన గో ధన వస్తువులను సేకరించవలసిందిగా ఆజ్ఞాపించాడు.
వాస్తుశాస్తమ్రందు సమర్థులైన వారిని రప్పించాడు.
ధార్మికోత్తములైన పెద్దలను యజ్ఞ పరిసమాప్తి వరకు కార్య నిర్వహణలో నిమగ్నులై యుండు వారిని నియమించాడు.
వేదికకు కావలసిన ఇటుకలను సిద్ధపరచేవారిని రప్పించాడు. వేదికను సర్వాంగ సుందరంగా నిర్మించాలని పురమాయించాడు. స్రుక్ స్రుకాది ఉపకరణాలను చేయు వడ్రంగులకు పనులు అప్పగించాడు. ఎవరికైనను ఎలాంటి అసౌకర్యం కలుగకుండునట్లు ఏర్పాటు గావించాడు. యజ్ఞానానికి కావలసినవన్నీ సిద్ధముజేయబడ్డాయి.
యజ్ఞం చేయించే ‘యాజుడు’ వచ్చాడు. తనకు సహాయకుడుగా తమ్ముడైన ఉపయాజుని నియమించుకొన్నాడు.
‘ద్రుపదుడు’ యజ్ఞదీక్షను స్వీకరించాడు ధర్మపత్ని కోకిలాదేవి సమేతుడై ఉన్న ద్రుపదుని చేత యజ్ఞోపయాజులు శాస్త్రోక్తంగా పుత్రకామేష్ఠి యాగాన్ని చేయించారు. మంత్రాలతో వ్రేల్చిన హోమద్రవ్యాలతో అగ్నిహోత్రుడు సంతృప్తిని చెందాడు.
అంత యజ్ఞకుండం నుంచి అగ్నిజ్వాలవలె భయంకరమైన శరీరంగల వాడు, పెద్ద ధనుస్సు చేత ధరించినవాడు, శ్రేష్టమైన కవచాలతో ప్రకాశించే కిరీటంతో అలంకరింపబడినవాడు, రథాన్ని అధిరోహించినవాడు, మహా తేజస్వి అయిన ఒక పుత్రుడు అగ్నిహోత్రునివలె పుట్టాడు. అలా ఉదయించిన ఆ కుమారునికి దృష్టద్యుమ్నుడు అనే పేరును ప్రజలందరికీ తెలిసేటట్లుగా ఆకాశవాణి పలికింది.
తదపరి అగ్నికుండం నుండి వంశాన్ని పావనము చేసేది, నల్లకలువల వంటి శరీర వర్ణంగలది, కలువ గంధం వంటి మేని సుగంధం గలది, విప్పారి విల్లులా వంగిన కనుబొమలతో కళకళలాడే పెద్ద కలువ రేకులవంటి కన్నులు గలది, అరాళకుంతల విభాసిని (వంకరగా తిరిగిన వెంట్రుకలు గలది. నల్లని ముంగురులు గలది), ఎతె్తైన వక్షస్థలంతో మనోహరంగా నున్నది, దివ్యమైన తేజస్సును ధరించినది, మృదు మనోహరమైన ఆకారం గలది, భూలోకంలో ఆమె వంటి అందగత్తె లేదనిపించే విధంగా ఉదయించింది. అలా పుట్టిన ఆ కన్యకు ‘కృష్ణ’ అనే పేరును ప్రజలందరికినీ తెలిసే విధంగా ఆకాశవాణి పలికింది.
యజ్ఞకుండం నుండి జన్మించిన ఆమె ‘యాజ్ఞసేని’. పాంచాల రాజపుత్రి కావున ‘పాంచాలి’గానూ, ద్రుపద రాజపుత్రిగావున ‘ద్రౌపది’గానూ వ్యవహరింపబడింది.
7
యజ్ఞకుండం నుండి ధృష్టద్యుమ్నుడు అనే కొడుకును పొందాడు ద్రుపద మహారాజు. అతడు పుడుతూనే అగ్నిజ్వాలవలె ప్రకాశిస్తూ పెద్ద ధనస్సు చేత ధరించి, శ్రేష్ఠమైన కవచాలతో వెలుగులు జిమ్మే రత్న ఖచితమైన కిరీటంతో, గొప్ప రథాన్ని అధిరోహించి యజ్ఞకుండం నుండి బయటికొచ్చాడు. తండ్రికి నమస్కరించాడు. తదుపరి ఒక కన్య సర్వాంగ సుందరి అయిన యాజ్ఞసేని అనబడే ద్రౌపది ఆ యజ్ఞకుండం నుండి బయటకు వచ్చింది. తండ్రికి నమస్కరించింది. తల్లి ప్రక్కకు చేరింది.
కొన్ని రోజులు కొడుకునూ, కూతురునూ చూస్తూ ఆనందంతో ఉండిపోయాడు ద్రుపదుడు.
ఒకనాడు దృష్టద్యుమ్నుడిని పిలిచాడు ద్రుపదుడు.
కొడుకు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు.
అతణ్ణి చూచి ఆనందంతో
‘‘పుత్రా! దృష్టద్యుమ్నా! నీవు అస్తవ్రిద్యలో నిష్ణాతుడివి కావాలి. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము