భక్తి కథలు

యాజ్ఞసేని-10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా మిత్రుడైన ద్రోణాచార్యుడి వద్ద అస్త్ర విద్య నభ్యసించుము. అతడు గొప్ప ధనుర్విద్యా పారంగతుడు. బ్రాహ్మణ క్షత్రియ తేజస్సు కలవాడు. వెంటనే బయలుదేరి వెళ్ళుము’’ అని అన్నాడు.
‘‘తండ్రీ! మీరు నన్ను ఆ ద్రోణుణ్ణి చంపగిలిగినవాడిగా పొందారు. ఆ ద్రోణాచార్యులవారు నన్ను శిష్యునిగా స్వీకరించి అస్త్ర విద్యను ప్రసాదిస్తాడా’’ అని సందేహాన్ని వ్యక్తపరిచాడు.
‘‘పుత్రా! అతడు ఆచార్యుడు. క్షత్రియ రాకుమారులకు అస్త్ర గురువు. ఎప్పుడూ విద్య నేర్పటానికి అభ్యంతరం చెప్పడు అనర్హుడైతే తప్ప. మాకు సంధి కుదిరింది. నిస్సందేహంగా వెళ్ళుము’’ అని అన్నాడు ద్రుపదుడు.
ఒక మంచి ముహూర్తాన దృష్టద్యుమ్నుడు బయలుదేరి కురు రాజ్యంలోనున్న ద్రోణాచార్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు ఆశ్రమంలో ఒక వేదికపై ఆసీసనుడై శిష్యులకు ఏవో బోధిస్తున్నాడు. దృష్టద్యుమ్నుడు అల్లంత దూరాన తన రథాన్ని ఆపి ధనస్సుని ధరించి పాదాచారుడై మెల్ల మెల్లగా నడుచుకుంటూ ఆచార్యుని వద్దకు పోయి ఎదురుగా నిలబడి వినయంతో దండ ప్రణామాన్నాచరించాడు. లేచి నిలబడి ముకుళితహస్తుడై వినయంగా-
‘‘ఆచార్యా! గురుదేవా! నా పేరు దృష్టద్యుమ్నుడు. దక్షిణ పాంచాల దేశాధీశుడు. తమకు మిత్రుడు అయిన ద్రుపద మహారాజు కుమారుడును. తండ్రిగారి ఆజ్ఞ మేరకు తమ వద్ద అస్తవ్రిద్యను అభ్యసించటానికైవచ్చాను. నన్ను దయతో తమ శిష్యుడిగా స్వీకరించండి’ అని అన్నాడు.
‘‘ఆయుష్మాన్‌భవ!’’ అని అతణ్ణి ద్రోణుడు తనకు కొంత దగ్గరలో కూర్చోమని సైగ చేశాడు. ధృష్ట్ధ్యుమ్నుడు ఆచార్యుడి సమీపానికి వచ్చాడు.
‘‘మీ తండ్రి ద్రుపుడు, మీ తల్లి కోకిలా దేవి, మీ అన్నదమ్ములు, సోదరి యాజ్ఞసేని క్షేమమే గదా? ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు గదా? ధర్మపాలన జరుగుచున్నది కదా?’’ అని అన్నాడు ఆచార్యుడు.
‘‘మీ దయవలన అందరూ క్షేమమే’’ అని దగ్గరలో ఉపవిష్ఠుడయ్యాడు.
కొంత తడవు శిష్యులకు ఏవో బోధించిన తరువాత అక్కడ వున్న ఆశ్రమవాసులను పిలిచి దృష్టద్యుమ్నునకు రాజకుమారులకు తగిన విధంగా నివాసయోగ్యాన్ని కల్పించమని ఆజ్ఞాపించాడు ద్రోణుడు. దృష్టద్యుమ్నుడిని చూచి ‘‘కుమారా! దృష్టద్యుమ్నా! ప్రయాణ బడలిక ఉపశమించ నేటికి విశ్రాంతి గైకొనుము’’ అని లేచి తన ఆశ్రమంలోనికి వెళ్లిపోయాడు.
దృష్టద్యుమ్నుడు కూడా గురువుగారి ఆజ్ఞమేరకు తనకు నిర్ణయించిన కుటీరానికి వెళ్లిపోయాడు.
ద్రోణుడు ఆశ్రమంలోని వేదికపై కూర్చున్నాడు. దృష్టద్యుమ్నుని రాక ఒక విధంగా తనకు కొంత ఆందోళన కలిగించింది. తనను వధించగల ఒక కుమారుడి కొరకై ద్రుపదుడు పుత్రకామేష్ఠియాగం చేసి ఇతడి పొందాడు. అలాంటివానికి తాను అస్తవ్రిద్యలు నేర్పడమా అని విచారించాడు. కాని తాను ధర్మవిరుద్ధంగా ప్రవర్తించి రాజులను నొప్పింపగూడదు అని పరిపరి విధాలుగా ఆలోచించుచుండగా కొడుకు అశ్వత్థామ తండ్రి వద్దకు వచ్చి నిలబడ్డాడు. తండ్రిని చూసి-
తండ్రీ! ద్రుపదుడు కావాలనే తన కొడుకు దృష్టద్యుమ్నుడిని తమ వద్దకు అస్తవ్రిద్యనభ్యసించమని పంపాడు. దృష్టద్యుమ్నుని జన్మరహస్యం తమకు తెలియదా? అలాంటివారికి అస్త్ర విద్యలను ప్రసాదించి తమపై ప్రతీకారం తీర్చుకొనటానికి అవకాశాన్ని ఇస్తారా? అని అన్నాడు,
ఒక నిట్టూర్పు విడిచిన ద్రోణుడు కొడుకుతో-
‘‘పుత్రా! అశ్వత్థామా! నేను ఆచార్యుడను! నేను కొన్ని ధర్మాలను పాటించవలసిన అవశ్యకత వున్నది. భీష్మ పితామహులవారు తమ మనుమలకు అస్తవ్రిద్యలను నేర్పమని నన్ను నియమించాడు. అలాగే కురు రాజ్యానికి చుట్టూ యున్న జన పదాలనుండి కూడా ఎందరో రాకుమారులు అస్తవ్రిద్యలనభ్యసించటానికి వచ్చి చేరారు గదా! వారికి తెలుపని అభ్యంతరాన్ని ద్రుపదుని కొడుకు విషయంలో పాటించి తిరస్కరించలేను గదా! అది ధర్మవిరుద్ధమని అందరూ నిందించరా? అంతేగాక ఒక గురువుగా చూడవలసింది విద్యనార్జించవచ్చినవాడు ఒక శిష్యునికి కావలసిన అర్హతలు కలిగి ఉన్నాడా లేడా అని విచారించి నిర్ణయం తీసుకొనవలసి ఉంటుంది. క్షత్రియుల విషయంలో అలాంటిది ఉండదు. వారికి విద్యలు నేర్పటం తప్పనిసరి. రాకుమారుల విషయంలో వివక్ష తగదు. రాజాశ్రయంలో యున్న నాలాంటివారు శత్రు రాజుల రాకుమారుల విషయంలో కూడా వివక్షజూపకూడదు. ఒక్క రాజాజ్ఞతో తప్ప-
ద్రుపదుడు నా చిన్ననాటి మిత్రుడు. మేమిద్దరం ఒకే గురువు వద్ద విద్యనభ్యసించాము. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము