భక్తి కథలు

యాజ్ఞసేని-11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా విషయంలో ద్రుపదుడు రాజైన తర్వాత గర్వంతో ప్రవర్తించాడు. దానికి తగిన ఫలితాన్ని పొందాడు గదా? పాంచాల రాజ్యం రెండు ముక్కలయింది గదా? గర్వం అణిగిపోయింది ద్రుపదునికి. కానీ ఒక క్షత్రియుడిగా నాపై శత్రుత్వాన్ని విడువలేకపోయాడు. నన్ను జయించటానికి అతడికి వీలుగా యజ్ఞయాగాదుల ద్వారా నన్ను జయించగల ఒక కుమారుడిని పొందాడు. అది దైవనిర్ణయం. అది అడ్డుపెట్టుకొని అతడి కుమారుడిని శిష్యునిగా చేర్చుకొని అస్తవ్రిద్యలు నేర్పనని తిరస్కరించలేను. విధి నిర్ణయం ఎలాయుందో అదే జరుగుతుంది. నీవు నిశ్చితంగా ఉండుము’’అని సున్నితమైన ధర్మసూక్షాన్ని వివరించి పంపాడు.
మరునాడు ధృష్ట్ధ్యుమ్నుడు ప్రాతఃకాలంలోనే అందరితోపాటు గురువుగారిని దర్శించుకున్నాడు. గురువుకు నమస్కరించాడు. నిలబడ్డాడు. అతణ్ణి చూచి ద్రోణుడు- ‘‘కుమారా! నేటినుండినీవు నా వద్ద శ్రద్ధతో అస్తవ్రిద్యలభ్యసించవలసింది. చెప్పినవాటిని శ్రద్ధగా ఆకళించుకొని ప్రవర్తించము. కఠినమైన పరీక్షలను ఎదుర్కొనవలసి వుంటుంది. అప్పుడే విద్య అలవడుతుంది. నేడు నేర్వవలసిన దానికై ఉద్యుక్తుడవుగమ్ము’’ అని అన్నాడు.
గురుశిష్యులిద్దరూ అస్త్ర ప్రయోగాలు చేసే ప్రదేశానికి వెళ్ళారు.
ధృష్టద్యుమ్నుడు ద్రోణుని వద్ద సకల అస్త్ర విద్యలను అభ్యసించాడు. విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత ఒకనాడు గురువుతో
‘‘ఆచార్యా! నేటితో నేను నేర్వవలసిన విద్యలు తమ దయతో పూర్తి అయినవి. మీరు అనుమతిస్తే నేను నా రాజ్యానికి తిరుగు ప్రయాణవౌతాను. నేను శిష్యరికం వహించిన ఈ కాలంలో నావలన ఏవైనా తప్పులు జరిగియుంటే మీ పుత్రుని క్షమించినట్లుగా నన్ను కూడా క్షమించండి. మీకేమి గురుదక్షిణ ఇవ్వవలయునో ఆజ్ఞాపించండి. నా శక్తిమేర దానినివ్వటానికి ప్రయత్నిస్తాను’’ అని అన్నాడు.
కుమారా! ఏ గురుదక్షిణా అవసరం లేదు. క్షేమంగా నీ రాజ్యానికి చేరుము. విద్య నేర్పిన గురువుపట్ల సదా విధేయుడై ఉండటమే గొప్ప గురుదక్షిణ. నేడు నీకు అనుజ్ఞనిస్తున్నాను, క్షేమంగా వెళ్లిరా! అని ద్రోణుడు దృష్టద్యుమునికి అనుజ్ఞ ఇచ్చాడు.
దృష్టద్యుమ్నుడు గురువుగారి ఆజ్ఞను పొంది స్వరాజ్యానికి చేరాడు. తండ్రి ద్రుపద మహారాజుకు అన్ని విషయాలు సవివరంగా విన్నవించాడు.

8
అది ద్రుపద మహారాజు ఉ ద్యానవనం
రకరకాల పుష్పజాతులు విరజిమ్ముచు న్న సువాసనలతో హృదయాహ్లాదకరంగా ఒప్పుచున్నది. ఆ పూలవాసనలకు మూగిన తుమ్మెదల ఝుంకారధ్వనులు వాద్యఘోషను తలపిస్తున్నది. వసంత సోయగాలలో మామిడి చిగురులను, మొగ్గలను తిని మత్తెక్కిన కోయిలలు కూసే కూతలు యింపుగా చెవులను తాకుతున్నాయి.
బాగా పూచిన అశోకాల సంపెంగపూల ఘాటయిన వాసనలు అందరిని ఆహ్వానిస్తున్నాయి. ఒకే వరుసలో నాటిన మంచి గంధపు చెట్లతో, బరువైన గెలలో వంగిన రంభాతరువులు, వాటికి అలతి దూరంలో క్రిందికి జారుచున్న సెలయేరులు ఉద్యానవన శోభను మరింతగా ఇనుమడింపజేస్తున్నాయి.
పద్మాకారంలో నిర్మింపజేయబడిన రాతిమడుగులలోని పద్మాలు వికసించి సుగంధాన్ని చిమ్ముతున్నాయి.
రాజధానికి అతి సమీపంలోనున్న గంగానది మీదనుండి వీస్తున్న పిల్లవాయువులు మేనువును పులకింపజేస్తున్నాయి.
అందమైన ఉద్యానవనంలో అక్కడక్కడా నిర్మింపబడిన రాతిమండపాలకు అల్లుకున్న లతలు పూలతో వికసించి కీటకాలను ఆహ్వానిస్తున్నాయి.
పాలరాతితో నిర్మింపబడిన ఎతె్తైన వలయాకార మండపాలలో అందమైన వేదికలు ముచ్చటగొల్పుచున్నాయి.
మండపాల మధ్యభాగంలో వ్రేలాడదీయబడిన పంజరాలలోని పక్షులు కూసే పలు రకాల కూతలెన్నో వినిపిస్తున్నాయి. అది యధేచ్చగా పంజరాలోనికి వస్తూ పోతున్నాయి.
అక్కడక్కడ పంజరాలలోని రంగు రంగుల శుకాలు ఉద్యానవనంలో విహరిస్తున్నవారిని చూచి ‘‘రండి రండి! రండి కూర్చోండి! బాగున్నారా!’’ అని చిలక పలుకులతో పలకరిస్తున్నాయి.
అది సాయం సమయం, యాజ్ఞసేని మండపంలోని వేదికపై ఆసీనురాలై ఉన్నది. ఏదో పరధ్యానంలో మైమరచియున్నది.
పైనున్న రాచిలుక ఒకటి పంజరంలోనుండి బయటికి వంగి రాజకుమారిని చూచింది.
‘‘రాకుమారి! రాకుమారి!’’ అని అన్నది. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము