భక్తి కథలు

యాజ్ఞసేని-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వయంవరాన్ని తప్పక ప్రకటించి పాండవులు బయల్వెడలేటట్లు చేయాలి అని అన్నాడు.
తన తనయ పడుతున్న వేదను ద్రుపదుడు కూడా గమనించాడు. ద్రౌపది గొప్ప ధైర్యవంతురాలు, దృఢచిత్తురాలు అనే గొప్ప నమ్మకం ద్రుపదుడికి. తామిప్పుడు ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. తను పడ్డ కష్టం ఎట్లా వృధా కాగలదు. తన లక్ష్యం లక్ష్యంగానే ఉండగూడదు. పాండవుల ఉనికిని తెలిసికొంటానికి చేసే ప్రయత్నాన్ని విరమించగూడదు. ఆ ప్రయత్నంలోనే స్వయంవరాన్ని ప్రకటించటం ఒక భాగం కావాలి. అలా చేస్తే ద్రౌపదిని ఆశిస్తున్న కొన్ని దేశాల రాజకుమారుల ఆశలను కొంతవరకు అడ్డుకొనవచ్చును. స్వయంవరానికి పాండవులు వచ్చి అర్జునుడు పాంచాలిని చేబడితే తన కోరిక నెరవేరిట్లే అని ఆలోచిస్తున్న ద్రుపదుడు ఒక్కసారిగా ఏ జ్ఞప్తికొచ్చి దృష్టద్యుమ్నుడిని చూచి-
దృష్టద్యుమ్నా! శ్రీకృష్ణవాసుదేవుడిని ఒకసారి కలిసి మాట్లాడాలి. యాదవులకు ఆరాధ్యదైవమని వింటున్నాము. గొప్ప రాజనీతిజ్ఞుడని కూడా అంటున్నారు. అతడు చేసిన అనేక అద్భుతాలను గురించి ప్రజలు కథలు చెప్పుకొనడం వింటున్నాము. ప్రయత్నించి ఆ శ్రీకృష్ణ వాసుదేవుడిని ఇక్కడికి వచ్చేటట్లుగా చేయాలి. ఆ పనిని ఎలా సాధిస్తావో ఆలోచించు. గురుదేవుడు సాందీపాని వారి సహాయాన్ని అర్థించుము. వెంటనే బయలుదేరుము అని కోరాడు ద్రుపదుడు.
దృష్టద్యుమ్నుడు తండ్రి ఆజ్ఞతో అక్కడినుంచి నిష్క్రమించాడు.

9
ద్రుపద మహారాజు రాజభవనంపైన నిలబడి చూస్తున్నాడు.
అటూ నిటూ తిరుగుతూ ఆవేదనతో నిట్టూర్పులు విడుస్తున్నాడు. కొంతసేపు వీక్షించి తిరిగి క్రిందికి వచ్చాడు. రాజభవనంలోని విశాలమైన ఒక గదిలో ఆసనంపై ఆసీనుడయ్యాడు. అలా నిరీక్షిస్తుండగా ఒక ప్రతీహారి లోనికి ప్రవేశించాడు.
రాజుగారికి జయము! జయము అని నిలబడ్డాడు.
విషయమేంటి? అడిగాడు ద్రుపదుడు.
ప్రభూ! తమ దర్శనార్థమై దృష్టద్యుమ్నులవారు వేచి యున్నారు’’ అని అన్నాడు.
వెంటనే ప్రవేశపెట్టుము అని ఆజ్ఞాపించాడు రాజు.
దృష్టద్యుమ్నుడు లోనికి ప్రవేశించాడు. తండ్రికి పాదాలంటి నమస్కరించాడు.
ఆయుష్మాన్‌భవ! అని అన్నాడు ద్రుపదుడు. తండ్రి ప్రక్కనే ఆసీనుడయ్యాడు.
ఆరాటంలోనున్న ద్రుపదుడు అడిగాడు.
దృష్టద్యుమ్నా! పోయిన పని ఏమయింది? అని.
తండ్రీ! శ్రీకృష్ణవాసుదేవులవారికి తమ సందేశాన్ని విన్నవించాను. వారు వెంటనే వచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. తొందరలోనే వచ్చి తమను కలుస్తారు’’ అని అన్నాడు క్లుప్తంగా.
రెండు రోజులు గడిచాయి. మరునాడు వేగులవారు వచ్చి రాజదర్శనాన్ని కోరారు. రాజభటులు వారిని రాజమందిరంలోనికి ప్రవేశబెట్టి నిష్క్రమించారు. వేగులవారు అన్నారు- ప్రభువులవారికి జయము! జయము! అని.
ఏమిటి వార్తలు! విశేషాలేమిటి? మన రక్షణ వ్యవస్థ అప్రమత్తంగానే ఉన్నది గదా! అన్నాడు రాజు. ప్రభూ! గంగానదిలో కొన్ని పడవలు జనంతో నిండి రాజధానివైపునకు పయనిస్తున్నాయి. అందులోనున్నవారు ఎవరో ఇంకా గుర్తుపట్టవీలుగా లేదు. మన వేగులవారు అదేపనిలో వున్నారు. వారి వేషధారణబట్టి వారు బహు దూర ప్రాంతం నుండి వస్తున్నట్లు అనిపిస్తున్నది’’ అని మనవి చేశారు.
‘‘సరే! మీరు వెళ్లవచ్చు. వివరాలను సేకరించి వెంటనే వచ్చి తెలియపరచండి’’ అని ఆజ్ఞపించాడు ద్రుపదుడు.
వేగులు నిష్క్రమించారు.
కొంతసేపటికి దృష్టద్యుమ్నుడు భటులవలన తన రాకను తెలియపరిచి లోనికి ప్రవేశించాడు. తండ్రికి యధావిధిగా నమస్కరించి ఆశీస్సులను పొందాడు. ఆసీనుడై తండ్రితో- తండ్రీ! శ్రీకృష్ణవాసుదేవులవారు వస్తున్నట్లుగా వార్తలందాయి. వారి ఆంతరంగిక వ్యక్తులు వచ్చి విషయాన్ని తెలియపరచారు. వారి పరిమిత బలగం జలమార్గం ద్వారా వస్తున్నారు. ఏ సమయంలోనైనా వారు ఇక్కడ ప్రవేశించవచ్చును’’ అని చెప్పిన వెంటనే నిష్క్రమించాడు.
అది సాయం సమయము
ద్రుపద మహారాజు శ్రీకృష్ణుని రాకకై వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు.
గంగానదికి దక్షిణాన పాంచాల రాజ్యం వున్నది. ఇది దక్షిణ పాంచాలం.
పాంచాల రాజ్యానికి తూర్పుకు దిగువలో దక్షిణ దిశగా మగధ సామ్రాజ్యము విస్తరించి వున్నది.
రాజగృహము దాని రాజధాని.

- ఇంకా ఉంది

- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము