భక్తి కథలు

యాజ్ఞసేని-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మాటలు విన్న ద్రౌపది ఒక్కసారి ఆసాంతం పైకి క్రిందికి చూసింది. పెదవులు వణికాయి. పెద్ద నిట్టూర్పు విడిచింది. మెల్లగా అన్నది.
అయితే వాసుదేవా! మా తండ్రి కోరిన విధంగా మీరు సహాయం చెయ్యనంటారు!’’
ఆమె కళ్ళ వెంట అశ్రువులు ధారగా కారటం మొదలుపెట్టాయి. కానీ పెద్దగా విలపించలేకపోయింది. ఆమె దీనావస్థను గమనించాడు కృష్ణుడు. ఆమెకు ధైర్యం కలిగేటట్లుగా అన్నాడు.
యాజ్ఞసేనీ! నేను మీ తండ్రికి సహాయపడగలను. కానీ ఆయన ఆశించిన విధంగా మాత్రం కాదు. అలాంటి వాగ్దానం చేసే ముందు అన్నీ ఆలోచించాలి గదా!
వాసుదేవా! నీవు ధర్మపక్షపాతివనీ, ధర్మాన్ని రక్షించటానికే ఉన్నావనీ అందరూ అంటుండగా వింటున్నాము. అదే మేమూ కోరేది. అధర్మాన్ని అణచి మాకు సహాయం చెయ్యమని కోరుచున్నాము. మేము ద్రోణుని చేతిలో అతి ఘోరంగా అవమానింపబడ్డాము. అది మీకు తెలుసా’’ అని అన్నది. ఒకింత చనువు తీసికొని ధైర్యంతో వీవని సంబోధించింది.
అని విన్నాను. అందుకే గదా నీ తండ్రి యజ్ఞం చేసి నిన్ను పొందాడు. తనను పట్టి బంధించినవానికే నిన్నిచ్చి వివాహం చేయాలని అని నవ్వాడు.
పాండవులు మరణించారని వింటున్నాము. నా తండ్రి కోరిక ఎలా ఫలిస్తుంది? అని అన్నది ద్రౌపది.
వారు మరణిచారని నీకెలా తెలుసు అని అడిగాడు కృష్ణుడు.
ప్రజలందరూ పాండవులు లాక్షాగృహంలో మరణించారనీ అంటున్నారు కదా! ఆ వార్త విని నా తండ్రి బాధపడుతున్నాడు. వారు మరణించలేదని నీకేమైనా తెలుసా? అన్నది ద్రౌపది.
అది నిజమని ఎలా చెప్పగలరు అన్నాడు.
అయితే వారు బ్రతికే ఉన్నారన్నమాట! అన్నది ద్రౌపది ఒక విధమైన ఆశతో.
ద్రౌపది తెలివిని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు వాసుదేవుడు. తనకు తెలుసని ఎలా చెప్పగలడు.
అని నేననలేదు గదా! అందరూ అనుకుంటున్నదానికి తగిన ఆధారాలు ఉండాలి కదా! వేచి చూడాల్సిందే అన్నాడు కృష్ణుడు.
ఇందులో ఏదో హస్యం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. నిజమేమిటో తెలిస్తే చెప్పవచ్చుగా! రెట్టించింది ద్రౌపది.
నిజానిజాలను కాలమే నిర్ణయిస్తుంది. అందరం వేచి చూడాలి. వారు మరణించలేదని తెలిస్తే అందరికీ సంతోషమే కదా! అన్నాడు వాసుదేవుడు.
కొంతసేపు నిశ్శబ్దం ఆవరించింది. ద్రౌపది మరలా ఆలోచనలో పడింది. కళ్ళు చెమర్చాయి.
ఇంతలో తెలవారబోతున్నట్లుగా ప్రజల సంచార శబ్దాలు వినిపిస్తున్నాయి.
ఎంతసేపు కళ్ళు మూసుకొని వౌనంగా ఉన్నదో ద్రౌపదికి తెలియదు. కళ్ళు తెరిచి చూచింది. తనతో ఇంతవరకూ మాట్లాడిన వాసుదేవుడు కళ్ళెదుట లేడు. హృదయం బరువెక్కింది. గవాక్షాలకుగల తెరలనుండి మసక వెలుతురులు లోపలకు తొంగి చూస్తున్నాయి. ఎంతో దూరం నుండి కూస్తున్న పక్షుల కిలకిలారావాలు ఒక్కింత చెవులకు వినిపిస్తున్నాయి. బరువెనక్కిన నయనాలతో తెలియకుండానే నిద్రలోనికి జారిపోయింది ద్రౌపది.
అలా ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. ఇంతలో దాసీ జనం వచ్చారు. అప్పటికే భానుడు తన తీవ్రమైన కిరణాలతో వెలుగులు చిమ్ముతున్నాడు. గవాక్షాల ద్వారా సూర్యభగవానుని రంగు రంగుల కిరణాలు గదిలోనికి తొంగి చూస్తున్నాయి.
అమ్మా! రాకుమారి! ఇప్పుడు ప్రొద్దెంతో తెలుసా! లెండి! అని అన్నది చెలికత్తె.
నిద్రనుంచి లేచిన ద్రౌపది అలానే మంచంపై కూర్చున్నది. రాత్రి జరిగినంతా తన కళ్ళముందు మళ్లీ దృశ్యరూపంలో కనబడుచున్నది. అది నిజమా లేక కలయా అని హృదయంలో తర్కం మొదలైంది. తనకు వాసుదేవునకు మధ్య జరిగిన సంభాషణ అంతా యదార్థమా లేక స్వప్నమేనా! కాదు అది నిజమే అని ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ వాసుదేవుని విచిత్రమైన లీలలెన్నో ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అవన్నీ నిజమైతే రాత్రి జరిగిందంతా కూడా నిజమే. వాసుదేవుడే వచ్చాడు. సందేహాం లేదు అని లేచి నిలిచి దాసీజనంతో కలిసి అక్కడినుంచి నిష్క్రమించింది.
11
ద్రుపదుడు తన ఆసనంపై ఆశీనుడై ఉన్నాడు.
తండ్రికి కుడివైపున దృష్టద్యుమ్నుడు ఆశీనుడై ఉన్నాడు.తన బంధువులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, బ్రాహ్మణులు, తన పాంచాల రాజ్య పురోహితుడు కూడా వారి వారి ఆసనాలపై కూర్చుని ఉన్నారు. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము