భక్తి కథలు

యాజ్ఞసేని-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన బంధువులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, బ్రాహ్మణులు, తన పాంచాల రాజ్య పురోహితుడు కూడా వారి వారి ఆసనాలపై కూర్చుని ఉన్నారు.
ద్రుపదుడు దీర్ఘాలోచనలో ఉన్నాడు. అతిలోక సుందరియైన తన కూతురు ద్రౌపదిని తాను కోరుకొన్నట్టు గొప్ప ధనుర్విద్యా శ్రేష్ఠుడైన అర్జునునికి ఇవ్వాలని ఇన్నాళ్ళు పరితపిస్తున్నాడు. పాండవులందరూ లాక్షాగృహంలో మరణించారనీ అంటున్నారు. అది నిజమా! కాదా? వారు నిజంగానే మరణించారా లేక సజీవంగా ఉన్నారా అని నిర్థారించుకొనటానికై వేగులను పంపాడు. వారందరూ తిరిగి వచ్చారు. పాండవుల జాడ తెలియలేదని సవినయంగా విన్నవించారు. ఆ మాటలను విన్న ద్రుపదుడు వ్యాకులచిత్తుడయ్యాడు. ఏమి చెయ్యాలా అని తనవారిని, మంత్రులను మొదలైనవారిని తనవద్దకు రప్పించాడు.
దృష్టద్యుమ్నుడు అన్నాడు, తండ్రీ! అందరూ వచ్చారు. ఇక మనం ముందు చెయ్యవలసిన కార్యక్రమాన్ని నిర్ణయించుకోవాలి! అని.
ద్రుపదుడు ఆలోచనలనుండి తేరుకొన్నాడు. వచ్చిన వారినందరినీ చూచాడు. వారితో ‘‘ప్రియబాంధవులారా! దుష్టుడైన ధృతరాష్ట్రుడి పుత్రుడైన దుర్యోధనుడు వంచించి పాండవులను లాక్షాగృహంలో ఉండగా అగ్నికి ఆహుతులయ్యేటట్లు చేశాడు. పాండవులు మరణించినట్లుగా తెలియనైనది. ఇంత ఘోర కృత్యాన్ని ఇంతవరకు మరెవరూ చేయగా చూడలేదు. చేసినట్లు వినలేదు. నా స్వంత బిడ్డలు పోయినట్లుగా వున్నది. ఎంతో దుఃఖితుడనైనాను. అందు నా అర్జునుడి రూపము అద్భుతమైనది. అతడి ధైర్యం ఆశ్చర్యకరమైనది. ఆ పరాక్రమం, ఆ అస్త్ర ప్రయోగం అనన్య సామాన్యము. పగలు రాత్రి కూడా అతడి గురించే నా ఆలోచన. తల్లితో సహా అగ్నికి ఆహుతయ్యారు. లోకంలో ఇంతకన్నా ఆశ్చర్యమేముంది? కాలానె్నవరూ అతిక్రమించలేరు గదా! నా శ్రమంతా వృధా అయింది గదా! నా ప్రతిజ్ఞ కూడా వ్యర్థమైనది. నేను లోకులకేమని చెప్పగలను. నాలో నేనే కుమిలిపోతున్నాను. మహర్షులైన యాజోపయాజులను అర్థించి ద్రోణుని వధించగల కొడుకునూ, అర్జునుడికి భార్య కాగల కూతురను కోరాను. ఈవిషయం ప్రజలందరికినీ విదితమే. స్వయంగా యాజముని శ్రేష్ఠుడు కూడా దానిని ప్రకటించాడు కదా! పుత్రకామేష్టి చేసి ధృష్టదృమ్యుడిని, కృష్ణనూ పొందగల్గాను. వారి పుట్టుక నాకు ఆనందదాయకమే. కానీ ఇప్పుడేమి చేయగలను. ఆ అర్జునుడు మరణించాడు’’ అని అన్నాడు. దుఃఖించాడు, రోదించాడు.
ఆ ద్రుపదుని ఆవేదనను చూచిన పాంచాల రాజ పురోహితుడు అన్నాడు- ‘‘ద్రుపద మహారాజా! పాండవులు పెద్దల మాటలను మన్నించేవారు. ధర్మస్వరూపులు. అటువంటివారు నశించుటయన్నది జరుగదు. వారు పరాజితులు కారు. మహారాజా నేను గ్రహించిన సత్యాన్ని ఆలకించండి. బ్రాహ్మణులు ఈ సత్యాన్ని ప్రతిపాదించారు. వేద మంత్రాలలో కూడా దానిని విన్నాను. గతంలో ఇంద్రాణి (శచీదేవి) బృహస్పతి ద్వారా ఉపశ్రుతి మహిమ విన్నది. ఆ ఉపశ్రుతి అదృశ్యుడై పోయిన ఇంద్రుని తామరతూటి ముడిలో దర్శింపజేసింది. ఈ విధంగా పాండవుల విషయంలో కూడా నేను ఉపశ్రుతిని విన్నాను. వారు ఎక్కడో ఒకచోట జీవించియే ఉంటారు. అనుమానం లేదు పాండవులు తిరిగి వచ్చే సూచనలు నాకు మిక్కుటంగా కనిపిస్తున్నాయి. కారణం క్షత్రియులకు స్వయంవరమే కన్యాదానానికి శ్రేష్ఠమైన మార్గమని చెప్పబడుచున్నది. అందుచేత ద్రుపద మహారాజా! నగరంలో స్వయంవరాన్ని చాటింపుము. దూరంగా ఉన్ననూ, దగ్గరగా యున్ననూ, ఎక్కడ యున్నా సరే పాండవులు కుంతీదేవి సహితంగా స్వయంవరానికి తప్పక వస్తారు. ఆలస్యం చేయక స్వయంవరాన్ని ప్రకటింపుము’’ అని అన్నాడు.
ఆ పురోహితుని మాటలను విన్న ద్రుపద మహారాజు మహదానంద పడ్డాడు. మనసు కాస్త కుదుటబడింది.
నేటికి డెబ్బది అయిదవ రోజున పురోహితులు నిర్ణయించిన ప్రకారం పుష్యమాసంలో, శుక్లపక్షంలో ఏకాదశినాడు రోహిణీ నక్షత్రంలో స్వయంవరం జరుగునట్లుగా నగరంలో ప్రకటింపజేశాడు.
12
అది రాజభవనము
దాసీ జనం చిత్రపటాలను చేత ధరించి వాటి ఒక వరుసలో అతి జాగరూకతతో రాజభవనంలోని విశాలమైన ప్రాంగణంలో పేరుస్తున్నారు. రాజకుమారి ద్రౌపది చెలికత్తెలైన ధాత్రేయిక, యశస్విని, చిత్రలేఖ, కాంపిలిని, కాహళి, మనసివన, వనమంజరి మొదలైనవారు వచ్చి ఆ చిత్తరువులు ఏయే దేశ రాజకుమారులవో వివరంగా తెలిసికొని వెళ్లారు.
అర్జునునికి భార్యకాగల ఒక కూతురు కావాలని ద్రౌపదిని పొందాడు ద్రుపద మహారాజు.
- ఇంకా ఉంది

- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము