భక్తి కథలు

యాజ్ఞసేని-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విషయం పాంచాల రాజ్యానికి చుట్టూ యున్న రాజులందరికీ తెలిసిన విషయమే. అయితే పాండవులందరూ లాక్షగృహంలో మరణించారన్న వార్త దావానలంగా జనపదాలకు తెలిసిపోయింది.
అది అదనుగా కొందరు రాజులు అతిలోక సుందరి అయిన యాజ్ఞసేనిని పొందాలనే ఉద్దేశ్యంతో ద్రుపదునికి కబురంపినవారు, చిత్రపటాలను పంపినవారు ఉన్నారు.
చెలికత్తెలు ఆనందంతో హడావుడిగా ద్రౌపది వద్దకు వచ్చారు. బలవంతాన ఆమెను చేయి పట్టుకొని చిత్రపటములు పేర్చిన ప్రాంగణానికి కొనివచ్చారు. ద్రౌపది అయిష్టంతో వాటిని చూడవచ్చింది.
రాకుమారి! ఇదిగో చూడుము. ఈ చిత్తరువు హస్తినాపురాధీశ్వరుడైన దృతరాష్ట్రుని జ్యేష్ఠ పుత్రుడు దుర్యోధనునిది అని అన్నది చిత్రలేఖ.
అతడికి ఇదివరకే వివాహమైంది కదా. భానుమతి అనే భార్య ఉంది గదా! అన్నది యశస్విని. అయితేనేం సౌందర్యరాశి అయిన ద్రౌపది కూడా కావాలనుకుంటున్నాడేమో? అన్నది మరొక చెలికత్తె.
అంతేకాదు ఈతడు కళింగ దేశపు రాజైన చిత్రాంగదుడు తన కూతురు శుభాంగికి స్వయంవరాన్ని ప్రకటింపగా అక్కడికి వెళ్ళాడు. స్వయంవరంలో శుభాంగి ఇతడిని చూడటం ఇష్టం లేక దాటివెళ్లిందని ఆగ్రహించి ఆమెను బలవంతంగా ఎత్తుకొని రథంపై నిడుకొని వెళ్లగా, అడ్డుపడినవారినందరినీ సూతపుత్రుడైన కర్ణుడు ఎదుర్కొన్నాడట. అంతటి ఘనుడీతడు’’ అని అన్నది మరొక చెలికత్తె.
‘‘అలానే ఇక్కడ కూడా చేద్దామనా?’’ అని అన్నది కాహళి.
‘‘ఇది ద్రుపద మహారాజు రాజ్యం, అంత తేలిక కాదు’’ అని అన్నది యశస్విని.
‘‘ఈతడి తండ్రి ధృతరాష్ట్ర మహారాజుకు లెక్కకు మించిన భార్యలని వింటున్నాము గదా!’’ అన్నది కాంపిలిని.
‘‘గాంధారిదేవితో సహా ఆమె పదిమంది చెల్లెళ్ళను వివాహం చేసికొన్నాడు. వారుగాక ఒక వైశ్య కన్య అయిన సుగాధ అనే ఆమెను కూడా వివాహం చేసికొని యుయుత్సుడు అనే కొడుకును కూడా పొందాడు గదా!’’ అన్నది ధాత్రేయిక.
అంతేనా! నాలుగు వర్ణాల్లోని నాలుగో వర్ణం కన్యలను వందమందిని కూడా పెండ్లాడాడు కదా?’’ అన్నది కాహళి.
వౌనంగా వింటున్న ద్రౌపది ముందుకు కదిలింది.
‘‘ఇదిగో! ఈ చిత్రపటం ఛేదిభూపతి శిశుపాలునిది’’ అని అన్నది యశస్విని.
‘‘ఇతగాడు మగధరాజైన జరాసంధునికి మిత్రుడు గదా!’’ అని అన్నది కాంపిలిని.
‘‘ఇతడికి కూడా ఒక చరిత్ర ఉన్నది’’ అని అన్నది కాహళి.
‘‘అదేమిటి’’ అడిగింది కాంపిలిని.
‘‘ఈతడు భభ్రువు అనే ఒక యాదవ శ్రేష్ఠుని భార్యను ఎత్తుకొని పోయి ఆమెను బలవంతంగా తన భార్యగా చేసికొన్నాడు’’ అని చెప్పింది కాహళి.
‘‘అవును జరాసంధుడు కూడా తన మనుమడైన మేఘసంది చిత్ర పటమును మహారాజుగారికి పంపారు కదా!’’ అని అన్నది ధాత్రేయిక.
‘‘ఇదిగో ఆ చిత్తరువు!’’ అని చూపించింది మనస్విని.
ద్రౌపది ఒకింత చలించినట్లయింది. ‘‘తన బలాన్ని చూసి భయపెట్టాలని అనుకుంటున్నాడా?’’ అని అన్నది ద్రౌపది.
‘‘ఇదిగో ఈ చిత్తరువు కళింగ దేశాధిపతిది రాజకుమారి’’ అన్నది మనస్విని.
యాజ్ఞసేని ముందుకు కదలింది.
‘‘అమ్మా! ఈ చిత్రంలో ఉన్నది సుమిత్ర దేశాధిపతి!’’ అన్నది వన మంజరి.
అహా! అని వౌనంగా కదిలింది.
‘‘ఇంతమంది చిత్రపటములలోనివారు ఎవరు కూడా రాకుమారికి నచ్చనట్లున్నది’’ అన్నది యశస్విని.
‘‘మనసంతా అర్జునుని కోసం వెదుకులాడుచున్నది గదా!’’ అని అన్నది ధాత్రేయిక చిలిపిగా.
ఇంతలో దృష్టద్యుమ్నుడు అక్కడికి వచ్చాడు. చిత్రాలను తిలకిస్తున్న చెల్లెలు ద్రౌపదిని చూశాడు.
‘‘యాజ్ఞసేని! వీరిలో ఎవరైనా నచ్చారా!’’ అని అడిగాడు.
సోదరా! పాండవుల జాడ ఏమైనా తెలిసిందా? వెళ్లిన వేగులవారు తిరిగి వచ్చారా!’’ అని అడిగింది ద్రౌపది ఆత్రుతతో.
ఇంతవరకు పాండవులు ఎక్కడ ఉన్నారో, ఏమైనారో తెలియరాలేదు. వెదకబోయినవారు కొంతమంది తిరిగి రావలసి యున్నది. తండ్రిగారు చింతాక్రాంతులై ఉన్నారు.
పాండవుల గురించి పూర్తి వివరాలు తెలిసేటంత వరకు నాకు ఈ చిత్రాలను తిలకించాలనే ఆశ లేదు. పద తండ్రిగారి వద్దకు పోయి వారికి కొంత మనశ్శాంతి కలిగించటానికి ప్రయత్నిద్దాము.
****
13
హస్తినాపురము.
రాజాంతఃపురం. దుర్యోధనుడు ఎవరికోసమో ఎదురుచూస్తున్నాడు.- ఇంకా ఉంది

ఇంతలో మహారాణి గాంధారి తమ్ముడైన శకుని వచ్చాడు.
తరువాత దుశ్శాసనుడు వచ్చాడు.
తదుపరి కర్ణుడు వచ్చాడు.
అందరూ కలిసి మంతనాలు మొదలుబెట్టారు. - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము