బాల భూమి

పల్లెవెలుగు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోటలో కొబ్బరి బొండాలు దింపుతున్నారు, ఎండిన కొబ్బరి మట్టల్ని తెగ్గొడ్తున్నారు చెట్లు ఏపుగా ఎదగటానికి. అలాగే ములక్కాడలు, టమాటాలు గంపల్లో సర్దుతున్నారు. ఇంకా బీరకాయలు, వంకాయలు, ఆకుకూరలు గోనె సంచుల్లో నింపుతున్నారు. ఇంకో పక్క బంతి, చామంతి, గులాబీలు వేటికవే గంపలకెత్తుతున్నారు. పచ్చి సరుకులు మార్కెట్‌కి పంపిస్తారు- ఇది దినచర్య.
నర్మింహులు మొదటినుంచి తోట పని, పాడి పంట ఇష్టంగా చేసేవాడు... కాకపోతే ఇప్పుడు తోట కామందు, అప్పుడు తోటమాలి. కొడుకు రాముల్ని ఈ పన్లకి పంపించటం ఇష్టంలేక కానె్వంటు చదువులకోసం పట్నంలో బావమరిది ఎంకటేసు ఇంట్లోపెట్టి చదివిస్తున్నాడు. పట్నంలో ఇళ్ళ కంట్రాక్ట్ చేసి ఎంకటేసు బాగానే కూడేశాడు. వాడికిద్దరూ బిడ్డలే- పెద్దదాన్ని వీడికిచ్చి ముడిపెడ్దామని వాణ్ణి తన దగ్గర పెట్టుకుని చదివిత్తన్నాడు.
రాముల్ని విదేశాలకి వాడి వ్యాపారాలకి సంబంధించిన చదువులు చదివించను పంపించాడు. ఆ తర్వాత బిడ్డకి మనువుచేసి అల్లుడికి వ్యాపారం అప్పచెప్పాడు. పెద్దచదువు చదివి రావడంతో రాములు వ్యాపారాన్ని రాష్టస్థ్రాయిలో నెం.1 స్థానంలో ఒకటిగా నిలబెట్టాడు. అది మొదలు లాభాలల్లో తన వంతు సొమ్ముతో ఊళ్ళో తోట కొని తనని కామందుని చేశాడు రాములు. అమ్మని, నాన్నని, ఉన్న ఊరిని మరిచిపోని రాములు వీలైనప్పుడల్లా భార్యాబిడ్డతో ఇక్కడ తోటలో మాతో గడిపి వెళ్తుంటాడు.
రోజులు దొర్లిపోతున్నయ్.. తోట పనిలో నర్సింహులు, యాదమ్మ తలమునకలౌతున్నారు. అక్కడ పట్నంలో రాములు, కోడలు ఎంకటమ్మ, మనుమడు మధుకర్ ఎవరి పనుల్లో వారున్నారు. ఎవరికివారు యమునాతీరే అన్నట్లు జరిగిపోతోంది. ఒకరోజు ఉన్నట్లుండి రాములు సెలవులకి మధుకర్‌ని ఊరు పంపుతున్నట్టు, తోట పనులు వాడిక్కూడా నేర్పించమని కబులు చెప్పాడు ఫోన్‌లో.
ఒక్కగాని ఒక్క కొడుకు మధుకర్‌కి ఇప్పుడు తోట పనులు నేర్పమంటాడేమిటి అని సందేహం వచ్చింది నర్సింహులుకి, యాదమ్మకి- యాదమ్మ విని నొచ్చుకుంది- అబ్బాయికి మతిగాని పోయిందా ఏమిటి ఇస్ర్తి మడత నలక్కండా తిరిగే దొరబాబుకి మట్టి పిసకడం, పాలు పితకడం నేర్పమంటాడేమిటి... గొనుక్కుంది తనలోతను. ‘‘ఏమో ఆడి బిడ్డ ఆడిష్టం... ఒకందుకు మనమేమో వాణ్ణి చదివించాము. వాడు తన కొడుకుని పని పాటలు నేర్పమంటున్నాడు, నేర్పితే పోయేదేముంది... అయినా సెలవుల వరకేగా...’’అని నచ్చచెప్పాడు యాదమ్మకి.
నర్సింహులు, యాదమ్మ మనుమడు మధుకర్‌కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ వయసులో దానికి మించిన ఆనందం ఏముంటుంది. ముసలితనం మనవల్ని తలచుకుని మురిసిపోతుంటుంది...మిణుకు మిణుకుమంటుంటుంది ఇంకొన్నాళ్ళు జీవించాలన్న ఆశతో జీవితం-
మధుకర్ తాతయ్య పక్కనే వున్న నానమ్మకి సైగ చేస్తూ, తాతయ్య కళ్ళు మూశాడు వెనుకనుంచి. మధుకర్ స్పర్శకి ఉబ్బితబ్బిబ్బయిపోయి నర్సింహులు, ‘‘ఏరా నాన్నా...ఇదేనా రావటం...’’అనడం యాదమ్మ లేచి ‘‘రాయ్యా ఇంట్లోకి పోదాం, అసలే ఎండనపడి వచ్చావ్...కాస్త ఎంగిలి పడ్తువ్‌గాని... అవును, అన్నట్లు ఎట్లావచ్చావ్ బస్సా...’’ అంటూ వ్యాకులత పడింది.
‘‘లేదు నానమ్మ, జుయ్యంటు బుల్లెట్ మీద, నాన్నకి మోసేయకండి... కంగారు పెడ్తారు నన్ను...’’అంటూ హీరోలా ఫోజెట్టాడు. ‘ఎందుకురా అంత దూకుడు...దర్జాగా కారులో రావచ్చుగా’ అంది నానమ్మ. వయసు ఉరకలేస్తుంటె ఈ మాటలు రుచిస్తాయా అంటూ తాతయ్య ముందు వాడికి అన్నం వడ్డించు అంటూ ఇంట్లోకి నడిపించుకెళ్ళాడు మధుకర్‌ని. యాదమ్మ వాళ్ళకి ముందే ఇంట్లోకి వెళ్ళింది.
మధుకర్ నేలమీద కూర్చుని నానమ్మ ఇక వడ్డించు అంటూ అచ్చం రైతు కూలీలా గొంతుక్కూర్చుని తిని తన కంచం తనే తీసుకువెళ్ళి శుభ్రంగా కడిగి తుడిచిపెట్టి, గొడ్ల సావిట్లోకి వెళ్ళి గొడ్లకి మేత అది వేసి వచ్చాడు- తాతయ్య యాదమ్మ ఎంతో చోద్యంగా చూస్తూండిపోయారు. మధుకర్ కొత్తకోణంలో కనిపించసాగాడు ఆ వృద్ధ దంపతులకి. అది మొదలు మధుకర్ ఊరొదిలి పట్నం వెళ్ళేవరకు అలాగే వ్యవసాయ కూలీలాగ పనిచేస్తూనే ఉన్నాడు.
నాయనా మధుకర్‌లో ఇంత మార్పు ఎలా తేగలిగినావ్...ఇంత పనిమంతుడిగా చూస్తుంటె చాలా సంతోషమైంది...అంటూ పొంగిపోతుంటె తండ్రి... మధుకర్ తండ్రి చేతుల్లోనుంచి ఫోన్ అందుకుని తాత నువ్వు విను... అంటూ తండ్రి వైపు తిరిగి నువ్వు నన్ను ఊరికి పంపిస్తూ తాతకి నా గురించి అప్పచెప్పటం... తాత నీకు నచ్చచెప్పటం అన్ని నేను విన్నాను. నీ ఆవేదన నాకు అర్ధమైంది.
‘‘చూడండి ఇక్కడ నాకు కాయకష్టం చేసే పని ఏమిలేదు, అందుకని పని రుచి నాకు అనిపించలా... అక్కడ ఊళ్ళో చేతినిండా పని... నానమ్మ తాతయ్యకి పనిమీద ఎంతో శ్రద్ధఉంది కాబట్టి ఈ వయసులో కూడా పనిచేయటంలో ఎంతో తృప్తిని, ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఇప్పుడు శ్రమచేయటానికి, ఆరోగ్యంకోసం పట్నవాసులు ఎంతో ఖర్చుచేసి జిమ్ములని, వాకింగులని, ఆటలని...బరువు తగ్గటానికి మందులని, పౌడరులని కాలాన్ని కేటాయిస్తున్నారు. అదే వ్యవసాయ పనులలో, తోటల పెంపకంలో, పాడి పంటలకి పాటుపడితే ప్రజలకి భుక్తిశక్తి రెండు దొరుకుతయ్.
అదీకాక నాలో ప్రవహించేది శ్రామిక కర్షక రక్తమే కాబట్టి ఒళ్ళు వంచితే రానిదేముంది, కానిదేముంది. డ్యాడి యికపై మీరు ఎత్తుపల్లాల్ని, కొండల్ని, గుట్టల్ని చదునుచేసి బీద, సాదలకి ఇళ్ళు నిర్మించండి... నేను వాటికి చుట్టూరా మొక్కల్నిపెంచి ప్రకృతికి నీరు పోస్తా... చెట్ల ఎదుగుదలతో కొంతైనా కాలుష్యాన్ని నివారిద్దాం... నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుదాం.
‘‘డ్యాడి ఈరోజే అగ్రికల్చరల్ బి.ఎస్.సికి ఫారం నింపుతా...’’ అంటుంటే కొడుకు మధుకర్, తండ్రి రాములుకి ఎంతో ముచ్చటేసింది... చాలా ముద్దనిపించింది. ఫోన్‌లో ఇంటున్న నర్సింహులుకి ముచ్చటేసింది మనుమడు మధుకర్ ముందుచూపుకి-
భావితరం బావుటా ఎగురుతుంటె... తెల్లని శాంతి పావురాలు గగనానికి రివ్వుమంటున్నాయి... బంగరు భవిత కనులముందు కదలాడుతుంటె అటు యాదమ్మ ఇటు ఎంకటమ్మకి చెట్లపై ఆవాసమున్న పక్షుల కిలకిలా రావాలు, వాటికి కాయధాన్యాలు జల్లుతున్న మధుకర్ కనిపించసాగాడు- వీచే గాలికి మట్టివాసన ఎంతో హాయనిపించింది.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505