బాల భూమి

ఇద్దరూ ఇద్దరే!( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నతనం నుండీ విక్రమ్, విజయ్ ప్రాణ స్నేహితులు. ఒకరంటే ఒకరికి విపరీతమైన అభిమానం. ఇద్దరి ఆశలూ ఆశయాలూ ఒక్కటే.
పాఠశాలలో చదువుకునేటప్పుడు దేశభక్తి వంటి భావాలు వాళ్లిద్దరినీ ఉత్సాహపరిచేవి. ఏనాటికైనా సైన్యంలో చేరాలని, దేశసేవ చేయాలని వాళ్లు ఆశయంగా పెట్టుకున్నారు. చివరికి వారి దృఢ సంకల్పమే వారికి సైన్యంలో చోటు కల్పించింది.
వాళ్ల ధైర్య సాహసాలు చూసి మేజర్ భరత్‌సింగ్ ఎంతో ముచ్చటపడేవాడు. కార్గిల్ సరిహద్దుల్లో ఉన్న బెటాలియన్‌కు కేటాయించాడు భరత్‌సింగ్. పాకిస్తాన్‌తో కార్గిల్ ప్రాంతంలో యుద్ధం సంభవించింది. శత్రు సైనికుల తుపాకీ గుండ్లకు విజయణ బలైపోయాడు. నేలకు వొరిగిపోయాడు. ఆ సమీపంలోనే ఒక రాతిబండ చాటున ఉన్నాడు విక్రమ్.
విలవిలలాడిపోయాడు విక్రమ్. తన ప్రాణ స్నేహితుడు, తనతోపాటు సైన్యంలో చేరినవాడు కుప్పకూలిపోవడం అతడికి విపరీతమైన దుఃఖం కలిగించింది. తన మిత్రుడిని చేరడం ఎలా? అతడి శరీరాన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించడం ఎలా? కదిలితే ప్రమాదం ముంచుకొచ్చేలాగ ఉంది. శత్రు సైనికుల నుండి తూటాలు వర్షం మాదిరిగా దూసుకు వస్తున్నాయి.
విక్రమ్‌ను బంకర్‌లోకి లాగాడు భరత్‌సింగ్. ‘అక్కడే ఉంటే నువ్వు కూడా తుపాకీ గుళ్లకు బలైపోతావు. ఇటువంటి సమయంలో విజయ్ వద్దకు చేరడం అంత క్షేమం కాదు. ఆలోచించు. విజయ్‌ను ఎటూ పోగొట్టుకున్నాను. నిన్ను కూడా పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను’ అన్నాడు భరత్‌సింగ్.
అయినప్పటికీ ఆయనను బ్రతిమాలి విజయ్ శవం వద్దకు వెళ్లాలని విక్రమ్ సిద్ధపడ్డాడు. భరత్‌సింగ్ ఒప్పుకోవడం లేదు. ఆ సమయంలో విజయ్ అనుభవించిన గతాన్ని వివరించి చెప్పాడు విక్రమ్. ఒక పుట్టుగుడ్డి అమ్మాయిని విజయ్ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కొత్త జీవితం ఇచ్చాడు. అంతేకాకుండా అనాథ పిల్లల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. సైన్యంలో తనకు అందే జీతంలో సగభాగాన్ని సంస్థకు ఖర్చు చేస్తున్నాడు విజయ్.
‘అందువల్లనే విజయ్ బ్రతకాలండి. ఏ మాత్రం ప్రాణం మిగిలి ఉన్నా నేను బ్రతికించుకుంటాను’ అన్నాడు విక్రమ్.
ఏమైతేనేం, విజయ్ వద్దకు పరుగెత్తాడు విక్రమ్. అతడు ఆశించినట్టే విజయ్ కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడ్ని మోసుకుంటూ బంకర్‌లోకి చేరుకున్నాడు విక్రమ్. విజయ్‌కి వెంటనే వైద్య సహాయం అందింది. కొంతసేపటికి విజయ్ అతికష్టం మీద కళ్లు తెరిచాడు.
నీరసంగా విక్రమ్‌ని చూసి ‘నన్ను బ్రతికించాలని చూస్తున్నావన్నమాట. ధన్యవాదాలు మిత్రమా!’ అంటూ తిరిగి కళ్లు మూసుకున్నాడు.
భరత్‌సింగ్‌కి కళ్లు చెమర్చాయి. ఇటువంటి స్నేహితులను ఆయన తన జీవితకాలంలో మరెక్కడా చూడలేదు.

- బి.మాన్‌సింగ్ నాయక్