నా స్వభావానికి తగ్గ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ ముఖ్యపాత్రల్లో శ్రీవాస్ దర్శకత్వంలో ఏరోస్ ఇంటర్నేషనల్, వేదస్వా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న డిక్టేటర్ చిత్రంలోని పాటలు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో విడుదలయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం.పి. రాయపాటి సాంబశివరావు సీడిని ఆవిష్కరించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, వౌర్యులు, కాకతీయులు, గజపతులు, ఇలా ఎందరో రాజులు పరిపాలించిన నేల అమరావతి అని, ఇంద్రుడు రాజధాని పేరుకూడా అమరావతేనని, ఇలాంటి గొప్ప ప్రదేశంలో పాటల వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది. తమన్ మంచి పాటలను అందించారని, శ్రీవాస్ అద్భుతంగా తెరకెక్కించారని మెచ్చుకున్నారు.
డిక్టేటర్ అంటే నియంత అని అర్థమని, తన స్వభావానికి దగ్గరగా వున్న టైటిల్ ఇదని అన్నారు. ఈ సంక్రాంతికి సినిమా విడుదల చేస్తామన్నారు.
రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ, బాలయ్య 99వ సినిమా ఆడియో వేడుక ఇక్కడ నిర్వహించడం ఆనందంగా వుందన్నారు.
చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు రావాలని, అలాగే బాలయ్య 100 సినిమా కూడా త్వరలో ప్రారంభం అవుతుందని అన్నారు. దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ, నన్ను నమ్మి ఏరోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారని, బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని చేశానని అన్నారు.