హైదరాబాద్

బల్దియా డ్రైవర్లకు వైద్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: మహానగర పాలక సంస్థ పరిధిలో రోజూ పోగవుతున్న చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తూ, అనారోగ్యం బారిన పడుతున్న డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన వైద్యం అందేలా కృషి చేయాలని కమిషనర్ డా. బి. జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రధాన కార్యాలయంలో ఆర్టీసి, రాష్ట్ర రవాణా శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం ట్రాన్స్‌పోర్టు విభాగంలో 740 వాహనాలున్నాయని, వీటిలో 40 వాహనాలు పూర్తిగా చెడిపోయాయని తెలిపారు. ఈ వాహనాల ద ఆవరా నగరంలో చెత్తను తరలించేందుకు 900 మంది డ్రైవర్లు, వారికి సహాయకులుగా మరో 1600 మంది కార్మికులు పనిచేస్తున్నారని వివరించారు. వారంతా నిత్యం చెత్త తరలింపు వాహనాల్లో విధులు నిర్వర్తించటంతో తరుచూ అనారోగ్యం పాలవుతున్నారని అధికారులు కమిషనర్‌కు వివరించారు. వీరందరికి సర్కిళ్ల వారీగా వైద్య పరీక్షలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలో 15 ఏళ్లకు పై బడిన వాహనాలు 279 వరకున్నాయని, వీటిలో కొన్ని వాహనాలు 30 ఏళ్లకు పై బడి ఉన్నాయని, వీటి నిర్వహణ భారంగా మారిందని వివరించారు. 25 ఏళ్ల పై బడ్డ దాదాపు 20 వాహనాలకు మరమ్మతుల నిమిత్తం సంవత్సరానికి రెండు కోట్ల 9లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ఇది భారీ వ్యయమని కమిషనర్ వ్యాఖ్యానించారు. అంతేగాక, 15 ఏళ్లక పై బడిన వాహనాలను నడపడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ప్రస్తుతం చెత్త తరలిస్తున్న అనేక వాహనాలు కేవల పని నుంచి 12 టన్నులు మాత్రమే తరలిస్తున్నాయని, వీటి స్థానంలో కంప్రెషర్ ఉన్న వాహనాలను ప్రవేశపెడితే ఒక్కోక్కటి దాదాపు 20 టన్నుల చెత్తను తరలించే అవకాశముందని వివరించారు. కాగా, జిహెచ్‌ఎంసికి చెందిన వాహనాలను ఆర్టీసి ద్వారా మరమ్మతులు చేయించడానికి విధి విధానాలనుల రూపొందించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నిర్థారించాలని, ఈ లోపు ఆర్టీసి, జిహెచ్‌ఎంసి అధికారులు పరస్పరం తమ వర్క్‌షాప్‌లను సంయుక్తంగా తనఖీలు చేయాలని, ఒక వేళ ఆర్టీసిచే వాహనాలకు మరమ్మతులు చేపడితే ప్రస్తుతం ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఈ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సంగతేంటీ? అన్న విషయం ప్రస్తావనకు రాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులను తొలగించేది లేదని ఆయన స్పష్టం చేశారు.