అంతర్జాతీయం

ఢాకాలో అయిదుగురు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంటులో బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు పోలీసు కమెండోలు రంగప్రవేశం చేసి అయిదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి ఆ రెస్టారెంటులో 8 మంది ఉగ్రవాదులు ప్రవేశించి 18 మంది విదేశీయులను బంధించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు పోలీసులు మరణించగా, 20 మంది గాయపడ్డారు. ఓ ఉగ్రవాది పోలీసులకు పట్టుబడగా మరో ఇద్దరు ముష్కరులు పరారయ్యారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు బంగ్లా ప్రధాని షేక్ హసీనా తెలుసుకుంటున్నారు. ఈ ఘటనకు తామే కారకులమని ఐసిస్, అల్‌ఖైదా ప్రకటించడం గమనార్హం.