కరీంనగర్

ఎమ్మెల్సీలుగా గెలిపిస్తేనే బంగారు తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* టిఆర్‌ఎస్ అభ్యర్థులు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు
జగిత్యాల, డిసెంబర్ 8: అధికార పార్టీకి చెందిన టిఆర్‌ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా గెలిపిస్తేనే బంగారు తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని అభ్యర్థులు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు అన్నారు. మంగళవారం టిఆర్‌ఎస్ జగిత్యాల నియోజక వర్గ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ప్రాణాలకు తెగించి పోరాడారని బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తమను ఎమ్మెల్సీలుగా గెలిపించాలని కోరారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
గంగాధర, డిసెంబర్ 8: గంగాధర మండలం గట్ట్భుత్కూరు గ్రామానికి చెందిన కంకణాల శ్రీనివాస్ రెడ్డి (29) అనే రైతు మంగళవారం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయం బాగులేక గతంలో అప్పులు చేసి దుబాయి వెళ్లాడు. అక్కడి కంపెనీలో పని దొరకక చేసిన అప్పులు తీరకముందే ఇంటిబాట పట్టాడు. సంవత్సరమున్నర క్రితం వివాహం చేసుకున్న అనంతరం మరికొంత అప్పు చేసి మళ్లీ గల్ఫ్ వెళ్లగా ఆరు మాసాలు అక్కడ పనిచేసి తిరిగి అప్పులు తీరకముందే స్వగ్రామం చేరుకున్నాడు. ప్రస్తుతం తనకున్న మూడు ఎకరాల భూమిలో పత్తి పంట సాగు చేశాడు. అలాగే మరో రెండు ఎకరాలు పత్తి పంట సాగు చేయగా, గతంలో చేసిన అప్పులతో పాటు ప్రస్తుతం పత్తి పంటకు చేసిన అప్పులు భారంగా మారగా, పంట దిగుబడి లేక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్‌ఐ మొగిలి తెలిపారు. మృతునికి భార్య ఉండగా, ప్రస్తుతం గర్భవతిగా ఉందని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శవపంచనామా చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ ఆంజనేయులు తెలిపారు.