క్రీడాభూమి

గట్టెక్కిన బంగ్లాదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి-20 వరల్డ్ కప్ సూపర్-10లో స్థానం
ధర్మశాల, మార్చి 13: వర్షం కారణంగా పదేపదే ఆ టంకాలను ఎదుర్కొన్న చివరి క్వాలిఫయర్‌లో ఒమాన్ ను ఓడించిన బంగ్లాదేశ్ టి-20 వరల్డ్ కప్ సూపర్- 10లో స్థానం సంపాదించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగు లు సాధించింది. తమీమ్ ఇక్బాల్ 63 బంతుల్లో 10 ఫో ర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 103 పరుగులు సాధించా డు. సబ్బీర్ రెహ్మాన్ 44 పరుగులు చేశాడు. అనంతరం ఒమాన్ బ్యాటింగ్‌కు దిగాల్సిన ఉండగా వర్షం వల్ల ఆట ఆలస్యంగా మొదలైంది. దీనితో ఇన్నింగ్స్‌ను 16 ఓవర్లకు కుదించారు. కానీ ఆట జరుగుతున్నప్పుడు మ రోసారి వర్షం కురిసింది. ఫలితంగా మ్యాచ్ పూర్తవు తుందా లేదా అన్న అనుమానాలు తలెత్తాయ. ఆటకు అనుకూల పరిస్థితులు ఏర్పడిన వెంటనే, ఒమాన్ ల క్ష్యాన్ని 12 ఓవర్లలో 120 పరుగులుగా నిర్ణారించి ఆట ను కొనసాగించారు. పరుగుల వేటలో పడిన ఒమాన్ వికెట్లను కోల్పోతూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. చి వరికి 12 ఓవర్లలో 9 వికెట్లు చేజార్చుకొని 65 పరుగు లు చేసింది. డక్‌వర్త్ లూయస్ విధానంలో 54 పరుగు ల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ మెయన్‌డ్రాకు చేరింది.

నెదర్లాండ్స్ గెలిచింది!
ధర్మశాల, మార్చి 13: టి-20 వరల్డ్ కప్ సూపర్-10లో స్థానం సంపాదించే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన నెదర్లాండ్స్ ఎట్టకేలకు ఓ విజయంతో తన ప్రస్థానాన్ని ముగించింది. క్వాలిఫయర్స్‌లో గ్రూప్ ‘ఎ’ నుంచి పోటీపడిన ఈ జట్టు మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొని ఓటమిపాలైంది. ఒమాన్‌తో జరిగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చివరిగా ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌కి కూడా వర్షం బెడద తప్పలేదు. ఆట ఆలస్యంగా మొదలుకావడంతో, మ్యాచ్‌ని ఆరు ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 5 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. స్ట్ఫోన్ మైబర్ 27 పరుగులు సాధించగా, కెప్టెన్ పీటర్ బొరెన్ 14 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 6 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 43 పరుగులకు పరిమితమై, 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటికే ఈ రెండు జట్లు సూపర్-10కు చేరకోలేక నిష్క్రమించడంతో, చివరి క్వాలిఫయర్‌కు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు.