తెలంగాణ

గ్రామీణ బ్యాంకులో చోరీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని దక్కన్ గ్రామీణ బ్యాంకు శాఖలో చోరీకి మంగళవారం అర్ధరాత్రి కొందరు దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంకు వేసి ఉన్న తాళాన్ని వారు బద్దలు కొడుతుండగా ఆ అలికిడికి గ్రామస్థులు మేల్కొన్నారు. గ్రామస్థులు రాళ్లు రువ్వడంతో దుండగులు తుపాకులతో కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.