జాతీయ వార్తలు

సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి బర్దన్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సీనియర్ నాయకుడు ఎబి.బర్దన్ శనివారం న్యూఢిల్లీలోని జిబి.పంత్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. బర్దన్ గత నెల 7వ తేదీన పక్షవాతానికి గురవడంతో ఆయనను జిబి.పంత్ ఆసుపత్రిలో చేర్చారు. శనివారం సాయంత్రం బర్దన్ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందని, ఆయన ప్రాణాలను కాపాడేందుకు తాము ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని, రాత్రి 8 గంటల 20 నిమిషాలకు బర్దన్ తుదిశ్వాస విడిచారని డాక్టర్ వినోద్ తెలిపారు. జిబి.పంత్ ఆసుపత్రిలో బర్దన్‌కు చికిత్స అందించిన వైద్య బృందానికి డాక్టర్ వినోద్ సారథ్యం వహించారు. 1957లో మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన అర్ధేందు భూషణ్ బర్ధన్ కార్మిక ఉద్యమంలో మహానేతగా ఎదిగి వామపక్ష రాజకీయాల్లో విశిష్ట పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశంలోని అత్యంత పురాతన కార్మిక సంఘమైన ఎఐటియుసి (ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్)కి ప్రధాన కార్యద్శిగా, అధ్యక్షునిగా ఎదిగిన బర్దన్ 1990వ దశకంలో కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి భారత కమ్యూనిస్టు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగానూ, 1996లో ఇంద్రజిత్ గుప్తా మరణించిన తర్వాత సిపిఐ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.