రాష్ట్రీయం

బ్యారేజీల నిర్మాణానికి రెండు రాష్ట్రాలు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెన్‌గంగా, తుమ్మిడిహెట్టిలకు లైన్‌క్లియర్
కాళేశ్వరం ముంపుపైనే మహారాష్ట్ర పట్టు
19న హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర జలమండలి బోర్డు తొలి భేటీ

ఆదిలాబాద్, మార్చి 17: గోదావరి నదీ జలాలపై తెలంగాణ, మహారాష్ట్ర కీలక ఒప్పందాల అనంతరం ఈనెల 19న హైదరాబాద్‌లో జరిగే అంతర్రాష్ట్ర జలమండలి బోర్డు తొలి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. గోదావరి నదీ జలాల వాటాపై, రీడిజైనింగ్‌లో భాగంగా ఐదు బ్యారేజీల నిర్మాణానికి ఇరు రాష్ట్రాల మధ్య ఈనెల 7న ఒప్పందం కుదరగా ప్రాణహిత, ఇంద్రావతి నదీజలాల్లో 160 టిఎంసిలను తెలంగాణ సాగు జలాలకు వినియోగించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఈ వేసవిలోనే పనులు ప్రారంభించి రెండేళ్లలో బ్యారేజీల నిర్మాణం చేపట్టేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పట్టుబడుతుండగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సమన్వయ సహకారంతో ఆనకట్ట ఎత్తిపోతల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పెన్‌గంగా నదిపై మూడు బ్యారేజీలు నిర్మించేలా అంగీకారం కుదుర్చుకోగా వీటిలో చెనాకకోర్ట వద్ద తెలంగాణ ప్రభుత్వమే బ్యారేజీ నిర్మించాలని, నీటి గ్రావిటీ ఉన్న పెన్‌పహాడ్, రాజంపేట్ వద్ద మరో రెండు బ్యారేజీల నిర్మాణ వ్యయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. వీటికి 1227 కోట్లు ఖర్చు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేయగా చెనాకకోర్ట బ్యారేజీ కోసం 368 కోట్ల నిధులు విడుదల చేస్తూ పరిపాలన అనుమతి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. పెన్‌గంగా బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి గతంలోనే అటవీ, పర్యావరణ అనుమతులు రావడంతో ఈ బ్యారేజీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా టెండర్ల ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ బ్యారేజీ నిర్మిస్తే ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో 59 వేల ఎకరాలకు సాగునీరు, 89 గ్రామాలకు తాగునీరు అందే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి స్థానంలో ప్రభుత్వం రీడిజైనింగ్‌లో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద ఎత్తిపోతల ద్వారా బ్యారేజీ నిర్మించి, తూర్పు, పశ్చిమ జిల్లాలకు లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరందించేలా ప్రణాళిక రూపొందించారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అడ్డుచెప్పడంతో 148 మీటర్లకు కుదించి తెలంగాణ ప్రభుత్వం మహారాష్టత్రో ఎంవోయు కుదుర్చుకుంది. ఎత్తుతగ్గడం వల్ల ఆదిలాబాద్ జిల్లాకు సాగుజలాల ప్రయోజనం తక్కువగా ఉంటుందని, దీంతో మహారాష్ట్ర అధికంగా లబ్ధిపొందే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీల నేతలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా బ్యారేజీ నిర్మాణ వ్యయం రెండింతలు కానుందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సాంకేతికపరమైన అంశాలను లోతుగా చర్చించేందుకు అంతర్రాష్ట్ర జలమండలి బోర్డు సమావేశంలో ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోనున్నాయి. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తిపోతల కింద గ్రామాలు ముంపునకు గురికావడం లేదని మహారాష్ట్ర పేర్కొనడంతో ఇక్కడి అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
మూడు బ్యారేజీల నిర్మాణానికి సిఈల నియామకం
మహారాష్టత్రో కుదుర్చుకున్న గోదావరి జలాల వినియోగంలో భాగంగా పెన్‌గంగా, ప్రాణహిత, కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి కీలక అడుగులు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ చీఫ్ ఇంజనీర్ స్థాయి క్యాడర్ గల అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు ఎస్‌ఈల పర్యవేక్షణలోనే పనులు సాగగా ఇకపై చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణలో మూడు బ్యారేజీల నిర్మాణం పనులు సాగనున్నాయి.