భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.ఎస్.ఎలీషా, ఖమ్మం (తెలంగాణ)
ప్ర:విపరీతంగా ధనం సంపాదించినవాళ్ళే మోసాలకు పాల్పడుతున్నారు ఎందువలన? ఏమీ లేనివాడు మామూలుగా ఉంటున్నాడు? ఏమిటీ విపరీతం?
సమా:‘్ధనమెక్కిన మదమెక్కును- మదమెక్కి మత్సరంబు మరి మరి యెక్కున్’- అని తెలుగులో నీతి పద్యం- ధనవంతుడు పరలోక రాజ్యమును ప్రవేశించుటకన్న- ఒంటె సూది బెజ్జమున దూరుట సులభము అని బైబిల్ సూక్తి- లోభగుణము కలిగించే ధనము పాపం వైపు నడిపిస్తుంది- దానగుణము కలిగిన ధనవంతుడు సంఘానికి మేలు చేస్తాడు- చాలావరకు ధనము మనిషిని చెడువైపే నడుపుతుంది. అందుకే ఆ మోసాలు- పాపాలు- జైలు జీవితాలు-
పొన్నాల జగన్నాధశర్మ, శివానందాశ్రమం- హైదరాబాద్
ప్ర:నేను శృంగేరీలో స్థిరపడాలనుకుంటున్నాను. ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందా?
సమా:తప్పక శృంగేరీ మీకు దారి చూపిస్తుంది. శ్రీ స్వామిని ఆశ్రయించండి.
కె.వెంకటేశ్వరరావు, పసుమర్రు (గుంటూరు)
ప్ర:కుమారుని విద్యా విఘ్నాలు- మొండితనం వృధా స్నేహాలు- పరిష్కారం చెప్పండి.
సమా:జాతకంలో శని కేతువులదోషం ఉంది. కాణీపాక విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో నాలుగు రోజులు- అధర్వ శీర్ష గణపతి హోమం చేయించండి. మార్పు వస్తుంది.
గృహలక్ష్మి సుజాత, రామకృష్ణాపురం (హైదరాబాద్)
ప్ర: నా ఆరోగ్యం ఎలా ఉంటుంది?- పిల్లల వివాహం ఎప్పుడు?
మా:రెండూ వేరు వేరు విషయాలు- మీ ఆరోగ్యం- ఉదర భాగంలో బరువుగా అనిపించటం వంటి సమస్య ఉండొచ్చు. మహిళా డాక్టరును నిపుణురాలిని సంప్రదించండి. పిల్లల జీవితాలు వారి జాతకాలు పరిశీలించాకే చెప్పాలి.
గుడి గండ్ల ప్రశాంత్, నెల్లూరు (ఆంధ్ర)
ప్ర:ఎస్.ఎస్.సి అయినాది- ఇంటర్‌లో ఏ గ్రూప్ మంచిది. ఇంటి సమస్యల పరిష్కారం ఎలా?
సమా:ఇంటర్‌లో బ్యాంకింగ్ రంగానికి కాని సి.ఏ.కు కాని ఉపయోగపడే గ్రూప్ తీసుకోండి. ఇంటి సమస్యలు పెద్దవారికి వదిలేయండి. మీ చదువుకు ఏకాగ్రత ముఖ్యం.
సి.వి.సాందీప్, చిత్తూరు, ఆంధ్ర
ప్ర:వివాహ యోగం?
సమా:ఆలస్యం- 2018లో అనుకూలం.
కె.సుబ్రహ్మణ్యం- విజయవాడ (కృష్ణా)
ప్ర:స్టేషనరీ షాపు పెట్టుకోవాలనుకుంటున్నాను- యోగిస్తుందా?
సమా:బాగానే వుంటుంది. గవర్నమెంట్ నాన్ జుడీషియల్ స్టాంప్ ఏజెన్సీ పుస్తకాలు- బాంకింగ్ సంబంధించిన కాంట్రాక్టులు యోగిస్తాయి.
చాట్ల వెంకటరమేశ్, చీమకుర్తి (ఆంధ్ర)
ప్ర:నా భవిష్యత్తు ఏమిటి? వివాహ యోగం ఎప్పుడు?
సమా:విఘ్నాల కారణంగా వివాహాలస్యం- అధర్వ శీర్ష గణపతి మంత్ర హోమం చేయించి- ఆ తరువాత నాలుగు కన్యా పాశుపత రుద్రాభిషేకాలు చేయించండి. స్వయంవర కళా రక్షా డాలర్‌కు కావాలనుకుంటే వ్యక్తిగతంగా సంప్రదించండి.
ఎన్.చలపతి, సోమందేపల్లి (ఆంధ్ర)
ప్ర:కొత్త ఇంటికి మారుతున్నాం- బాగుంటుందా?
సమా:స్థానిక వాస్తు పండితులకు కొత్త యిల్లు చూపించండి.
కె.అంబిక, రామచంద్రాపురం (తూ.గో.)
ప్ర:వివాహం- ఉద్యోగ యోగం ఎప్పుడు ఉండొచ్చు?
సమా:2018లో శుభయోగాలున్నాయి.
ఆడెపు విజయలక్ష్మి, సికింద్రాబాద్ (తెలంగాణ)
ప్ర:రెండు వివాహాలు భగ్నమయ్యాయ. మూడవది సిద్ధిస్తుందా?
సమా:జాతకంలో కుజ- శుక్ర దుస్థానస్థితి కారణంగా అలా జరుగుతాయి. విజయవాడ దగ్గరలో మోపిదేవి క్షేత్రానికి వెళ్లిరండి. స్థానికంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వద్ద 11 రోజులు నిద్ర చేసి పూజించండి. మార్గం దొరుకుతుంది.
శ్రీకంటి వెంకట సుబ్బారావు, నెల్లూరు (ఆంధ్ర)
ప్ర:సినీ గేయ కవిగా రాణించగలనా?
సమా:సినిమాలో రాణించటానికి కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు- బ్రతుకుతెరువు లౌకికపు తెలివితేటలు కావాలి. తొలి ప్రయత్నం తరువాత ఈ ప్రశ్న వేయండి.
గండూరి నవీన్, సజ్జాపురం (తణుకు)
ప్ర:సినిమా వ్యాపారం యోగిస్తుందా?
సమా:సెట్టింగ్స్ సంబంధంగా ప్రయత్నించండి. యోగిస్తుంది.
సిరిగుప్ప కిరణ్‌కుమార్, అనంతపురం (ఆంధ్ర)
ప్ర:జన్మపత్రిక వివరాలు చెప్పండి?
సమా:స్థానిక పండితులచేత వ్రాయించుకోండి. లేదా కంప్యూటర్ జాతకం పొందండి.
వి.ఎస్.రావు, విజయవాడ, ఆంధ్ర
ప్ర:కూతురికి అనారోగ్యం- మానసిక దుస్థితి? చేతబడియా అనే అనుమానం-
సమా:మంచి సద్బ్రాహ్మణుని చేత శ్రీ లలితా సహస్ర నామాలు స్తోత్రం ఉచ్ఛైస్వరంతో అమ్మాయి ముందు పారాయణ చేయించి పారాయణస్నానం నివేదన చేయంచండి. మొత్తం 108 పారాయణాలు కావాలి. మధ్యలో (ఒక పారాయణం మధ్యలో) ఆపకూడదు. మాట్లాడకూడదు- అమ్మాయిని గట్టిగా కూర్చోబెట్టాలి.
బి.చరిత- తిమ్మాపురం (ప.గో.)
ప్ర:నాకు ఏ ప్రభుత్వ శాఖలో ఉద్యోగము రాగలదు?
సమా:రెవిన్యూ- బాంకింగ్- అకౌంట్స్ వంటి శాఖలు
డి.పి.రాంచంద్రారావు, కనుమూరు (ఆంధ్ర)
ప్ర:బాగా సంపాదించాను- అన్నీ కలిసొచ్చాయి. నా ఆస్తి నా సంతానం స్వాధీనం చేసుకుంది- నా గతి ఏమిటి?
సమా:ఈ వృద్ధాప్యంలో మనస్సులో కలవరం పెట్టుకోకండి. సంతానంతోనే మంచిగా ఉండండి. సద్గ్రంధ పఠనం- సత్కాలక్షేపం చేయండి. మనశ్శాంతి లభిస్తుంది.
విజయేంద్ర జైన్, మోతీనగర్, హైదరాబాద్
ప్ర:మాది జైనమతం- సమస్యల పరిష్కారానికి హిందూమతంలో ఉన్న విధానాలను అనుసరించలేము- సమస్యల నివారణకు మరో మార్గం చెప్పండి?
సమా:ప్రతి శనివారం - మంగళవారాలు దరిద్ర నారాయణులు అంటే భిక్షగాళ్ళకు గోధుమ రొట్టెలు- మినప వడలు దానం చేయండి.
నీలాద్రి జంగయ్య, యాదాద్రి (తెలంగాణ)
ప్ర:నా రాజకీయ జీవితం గురించి చెప్పండి?
సమా:సేవాభావంతో పని చేస్తే ప్రజాదరణ ఖాయంగా లభిస్తుంది.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.