Others

ఇదీ ఫలితం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మికంగా ఎదగడానికి సాధకుడు ముందుగా ఏకాగ్రత కోసం ప్రాణాయామాన్ని ప్రారంభిస్తాడు. మెల్లగా మనసు, బుద్ధిని స్థిరపరుచుకుంటాడు. ప్రతిరోజునియమ ప్రకారం ప్రాణాయామం, తపస్సు లాంటివి చేస్తున్నా ఒక్కొక్కరు మాకు ఇంకాభగవంతుని సాక్షాత్కారం గాని కనీసం భగవనుభూతి కాని కలుగ లేదని చెప్తుంటారు. భగవనుభూతి అనేది ప్రతివారికి అనుభవైకవేద్యమే. కాని దాన్ని గుర్తించిన వారు తక్కువగా ఉంటారు. అందుకే భగవదనుభూతిని అనుభవించలేదనిఅనుకొంటారు. ఇదిగో ఇలా చూడండి. భగవదనుభూతిని పొందారు అంటే వారిలో వారి గొంతు శ్రావ్యం గా మారుతుంది. వారిలో కర్కశత్వం దూరమవుతుంది. కోపం తగ్గి క్షమ అలవడుతుంది. కోమలత్వం నాటుకుంటుంది. కస్సుబుస్సు లాడే ముఖం కాస్త ప్రసన్నంగా మారుతుంది. వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటివారిని ప్రసన్నులుగా చేయడానికి వారు కృతనిశ్చయులై ఉంటారు.
ఒకవేళ సాధన చేయనివారైనా సరే ఈ లక్షణాలను పనిగట్టుకునైనా శ్రమపడి అయినా సాధించుకుంటే ముఖంలో చిరునవ్వును అట్టేపెట్టుకుంటే చాలు వారు ప్రసన్నవదనులవుతారు. భగవంతుని చూడడానికి అర్హులవుతారు. మానవత్వం మూర్త్భివించినవారని కీర్తినిపొందుతారు. మరి మీరు కీర్తిమంతులు కావాలంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించండి.

- ఆర్. పురంధర్