ఆటాపోటీ

క్రికెట్‌లో వెలుగు నీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి చెడుల మేలి కలయకగా 2015 సంవత్సరం భారత క్రికె ట్‌కు వెలుగు, చీకట్లను సమంగా పంచింది. 2013 ఇండియన్ ప్రీమి యర్ లీగ్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. దోషులుగా తేలిన రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూ టివ్ గురునాథ్ మెయప్పన్‌లపై జీవితకాల సస్పెన్షన్ వేటు పడింది. ఈ వ్యవహారాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన రాజస్థాన్, చెన్నై ఫ్రాంచైజీలపై రెండేసి సంవత్సరాల నిషేధాన్ని విధించారు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)పై తిరుగులేని పట్టును కొనసాగించిన శ్రీనివాస్ హఠాత్తుగా ఒంటరివాడయ్యాడు. బోర్డు అ ధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా మరోసారి ఎన్నిక కావడంతోనే శ్రీని ఆధిపత్యానికి గండిపడింది. దాల్మియా గుండెపోటుతో మృతి చెంద డంతో అతని స్థానంలో శశాంక్ మనోహర్ బిసిసిఐ అధ్యక్షుడిగా ఏక గ్రీవంగా ఎన్నికకావడం శ్రీని శకానికి తెరదించింది.
ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భార త జట్టు సెమీ ఫైనల్స్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టడం అభి మానులను నిరాశకు గురి చేసింది. ధోనీ టెస్టు ఫార్మెట్ నుంచి వైదొ లగడంతో, అతని స్థానంలో టీమిండియాకు టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పగ్గాలు స్వీకరించాడు. మైదానంలో ఎప్పుడూ దూకుడుగా ఉంటూ, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే కోహ్లీ కెప్టెన్సీ పగ్గా లు స్వీకరించిన వెంటనే టీమిండియా తీరులోనూ మార్పు కొట్టొ చ్చినట్టు కనిపిస్తున్నది. దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన టి-20, వనే్డ సిరీస్‌లలో పరాజయాలను ఎదుర్కొన్న భారత్ టెస్టు సిరీస్‌లో ఎదు రుదాడికి ఉపక్రమించింది. బెంగళూరు టెస్టులో కేవలం ఒక రోజు ఆట మాత్రమే సాధ్యమైంది. మిగతా రోజులు వర్షం వల్ల వృథాకాగా, మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో దీనిని మిన హా అన్ని మ్యాచ్‌లనూ సొంతం చేసుకున్న భారత్ సిరీస్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకుంది.
ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెవాగ్ తమతమ కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. అన్ని ఫార్మెట్స్ నుంచి వారు వై దొలిగారు. చాలా కాలం తర్వాత హర్భజన్ సింగ్‌కు టి-20 ఫార్మెట్ లో స్థానం లభించింది. యువరాజ్‌సింగ్ కూడా వచ్చే ఏడాది ఆస్ట్రే లియా పర్యటనకు వెళ్లే భారత టి-20 జట్టులో చోటు దక్కించుకు న్నాడు. భారత జట్టు ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతున్నది. శశాంక్ మనోహర్ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టడంతో క్రికెటర్లు క్రమశిక్షణతో మెలగా ల్సిన పరిస్థతి ఏర్పడింది. ఇది ఓ శుభసూచకం.