జాతీయ వార్తలు

నీటిఎద్దడి లేని చోట ఐపిఎల్ మ్యాచ్‌లు పెట్టుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయితో పాటు మహారాష్టల్రోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరత ఉండగా ఐపిఎల్ మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్ పిచ్‌లను తడిపేందుకు భారీగా నీటిని వృథా చేయడం సరికాదని ముంబయి హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి ఎద్దడి లేని చోట మ్యాచ్‌లు నిర్వహించుకోవాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కు కోర్టు సూచించింది. పిచ్‌లను తడిపేందుకు తాము మంచినీటిని వాడడం లేదని బిసిసిఐ ఇచ్చిన వివరణకు కోర్టు సంతృప్తి చెందలేదు. ‘ప్రజలు ముఖ్యమా? మ్యాచ్‌లు ముఖ్యమా’ అని న్యాయస్థానం ప్రశ్నించింది.