తెలంగాణ

రాజకీయాలను కలుషితం చేస్తున్న తెరాస: లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, మిగతా పార్టీలను అణగదొక్కేందుకు యత్నిస్తున్న తెరాస పార్టీ రాజకీయాలను కలుషితం చేస్తోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. కూకట్‌పల్లిలో మంగళవారం జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెరాస విఫలమైందన్నారు. తెలంగాణ సర్కారు హామీలను తీర్చేవరకూ తాము పోరాడతామన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను బిసి జాబితా నుంచి తెలంగాణ సర్కారు తొలగించడం అన్యాయమని ఆయన అన్నారు.