జాతీయ వార్తలు

బెయిల్‌పై జోక్యం చేసుకోలేము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బెయిలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని సత్వరం పరిష్కరించాలని హైకోర్టును కోరింది. కన్హయ్య కుమార్ బెయిలు పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ, ఈ వ్యవహారంలో తాము నేరుగా జోక్యం చేసకోవడం ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని కూడా వ్యాఖ్యానించింది. ‘మీరు ప్రమాదకరమైన సంప్రదాయానికి తెర తీస్తున్నారు. పిటిషన్‌ను ఈ కోర్టు అనుమతిస్తే అది దేశంలోని నిందితులందరికీ లభించే ఒక ప్రమాదకరమైన సంప్రదాయం అవుతుంది. రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు లే దా ఇతరులకు సంబంధం ఉన్న ప్రతి కేసుకూ ఇదే వర్తిస్తుంది.. కోర్టు లో వాతావరణం ఎలా ఉందో మీకు తెలుసు. అందువల్ల ప్రతి కేసులోను సుప్రీంకోర్టు ఒక్కటే న్యాయస్థానం అని చెబితే అది ఒక ప్రమాదకరమైన సంప్రదాయం అవుతుంది’ అని కన్హయ్యకుమార్ బెయిలు పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయమూర్తులు జె చలమేశ్వర్, ఎఎం సప్రేలతో కూడి న బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఇలాం టి కేసు ఇదొక్కటే కాదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించింది. దేశద్రో హం ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్ బెయిలు పిటిషన్‌ను హైకోర్టుకు బదిలీ చేసిన బెంచ్ ఈ వ్యవహారానికి సంబంధించి అసాధారణమైన వాతావరణం నెలకొని ఉన్న దృష్ట్యా నిందితులకు, హైకోర్టులో వాదించే లాయర్లకు భారత ప్రభు త్వం, ఢిల్లీ పోలీసు కమిషనర్ తగినం త భద్రత కల్పిస్తారన్న హామీని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌నుంచి తీసుకుంది. హైకోర్టులో కోర్టు రూమ్ లో ప్రవేశించేటప్పుడు అన్ని పక్షాలకు చెందిన లాయర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, కోర్టులోపలికి ఎంతమందిని అనుమతించాలనే దానికి సంబంధించి రిజిస్ట్రార్ జనరలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా బెంచ్ స్పష్టం చేసింది. కాగా, ఈ వ్యవహారాన్ని సత్వరం పరిష్కరించాలని హైకోర్టును కోరిన బెంచ్, పిటిషన్ లిస్టింగ్‌కు నిర్దిష్ట తేదీని మాత్రం ఇవ్వలేదు. కాగా, హైకోర్టులో దాఖలు చేయడానికి వీలుగా పిటిషన్‌లో మార్పులు చేయడానికి కన్హయ్య కుమార్ తరఫు లాయరును బెంచ్ అనుమతించింది.