రాష్ట్రీయం

కాకినాడ బీచ్ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణగా హెలీ టూరిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోప్ ఐలాండ్, మడ అడవుల మీదుగా విహార యాత్ర

కాకినాడ, డిసెంబర్ 31: తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ బీచ్ ఫెస్టివల్-2016ను ప్రభుత్వం రాష్టస్థ్రాయి ఉత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో గతంలో లేని రీతిలో ప్రత్యేక హంగులతో పర్యాటకులను అలరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను స్థానిక అధికారులే పర్యవేక్షించేవారు. ఈ ఏడాది నుండి రాష్టస్థ్రాయి ఉత్సవంగా ప్రకటించడంతో ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఈవెంట్ మేనేజర్లను నియమించింది. ప్రముఖ ఈవెంట్ మేనేజర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రసిద్ధిచెందుతున్న హోప్ ఐలాండ్ (సముద్ర దీవి), కోరంగి అభయారణ్యం-మడ అడవుల అందాలను పర్యాటకులకు వీక్షించే అవకాశాన్ని హెలీ టూరిజం ద్వారా కల్పించనున్నారు. ఇప్పటివరకు విభిన్నమైన ఈ ప్రాంతాలను కేవలం బోటు షికారు ద్వారా మాత్రమే వీక్షించే అవకాశం ఉంది. అయితే మడ అడవులు, కోరంగి అభయారణ్యం, హోప్ ఐలాండ్ల స్వరూపాన్ని గగనతలం మీదుగా విహరించే అవకాశాన్ని ఈ ఉత్సవాల సందర్భంగా కల్పిస్తున్నారు. హెలీకాప్టర్‌లో విహరిస్తూ కుటుంబ సమేతంగా ఈ ప్రాంతాలను బీచ్ ఫెస్టివల్ జరిగే మూడు రోజుల్లో తిలకించే అవకాశం కల్పిస్తారు. పర్యాటకుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన సంఖ్యలో హెలీకాప్టర్లను ఏర్పాటుచేసే బాధ్యతలను ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించారు. ఒక ట్రిప్ 20 నిముషాలపాటు సాగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ధరను నిర్ణయించాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఈనెల 8నుండి మూడు రోజులపాటు నిర్వహించే సాగర సంబరాలను తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. కాకినాడ సాగర తీరానికి గతేడాది ఎన్టీఆర్ బీచ్‌గా ప్రభుత్వం నామకరణం చేసింది.