రాష్ట్రీయం

మళ్లీ బీఫ్ ఫెస్టివల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓయులో డిసెంబర్ 10న ఏర్పాటుకు సన్నాహాలు
వ్యతిరేకిస్తున్న ఎబివిపి : యూనివర్శిటీలో ఉద్రిక్తత
హైదరాబాద్, నవంబర్ 22: ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ బీఫ్ ఉత్సవం విద్యార్థుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. డిసెంబర్ పదవ తేదీన ‘సేవ్ ఫుడ్ డెమోక్రసీ’ పేరుతో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు వామపక్ష సంఘాలు, దళిత, మైనార్టీ సంఘాల నాయకులు సన్నాహాలు చేపట్టారు. ఈ నేపథ్యలో ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత రెండేళ్ల క్రితం ఓయులో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించగా విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. అప్పట్లో పలువురు విద్యార్థులపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం జరగబోయే బీఫ్ ఫెస్టివల్‌ను భారతీయ జనతాపార్టీ అనుబంధ సంస్థ ఎబివిపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోహత్య నేరమని, గోమాతను తినడం భావ్యం కాదని ఎబివిపి విద్యార్థులు అంటుండగా దేశవ్యాప్తంగా సగం మంది బీఫ్ తింటారని, ధర తక్కువగా ఉండడంతోనే చాలా మంది బీఫ్‌పై మొగ్గుచూపుతున్నారని ఎఐఎస్‌ఎఫ్ నేత శంకర్ అంటున్నారు. దేశంలో ప్రజలపై అసహనం ఉండటం మంచిదికాదని, ప్రజల ఆహారాన్ని నియంత్రించడం సరైంది కాదని శంకర్ చెప్పారు. ఏదీ ఏమైనప్పటికీ బీఫ్ ఫెస్టివల్‌పై విద్యార్థి సంఘాల పరస్పర విరుద్ధ అభిప్రాయాలతో ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకుంది.

ఏపి సచివాలయం ఎదుట ముళ్లకంచె ఎందుకు?
విసుక్కుంటున్న ప్రజలు
హైదరాబాద్, నవంబర్ 22 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం ప్రధాన గేట్ ఎదుట రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇనుప ముళ్ల కంచె నేటికీ అలాగే ఉండటంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. ఎపి సచివాలయం ప్రధాన గేట్ వద్ద (లుంబిని పార్క్ ఎదురుగా) ఐదారు చోట్ల ఇనుప ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. గేట్ లోపలకు వెళ్లేదారిలో, గేట్ నుండి వెలుపలకు వచ్చే దారిలో, సచివాలయం ఎదురుగా ఉండే గ్రీనరీలో పొట్టిశ్రీరాములు విగ్రహం చుట్టూ, సచివాలయం బస్టాండ్ సమీపంలో, ఎన్‌టిఆర్ పార్క్‌వైపు..ఇలా ఐదు చోట్ల ఇనుప ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. 2014 కు ముందు ఒకవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు సమైక్య ఉద్యమం ఉధృతంగా కొనసాగే సమయంలో ఆందోళనకారులు సచివాలయం లోకి చొచ్చుకు రాకుండా దీన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎపి సచివాలయానికి ఒక గేటు (లుంబినీ పార్క్ ఎదురుగా), తెలంగాణ సచివాలయానికి మరోగేటు ఎన్‌టిఆర్ పార్క్‌వైపు ఏర్పాటు చేశారు. తెలంగాణ సచివాలయం గేటు కొత్తగా ఏర్పాటైంది. ఎపికి వాడే గేటు పాత గేటే. రెండేళ్ల క్రితం ఆందోళనలు సాగే సమయంలో ఏర్పాటు చేసిన ఇనుప ముళ్ల కంచె వల్ల ఇప్పుడు అవసరం ఏమీ లేదు. అయితే పోలీసులు మాత్రం ముందస్తు చర్యగా ఈ ఇనుప కంచెలను తొలగించడం లేదు. వీటి వల్ల సామాన్య ప్రజలు తీవ్రమైన ఇక్కట్లకు గురవుతున్నారు.