జాతీయ వార్తలు

బీరు విక్రయాల్లో తెలంగాణ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : దక్షిణాది రాష్ర్టాల్లోనే బీరు విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో మందుబాబులు మొత్తం 334.56 లక్షల కేసుల బీర్లు గుటకాయస్వాహా చేశారు. సగటున మనిషికి 7.48 లీటర్ల బీరు విక్రయాలు జరిగాయి. కూల్‌ బీరును తాగడంలో కేరళ రెండో స్థానంలో నిలిచింది. కర్నాటక మూడో స్థానంలో నిలవగా, ఏపీ 2.72 లీటర్లతో నాలుగో స్థానంలో ఉంది. బీరు విక్రయాల్లో అగ్రస్థానం సాధించిన తెలంగాణ మద్యం అమ్మకాల్లో 6 లీటర్ల సగటుతో మూడో స్థానంలో ఉంది. మద్యం విక్రయాల్లో మాత్రం సగటు 8.23 లీటర్లతో కర్నాటక టాప్‌ ర్యాంక్‌లో ఉంది. సగటున 6.82 లీటర్లతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది.