జాతీయ వార్తలు

బెంగళూరులో ఏఐసిసి సమావేశం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అదే సమావేశంలో రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు!
న్యూఢిల్లీ,మార్చి 10: కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక రాజధాని బెంగళూరులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం నిర్వహించే ప్రతిపాదనను పార్టీ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కర్నాటక పిసిసి అధ్యక్షుడు జి. పరమేశ్వర్ గురువారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఏఐసిసి సమావేశం ఏర్పాటు, శాసన మండలికి పోటీ చేసే అభ్యర్థుల గురించి సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. బెంగళూరులో జరిగే ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరులో ఏఐసిసి సమావేశం జరపాలని నిర్ణయిస్తే ఆ వెంటనే ఎప్పుడు జరపాలనేది కూడా ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసిసి సమావేశం నిర్వహించటం గురించి చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈనెల 18 లేదా 19 తేదీ ఢిల్లీకి వచ్చే అవకాశాలున్నాయి.
తెలంగాణ పిసిసి మార్పు?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానంలో కొత్తవారిని నియమించే విషయం కాంగ్రెస్ అధినాయకత్వం పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ను పటిష్ఠం చేసేందుకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అధినాయకత్వం ఆలోచిస్తోందని అంటున్నారు. పిసిసి అధ్యక్ష పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె అరుణ, ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే బిజెపి అధినాయకత్వం రెండు, మూడు రోజ్లుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాఖలకు కొత్త అధ్యక్షులను నియమించవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అధ్యక్ష పదవిలో శాసన సభ్యుడు లక్ష్మణ్ లేదా రామచంద్రరావు పేర్లు పరిశీలిస్తున్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ అధ్యక్షుడుగా సోము విర్రాజు పేరు దాదాపుగా ఖాయమైందని అంటున్నారు.