రాష్ట్రీయం

భద్రాద్రి రాముడి నిజరూప దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామి నిజరూప దర్శనం గురువారం భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా గర్భగుడిలో మూలవరులకు గోదావరి నుంచి తీర్థ బిందెను తెచ్చి ఏకాంత సేవ, తిరుమంజనం నిర్వహించారు. కట్టె, చక్కెర పొంగలి నివేదన చేశారు. అనంతరం రామదాసు చేయించిన బంగారు ఆభరణాలను అలంకరించారు. ఉత్సవమూర్తులను రామావతారంలో ధూప, దీప, నైవేద్యాల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. (చిత్రం) రామావతారంలో ఊరేగుతున్న భద్రాద్రి రామయ్య