భక్తి కథలు

వాయునందనుని సింధూర రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కో భగవంతుని రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రామసేవకునిగా, రామబంటుగా ఆంజనేయుడు బహు ప్రసిద్ధిపొందాడు. రామాయణంలో ఆంజనేయుని పాత్ర మహోన్నతమైంది. సుగ్రీవుని ప్రోద్బలంతో రామలక్ష్మణులు ఎవరు అని కనుక్కోవడానికి వచ్చిన ఆంజనేయుడు మొదటి చూపులోనే మొట్టమొదట సంభాషణలోనే రామునికి నచ్చాడు. రాముడు ఆంజనేయుడు మాట్లాడిన విధానాన్ని బట్టి అతడు ఉత్తముడని గ్రహించాడు. అందుకే సోదరుని స్థానాన్నిచ్చాడు. అపారమైన నమ్మకాన్ని పెట్టుకొని తన అంగుళీయకాన్ని ఆంజనేయునికే రాముడిచ్చాడు.వనవాసం తరువాత సీతారాములు అయోధ్యలో పట్ట్భాషిక్తులయ్యారు. వారి దగ్గర హనుమంతుడు కొన్నాళ్లు ఉన్నాడు. రాముని విడిచి ఎపుడూ హనుమంతుడు ఉండేవాడు కాదు.
ఒకసారి సీతమ్మ రాముని మందిరంలోకి వెళ్లాలనుకొంది. అందుకే చక్కగా సీతమ్మ అలంకరించుకొంటోంది. హనుమంతుడు సీతమ్మను చూస్తూన్నాడు. ఆమె నుదట సింధూరం దిద్దుకొంది. ఇక రామమందిరానికి బయలు దేరి వెళ్లింది. ఆంజనేయుడూ తాను రామమందిరంలోకి వస్తానని పేచీ పెట్టాడు. అపుడు రాముడు సీతమ్మ సింధూరం ధరించి కనుక ఇక్కడ ఉంటుంది. నీకు సింధూరం లేదు కనుక నీవు ఈ రామమందిరంలోకి రాకూడదు అని చెప్పాడు.
ఆంజనేయుడు సింధూరానికి ఇంత విలువ ఉంటుందా అని ఆగిపోయాడు. ఆ తరువాత ఆయన బాగా ఆలోచించాడు. వెంటనే వెళ్లి తన ఒంటి నిండా సింధూరం పూసుకొని రాముని దగ్గరకు వచ్చాడు.
‘రామా! నీవు నుదుట సింధూరం పెట్టుకున్నందుకే సీతమ్మను రామమందిరం లోపలికి రావడానికి అనుమతి ఇచ్చానన్నావు కదా. మరి ఇపుడు నేను నా శరీరమంతా సింధూరం పూసుకుని వచ్చాను అన్నాడు. రామునికి ఆంజనేయుని చూసి కళ్లు చెమర్చాయి. తనపై ఆంజనేయునికున్న అనురాగాన్ని రాముడు చాలా సంతోషించాడు. అపుడు సీతారాములు ఇలా చెప్పారు. ‘ఆంజనేయా! మేమిద్దరమూ నీ హృదయస్థానంలో ఉంటాము’అని వరమిచ్చారు. అందుకే సీతారాములిద్దరూ ఆంజనేయుని హృదయంలో సుప్రతిష్టులై ఉంటారు.
*

- చరణ శ్రీ