భక్తి కథలు

కొదువ లేని జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి జీవితంలో ఏదో ఒక కొదువ ఉంటుంది. ఏ కొదువ లేని జీవితానికి బైబిల్ గ్రంథం నుండి చిన్న చిట్కా.
యాకోబు 1:4: మీరు సంపూర్థులును ( complete)) అనుగాంగులు ను ( perfect)) ఏ విషయములోను కొదువ లేని వారునై యుండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
ఏ పని చేసినా perfect గా, complete గా చేయాలని మన అందరి ఆశ. నా కుటుంబము నా ఇల్లు, నా చదువు, నా పని అంతా perfect గా ఉండాలనుకొంటాము.
ఉదా- ఇల్లు అంతా కట్టి వంటగది లేకపోతే పూర్తి కాదు. వంటగది మాత్రమే ఉంటే దానిని ఇల్లు అనరు. అది 2 BHK అయినా, 5 BHK అయినా వీని కొదువ ఉంటే ఉపయోగం లేదు. కరెంటు లేకపోయినా కొదువే. అన్ని సదుపాయాలు ఉన్న తినటానికి లేకపోదే తిన లేకపోయినా కొదువగానే ఉంటుంది.
ఓర్పు ఉంటే సంపూర్ణత లో పరిపూర్ణం. ఇక ఏ విషయంలోను కొదువ ఉండదని బైబిల్ తెలియచేస్తుంది.
ప్రతి మనిషికి వ్యవసాయ దారునికి ఉన్నంత ఓర్పు ఉండాలి. వ్యవసాయదారుడు విత్తనం జల్లి మొలిచి ఫలితం వచ్చేంత వరకు ఎంత ఓపికతో ఎదురుచూస్తూ ఉంటాడో అదే ఓర్పు అన్ని రంగాల్లో వారికి ఉండాలి.
ప్రతి పనిలో ఓర్పు అవసరమే. వంటింట్లో ఓపిక ఉండాలి. చదువుల్లో, పదవుల్లో, వాహనాలు నడిపించడంలో ఓపిక ఉండాలి. ఇళ్ల నిర్మాణంలో ఓపిక ఉండాలి. చివరగా పనులు పూర్తి చేసే సమయాల్లో ఇంకా ఎక్కువ ఓపిక ఉండాలి. లేకుంటే చేసినదంతా వృథా అవుతుంది.
24:13 అంతము వరకు సహించిన వాడెవడోవాడె రక్షింపబడును.
ఎవరైన ఒక మాట అంటే ఓర్చుకోలేము. బయటివారైనా, ఇంట్లోవారైనా ఎవరైనా సరే దాని ద్వారా విభేదాలు, కక్షలు, గొడవలు .. ఒక విధంగా అందరూ కొంతవరకు ఓపికగానే ఉంటారు. ఒక గంట, ఒక రోజు, ఒక కాదంటే ఒక సంవత్సరం ఆ తరువాత ఓపిక నశించిపోతుంది. కోపతాపాలు బయటకు వస్తాయి. తరువాత ఏమి జరుగుతుందో మనకు బాగా తెలుసు. కాని దేవుని వాక్యం చెప్పేదేమంటే ఓర్పు తన క్రియను కొనసాగచేయమని. అది మానవులుగా మనకు అసాధ్యమే. ఈవిషయంలో నరావతారునిగా వచ్చిన యేసుప్రభువే మనకు స్ఫూర్తి.
12:2: యేసు తన ముందు ఉండిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్నాడు. యేసు ప్రభువు సిలువ లో కూడా ఓర్చుకొన్నాడు కనుక లోకానికే విమోచన కలిగింది. ఓర్పు లేక పోతే సిలువ యజ్ఞం పూర్తి అయ్యేదికాదు. మన పాపాలకు క్షమాపణ ఉండేది కాదు. క్రీస్తులో ఉన్న ప్రేమ అన్నిటిని ఓర్చుకొంది. కష్టపెట్టినా, సిలువ వేసినా, ముళ్ల కిరీటం పెట్టినా ప్రేమతో ఓర్చుకొన్నాడు. ఆ ప్రేమలో నండి వచ్చి ఓర్పు మాత్రమే అన్నిటిని ఓర్చుకోగలదు. అప్పుడే ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాతమును వ్యక్తపరచగలదు.
12:12: తల్లి ప్రేమతో కూడిన ఓర్పు తన క్రియను అన్ని సమయములందు అన్ని స్థలాల్లోను అన్ని విషయాల్లో సాధ్యమైతే అందరితో కొనసాగింపనిచ్చి ప్రతి ఫలంగా సంపూర్ణులుగా, అనునాంగులుగా ఏ విషయంలోనూ కొదువలేని వారుగా మనమంతా వర్థిల్లాలని ప్రార్థన.

-మద్దు పీటర్ 9490651256