స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(1) హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఓం భూర్భువ స్స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్- యజుర్వేదం 36-3
వివరణ: ఓ పరమేశ్వర! సత్ - చిత్ - ఆనంద స్వరూపా! నిత్య పరిశుద్ధా! జ్ఞాన నిలయా! ముక్తిశీలా! జన్మరహితా! దోషవిముక్తా! షడ్విధవికార శూన్యా! సర్వవ్యాపీ! సర్వజగదాధారా! జగత్ప్రభో! సకల జగత్ సృష్టికర్తా! ఆది - మధ్య - అంత రహితా! సమస్త విశ్వంభరాభరణా! కరుణా సముద్రా! సకల శక్తియుతా! ధర్మనిర్వాహకా! సమస్త సృష్టిమూలాధారా! చైతన్య ప్రదాతా! సర్వజ్ఞా! సాంద్రానంద ప్రపూర్ణా! క్లేశరహితా! మనోజ్ఞస్వరూపా! ఓ ప్రభూ!
కోటి సూర్యప్రభాసమానమై ప్రకాశించే నీ మహాతేజస్సు దుర్బుద్ధిని నశింపజేస్తుంది. ఆ తేజస్సు నీ భక్తులకు- ఆరాధకులకు, ఉపాసకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అదే వారికి జీవితంలో ముఖ్యంగా పొందదగిన లక్ష్యవస్తువు. వారిలో అది వృద్ధి పొందించిన జ్ఞానం- విజ్ఞానం- ధ్యానం- వారిలోని పాపాలను - సంతాపాలను హరించివేస్తుంది. మేము నీ శరణుచొచ్చినవారం. నీవు మాకు పవిత్ర ప్రేరణ కలిగించు. అందరకు నీవు సన్మార్గాన్ని చూపుతావు. మాకు కూడా ఆ సన్మార్గాన్ని చూపు. దుర్మార్మాగాల నుండి సన్మార్గాలకు, దుష్కర్మలనుండి సత్కర్మలకు, దుర్వ్యసనాల నుండి సత్కార్యాలకు, సాంసారిక వాంఛలనుండి నీ ధ్యాన మార్గానికి మా మనస్సులను మరలించు. దానివలన మా సమస్త కుసంస్కారాలు నశించి మనో మాలిన్యం తొలగిపోగలదు.
ఓ సకల శుభప్రదాతా! కరుణాలవాలా! మాలో సదా నీ ప్రేరణ కలిగే విధంగా మమ్ము అనుగ్రహించు. దానివలన సర్వదా నీ ఆజ్ఞాపాలన చేస్తూ నీకు తగిన సుపుత్రులం కాగలం. ఓ ప్రభూ! ఇదే మా ప్రార్థన.
నకి ర్దేవా మినీమసి నకిరా యోపయామసి మంత్రశ్రుత్యం చరామసి
పక్షేభిరపికక్షేభిరత్రాభి సం రభామహే- ఋగ్వేదం 10-134-7.
భావం:ఓ మహాత్ములారా! మేము ఎవరిని హింసించం. మాలో మేము గాని మే మితరులతోగాని కలహించం, కలహించుకోము. వేదమంత్రోపదేశానుసారంగా నడచుకొంటాం. గడ్డిపరకతో సమానమైన హీనులతో కూడా త్వరత్వరగా కలిసిమెలిసి ప్రవర్తిస్తాము.
వివరణ:వేదం హింసామార్గానికి విరోధి. సాధారణ జీవన మార్గంలో అహింస నాచరించటం సులభం కాదు. నిజానికి హింస అనేక దుర్గుణాలకు- దురాచారాలకు నిలయం. అందుకే వేదర్షులు యమ నియమాది అష్టాంగయోగ పద్ధతులలో అహింసకు ప్రథమస్థానమిచ్చారు. సత్యం, అస్తేయం (దొంగతనం చేయకుండుట) బ్రహ్మచర్యం, దానాలు స్వీకరించడం మొదలైన ఈ సద్గుణాలన్నీ అహింసా మార్గాన్ని మహోన్నతంగా ప్రకాశింపజేస్తాయి.
మానవుడు సంఘజీవి. అతడు తన జీవనయాత్రను సుఖంగా నడుపుకొనేందుకు తగిన సమాజాన్ని (సంఘాన్ని) తప్పక నిర్మాణం చేసుకోవాలి. మానవుని సర్వవిధ వికాసమే సమాజ నిర్మాణ ప్రధాన ప్రయోజనం. దానికొరకు కొన్ని నియమాలు, విధి విధానాలు నిర్మాణం చేసుకోవాలి. దానివల్ల సమాజం క్షేమదాయకంగా నడుస్తుంది. కాని సమాజంలో ‘విచిత్ర రూపాఃఖలు చిత్తవృత్తయః’- ‘‘మనుష్యుల మనఃప్రవృత్తులు చాలా చిత్రంగా ఉంటాయి’’- అన్న పెద్దల వచనానుసారం తమ తమ దురాలోచనలతో దుష్టులైన కొందరు సమాజంలో తరచుగా అశాంతిని రేపి కలహాలను సృష్టిస్తారు. అందువల్ల సమాజం బలహీనమై క్షీణించిపోతుంది. ఈ దుస్థితిని దృష్టియందుంచుకొని ‘నకిర్దేవా మినీమసి నకిరా యోపయామసి’- ‘మేము హింస చేయం. కలహించం. కలహించుకోము’ అని పై మంత్రం ద్వారా దృఢనిశ్చయంతో ప్రవర్తిస్తామని మానవ సమాజం చేత ఋషి ప్రతిజ్ఞ చేయించాడు.
..........................ఇంకావుంది