భక్తి కథలు

సమృద్ధి దీవెన -- ప్రార్ధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుని మాట వినాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి.
‘నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును’ - ద్వితీయో 28:1
నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నియు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. పట్టణములో దీవించబడుదువు. పొలములో దీవించబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొఱ్ఱెల మేకల మందలు దీవింపబడును, నీ గంపయు, పిండి పిసుకు నీ రొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినపుడు దీవింపబడుదువు. వెలుపలికి వెళ్లునపుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులు హతమగునట్లు యెహోవా చేయును. వారొక త్రోవను నీ మీదికి వచ్చి, నీ యెదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు.యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా కాదు. నీవు పైవాడవుగా ఉందువు కాని క్రింది వాడవుగా ఉండవు. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా పని చేయాలి. కానీ వినేటప్పుడు మనం శ్రద్ధగా ఉండటం లేదు. పని చేసేటప్పుడూ శ్రద్ధగా ఉండటం లేదు.
ఇష్టమైన వాటిని ఎంత శ్రద్ధగా పట్టించుకుంటామో. కానీ దేవుని మాటలను అంత శ్రద్ధగా వింటున్నామా? దేవుని మాటలు అంతకంటె ఎక్కువ విలువైనవి కనుక ఇంకా శ్రద్ధగా వినాలి. ఐతే - ఆయన మాటలను వినవలసినంత శ్రద్ధగా వినడం లేదు.
దేవుని మాట శ్రద్ధగా విని వాటి ప్రకారం నడచుకొన్నట్లయితే ఈ దీవెనలన్నీ సమృద్ధిగా కుమ్మరింపబడతాయి. ఆశీర్వాదాలన్నీ మనపైనే ఉంటాయి. నీ విధేయతను బట్టి నీవు, నిన్ను బట్టి నీ కుటుంబం, నీ ఊరు, నీ రాష్ట్రం, నీ దేశం ఆశీర్వదింపబడుతుంది. నీ విధేయత వల్ల వెయ్యి తరాలు ఆశీర్వదింపబడతాయి.
దేవుని మాటలలో ఒకటి - నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువని చెప్పిన మాట - ఈ మాట శ్రద్ధగా పాటించడమంటే - నీ తల్లిని అంటే నీకు జన్మనిచ్చిన నీ తల్లిని గౌరవించమని, తండ్రిని గౌరవించమని. 10వ తరగతి పాసైతే చాలు. ఇక తల్లిదండ్రులను లెక్కచేయటంలేదు. వారు ఏం కోరుకుంటున్నారో అవసరం లేదు. కానీ పైన చెప్పిన ఆశీర్వాదాలన్నీ కావాలి. లేకపోతే తల్లిదండ్రులు మంచివారు కారు, దేవుడు మమ్ములను కరుణించటం లేదు, పట్టించుకోవటం లేదని నెపం వేస్తున్నారు. అసలు దేవుడే లేడనే స్థితికి కొంతమంది వస్తున్నారు.
నీ తల్లిదండ్రులు పేదలైనా ధనికులైనా చదువు ఉన్నవారైనా లేనివారైనా అందంగా ఉన్నా లేకపోయినా వారిని గౌరవించమనే దేవుని ఆజ్ఞ పాటించినట్లయితే ఆశీర్వాదాలు నీకు తప్పక లభిస్తాయి. తల్లిదండ్రులను గౌరవించటమంటే దేవుని గౌరవించడమే. దేవుని గౌరవించడం నిన్ను నీవు గౌరవించుకోవటమే. ప్రభువు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటమే. ఏమి విత్తుతామో దానినే కోస్తాము. మనం మన తల్లిదండ్రులను గౌరవిస్తే మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు. ఈ సంప్రదాయాన్ని రాబోయే తరాలకు అందిద్దాం. దేవుని మాటలను శ్రద్ధగా విని పాటించి ఆయన అందించే ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రార్థన. *

-మద్దు పీటర్ 9490651256