భక్తి కథలు

మాటలా..మంత్రాలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోక్షమంటే పుణ్యం పాపం లేకపోవడమే కదా. అంటే మోక్షమనగా జన్మరాహిత్యమని అనాదినుండి వస్తున్న నానుడి.
శరీరం నుండి జీవుడు విడువబడుటయే. మరో జన్మ లేకుండుటయే మోక్షమని, జీవుడు ఏదో ఒకానొక శరీరమును తోడుచేసుకొని అందులో నివసించి మనసుకు తాను వశమయ్యి కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అసూయలు, డాంభికాలు మొదలగు చెడు గుణాలు మరిగి క్షణిక సుఖమునకాశించి నీచాతి నీచమైన పనులు చేస్తూ అనేక దుర్గుణాలతో నుండి వికారాలు వదలలేక పరమ మూర్ఖుడై యుండి ఏదో ఒక మంత్రమును నమ్మి జపించినంత మాత్రాన పాపములన్నీ నశించి వెంటనే మోక్షం వస్తుందా? అలా ఎన్నడూ మోక్షం రాదు!సదాచారంవల్ల పవిత్రతవల్ల విశేష విజ్ఞాన సంపదవల్ల మోక్ష సామ్రాజ్యం సిద్ధిస్తుంది కాని మంత్రంవల్ల మోక్షం లభించదు. మంత్రం వల్ల మనస్సు కుదుటపడుతుంది, అంతే! సత్యం, శాంతి, దయా, ప్రేమ, సద్బుద్ధి, తనను తనెరుగుట, త్యాగం, శీలం, ఓర్పు, నేర్పు, మధురత, సదా భగవత్ చింతన, శ్వాస శ్వాసలో ఈశ్వరారాధన సద్గుణ సంపత్తితో ఆజన్మాంతరం మెదలుచుండే వికారాలపై విజయం సాధించుటే- అపుడు ఈ శరీరమును విడచిన జీవునికి మోక్షం వస్తుంది.
‘్భండ్యశుద్ధిలేని పాకమేల’ అన్నట్లు తనను తాను తెలుసుకొనుట చాలా ముఖ్యం. మనస్సా, బుద్ధియా, చిత్తమా, ఇంద్రియాలా- వీటిలో తానెవరు? ఎక్కడినుండి యిటు వచ్చాడు. ఎక్కడికి పోతాడు. చేసిన పాపమునకు ఏర్పడిన ప్రతిరూపమే ఈ శరీరం.
తండ్రి ఇంద్రియములవల్ల, తల్లి శ్రోణితము కలగూడినదే శరీరము శుక్లమై గర్భాలయంలో ప్రవేశించి అవయవములన్నియు అతికించుకొని కొన్ని రోజులకు సుందరముగా తల్లి గర్భమున తయారై బయటపడి బ్రతికినన్ని రోజులు ఏవేవో అనుభవించి, చేయరాని అకృత్యములొనరించి ఆగామి ప్రారబ్దం సంచితం అనే కర్మలు తెలియక అమాయకంగా ఓ మంత్రమును జపిస్తూ మోక్షం మోక్షం అని కలవరిస్తే ఎలా వస్తుంది మోక్షం? ప్రతిరోజు శరీరం క్షీణిస్తుంది.
క్షీణించటం వల్ల శరీరం చేసిన పాపం పోతుంది. జీవుడు వెళ్లగానే దేహాన్ని అగ్నికి ఆహుతి అవడంవల్ల దేహం చేసిన పాపం పోతుంది. మరి మనస్సు చేసిన పాపం ఎలా పోతుంది? మనసుకున్న శరీరం ఊడిపోయింది. మనస్సే బంధ మోక్షములకు కారణం అన్నారు పెద్దలు.
ఆ మనస్సు బుద్ధి ఆధీనంలో ఉండాలి. ఆ బుద్ధి సత్సంగం ద్వారా, సదాచారం ద్వారా, సత్పురుషుల పాదసేవనం ద్వారా విచార సాగరం ద్వారా మనస్సు చేసిన పాపం మారిపోతుంది. పాపం పోతేనే పుణ్యం నిలుస్తుంది. పుణ్యంవల్ల స్వర్గం వస్తుంది. పాపంవల్ల నరకం వస్తుంది. పుణ్యం పాపం రెండింటి ద్వారా మానవ జన్మ వస్తుంది. పుణ్యం పాపం రెండు లేకుండటం ద్వారా జన్మరాహిత్యం కలుగుతుంది. మోక్షం సిద్ధిస్తుంది. కాని మంత్రం జపించటంవల్ల మనస్సు కుదుటపడుతుంది కాని మోక్షం రాదు. ఆశలన్నీ వదలి పరమహంస స్వరూపులైతేనే మోక్షం కరతాలమలకం. అపుడే మోక్షం వస్తుంది. ఇది సత్యం.
అందుకే శ్రీకృష్ణుల వారు కర్మలు చేయండి. కర్మలు చేయకుండా మనిషి నిముషం అయనా ఉండలేడు. కాని చేసే కర్మలన్నింటికీ కర్తృత్వబాధ్యత నాపై వేయండి. నన్ను నమ్మండి. నేను అన్నింటికీ కారణ భూతుడుగా వ్యవహరిస్తాను. మీకెప్పుడు ఏది కావాలో దాన్ని మీ మీ కర్మలను బట్టి మీకు ఇస్తుంటాను అని చెప్పాడు.
మానవ లోకంలో పుట్టి కర్మచేయకుండా ఉండడం అందులోను కలియుగంలో కర్మ చేయకుండా ఉండడమూ, ఆలోచన నిలుపడం అనేవి సాధ్యం కాని విషయాలు .కాని మహానుభావులు చెప్తున్న విషయాలను బాగా వింటూ వింటూ భగవద్గీతను చదివి ఆకళింపు చేసుకొని అర్థం చేసుకొని సర్వానికి కారణం యశోదనందుడే అనుకొని సర్వానికి మూల కారణం అతడే అని స్థిరనిశ్చయంతో ఉంటే కర్తవ్యాన్ని మానకుండా చేస్తూ ఉంటే చేయంచేవాడు, చేసేవాడు కూడా భగవానుడే అని స్థిర మైన నమ్మకంతో ఉంటే మోక్షం వస్తుంది.

-గోశికొండ మురారి పంతులు