భక్తి కథలు

నరహత్య చేయవద్దు -- ప్రార్ధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు గదా! (యేసు) నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అనువాడు మహా శ్రమలకు లోనగును. ‘ద్రోహి’ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును -మత్తయి 5:01-22.
నరహత్య అనగానే మనకు అర్థమయ్యేది, ఒక మనిషి ప్రాణం ఇంకొకరు తీయటం. అయితే ప్రభువు సెలవిస్తున్న మాట - తన సహోదరుని మీద కోపపడు వాడు విమర్శకు లోనగునని. సహోదరుడు అంటే తోబుట్టువు కావచ్చు, తోటివారు కావచ్చు, ఇరుగుపొరుగు వారు కావచ్చు. ఈ మధ్య కోపం ముక్కుమీదనే ఉంటోంది. చాలామంది నిర్హేతుకంగానే కోపపడుతున్నారు. దాని నుండి ద్వేషం మొదలవుతుంది. The Fruit of the anger is murder. Murder originates in the heart. not in the hands. It starts with evil thoughts.
1 యోహాను 3:15 - తన సహోధరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్యజీవముండదని మీరెరుగుదురు. కోపపడే వారికి నిత్యజీవముండదని తెలిసిన, సహోదరుల మీద కోపం తగ్గటం లేదు, ద్వేషం తగ్గటంలేదు.
1 యోహాను 2:9 - తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకు చీకటిలో ఉన్నాడు.
1 యోహాను 2:11 - తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను కనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ఏమి చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో తెలియదు.
1 యోహాను 4:20 - ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధీకుడగును. అబద్ధీకులు దేవుని ప్రేమను పొందుకోలేరు. దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.
కావున నీవు అర్పణము నర్పించుచుండగా, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని జ్ఞాపకము వచ్చిన యెడల, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము.
దేవునికి నీవు అర్పించే అర్పణము ఏదైనా, ఎంతైనా, అది డబ్బు కావచ్చు. బంగారము కావచ్చు, నీ ఆరాధన, నీ స్తుతి అర్పణ, నీ సేవా కార్యక్రమములు, నీ దానధర్మాలు కావచ్చు. నీ సహోదరునికి నీ మీద విరోధమున్నదని తెలిసిన, నీకు నీ సహోదరుని మీద విరోధమున్నా- దానిని సరిచేసికొని సమాధానపడినప్పుడే - నీ అర్పణమును దేవుడు అంగీకరించి ఆశీర్వదిస్తాడు. లేకుంటే నీ అర్పణగాని, స్తుతిగాని, నీవు చేసే ఏ మంచి కార్యము తండ్రి యొద్దకు చేరవు.
ఆచారాలు ఎంత నిక్కచ్చిగా చేసినా, హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి మనలో ఉన్న ద్వేషాన్ని బట్టి, కోపాన్ని బట్టి - అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అని చెప్పును.
Anger leads to hatred which leads to murder in the heart of not in the act.
మనకు సహోదరుని మీద కోపముండుట కాదుగాని సహోదరునికి మన మీద ఏ విషయములోనైన కోపమున్నదని తెలిసినా మనమే వెళ్లి సమాధానపడాలి. ఇది చాలా కష్టమే. అయినా దేవుని ఆశీర్వాదం కావాలన్నా, ఆయన రాజ్యంలో చేరాలన్నా చేయక తప్పదు.
మనలను ఎంతో ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి పరచి మంచి స్థితిలో ఉంచిన ప్రభువుకు మనము ఇవ్వవలసిన మొదటి అర్పణ సహోదరుని ప్రేమించుట, సమాధానపడుట, కోపతాపాలు, ద్వేషాలు మాని అక్కున చేర్చుకొనుట.
ప్రభువు మన పట్ల చూపుచున్న ప్రేమను మనము కూడా ఇతరుల పట్ల ముఖ్యంగా సహోదరుల పట్ల చూపించి, ప్రభువు ఇచ్చే సమాధానము, ఆనందము, సంతోషము, నిత్యజీవం పొందుకోవటానికి ప్రభువే సహాయపడుగాక.
స్వనీతిని ప్రక్కనపెట్టి వాక్యపు వెలుగులో - ఎవరెవరిని కోపగించుకున్నామో, ద్వేషిస్తున్నామో వారితో సమాధానపడుదము. క్రీస్తు సిలువలో చూయించిన ప్రేమతో మాత్రమే అలా చేయగలము.
కోపతాపాలు లేని ఇల్లు, ద్వేషాలు లేని ఆఫీసులు, ప్రేమతో నింపబడిన గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు ఎలా శాంతి సమాధానాలతో ఆయురారోగ్యాలతో ఉంటాయో ఊహించుకొంటేనే హాయిగా ఉంటుంది. యేసు ప్రేమ బలములో ఈ కార్యము మొదలుపెడదాము. యేసు క్రీస్తు ప్రేమ మన హృదయాలలోనికి నిండుగా కుమ్మరించబడాలని ప్రార్థన.
*

-మద్దు పీటర్ 9490651256