భక్తి కథలు

ప్రవక్త, సంస్కర్త బసవేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ ధార్మిక సమాజంలో వీరశైవం ధార్మిక విప్లవాన్ని తీసుకొని వచ్చింది. వీర శైవాన్ని ప్రభోదించిన బసవేశ్వరుడు ధార్మిక ప్రవక్తగా, ఒక సాంఘిక సంస్కర్తగా బసవేశ్వరుడు చరిత్రలో సుస్థిర స్థానం పొందారు. లింగాలు ధరించిన వారంతా వీరశైవులే అనే ఒక ఉన్నత లక్ష్యంతో వీరశైవం ధర్మాన్ని స్థాపించిన ధర్మయోగి బసవేశ్వరుడు సమాజంలోని ప్రజలంతా భగవంతుని దృష్టిలో సమానులే అనే ధర్మసూత్రాన్ని వీరశైవం చాటి చెబుతుంది. సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ బేధాలను, లింగ వివక్షతను వ్యతిరేకించి హైందవ మతాన్ని సంస్కరించిన అభ్యుదయవాది బసవేశ్వరుడు. హైందవ ధర్మాలలో వున్నా వైదిక కర్మకాండలను వ్యతిరేకించి వీరశైవం ధర్మాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన మహనీయుడు బసవేశ్వరుడు. 1134-1196 సంవత్సరాల బసవేశ్వరుని కాలంలో శైవ మతంలో ఆచరించే ధర్మాలు విభిన్నంగా వుండటం, ఒకే విధమైన ఆచరణ వుండకపోవటం, మరోవైపు బౌద్ధ, జైన మతాల వ్యాప్తి, వైష్ణవ సిద్ధాంతాల ప్రభోదం ముందుకు రావటం మూలన బసవేశ్వరుడు వీరశైవ ధర్మాన్ని ముందుకుతెచ్చారు. కులాలకు, మతాలకు అతీతంగా లింగాలు ధరించిన వారంతా వీరశైవులే అనే ఉద్యమాన్ని, ధర్మాన్ని బసవేశ్వరడు కన్నడ నాట నడిపారు. ఆనాటి సమాజంలో ఆచారాలకు, సంప్రదాయాలను వ్యతిరేకించి యుగకర్తగా వీరశైవ ధర్మరక్షునిగా బసవేశ్వరుడు నిలిచాడు. వీరశైవ ధర్మాన్ని కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాలలో ఎంతోమంది ప్రజలు ఆచరించారు.
కర్నాటకలోని ‘హింగులేశ్వర భాగవాటి’’ బసవేశ్వరుని జన్మస్థలం. ఆ గ్రామంలో నివసించే బ్రాహ్మణ దంపతులైన మండిగి మాదిరాజు, మాదాంబలకు ఈయన జన్మించారు. చిన్నతనంలోనే శైవ పురాణాలను బసవేశ్వరుడు అవగతం చేసుకున్నారు. మహాజ్ఞానిగా అందరి మన్నలను పొందారు. బసవేశ్వరుడు వడుగులు, ఉపనయనం మొదలగు వైదికాలను వ్యతిరేకించారు. కులానికి, మతానికి వ్యతిరేకిగా వున్న నన్ను వైదిక కర్మకాండల పేరున బంధించటం తగదని తండ్రితో వాదించారు.. రుద్రాక్షలు, విభూది ముద్రలు ధరించిన తరువాత మానవులచేత సృష్టించిన వైదిక కర్మలు తగదని తండ్రికి చెప్పి, ఇల్లువదలి కూడలి సంగమం చేరుకొని, అక్కడ కొలువై వున్న సంగమేశ్వరుని సన్నిధానంలో స్వామిని పూజిస్తూ వీరశైవం ధర్మసూత్రాలను భక్తులకు తెలియజేస్తు ఉంటాడు. సంగమేశ్వరస్వామి ఆనతి మేరకు కళ్యాణపురం చేరుకుంటారు. 12వ శతాబ్దంలో కర్నాటక రాజ్యాన్ని పాలించే బిజ్జలరాజు కొలువులో చేరి మంత్రిగా పదవి పొందాడు. రాజ్యపాలన చేస్తూ మరోవైపు వీరశైవ బోధనలు సాగిస్తారు. వీరశైవ మతం కర్నాటకతోపాటు ఆంధ్ర ప్రాంతాలలో కూడ వ్యాప్తి చెందింది.
బసవేశ్వరుడు తన బోధనలు ప్రజలకు అర్ధం అయ్యే రీతిలో సులభంగా బోధపడే విధంగా వచనాలు వ్రాసాడు. ఇతను 64 లక్షల వచనాలు రచించారు. ఈ వ్రాసిన వచనాలు కూడ ఎంతో ఖ్యాతి గడించాయి. అయితే ఇపుడు కొన్ని వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

- తెలుగు ఈరన్న, ఆదోని