భక్తి కథలు

శత్రువును ప్రేమించుడి -- ప్రార్ధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు, .. పగను చల్లార్చవచ్చు కాని పర్యవసానంగా చాలా కోల్పోతాము. పగతో ఎన్నో కుటుంబాలు సర్వనాశనమయ్యాయి. రాజ్యాలు కూలిపోయాయి. దేశాలు నష్టపోతున్నాయి.
(యేసు) నేను మీతో చెప్పునదేమనగా - మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థించుడి.
‘మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును. పాపులును తమను ప్రేమించు వారిని ప్రేమింతురు గదా! మీకు మేలు చేసిన వారికి మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును ఆలాగు చేతురు గదా! కీడుకు ప్రతి కీడు చేసెదననుకొనవద్దు’ - సామెతలు 20:22 ‘నీ పగవాడు ఆకలిగొనిన యెడల వానికి భోజనము పెట్టుము,’ - సామెతలు 25:21 ‘క్రీస్తు కూడ మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమూ కనపడలేదు. ఆయన దూషించబడియు బదులు దూషించలేదు.’ - 1 పేతురు 3:21-23 దేవుని రాజ్యము ప్రేమ సామ్రాజ్యము. ఈ రాజ్యములో నిత్యముండునది ప్రేమ మాత్రమే. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ఆజ్ఞ ప్రేమే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. అయితే క్రీస్తు మనలను ప్రేమించిన రీతిలో, మంచి మనసుతో ప్రేమించాలి. నిష్కపటమైన, నిస్వార్థమైన, మార్పులేని, మరపురాని, ఆరని, అతిశ్రేష్ఠమైన, ఆర్పజాలని ప్రేమతో ప్రేమించాలి. దేవుని ఆజ్ఞ ప్రేమ. ఆజ్ఞను పాటించటమే ప్రేమ. ‘ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి, నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు’ - మత్తయి 5:45
‘ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైన చేయకుండ చూచుకొనుడి. మీరు ఒకని యెడల ఒకడును మనుషులందరి యెడలను ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి.’ - 1 థెస్స 5:15
మనుషులందరిని ప్రేమించే మనస్సు ఉంటే శత్రువును కూడా ప్రేమించగలము. ‘కీడు చేత జయించబడక మేలు చేత కీడును జయించు.’ - రోమా 12:21 ‘ఆశీర్వాదములకు వారసులవుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతిదూషణయైనను చేయక దీవించుడి’ - 1 పేతురు 3:9
‘ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్తమ్రును నెరవేర్చుటయే. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ‘క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను బలిగా అర్పించుకొనెను’ - ఎపి 5:2 ‘దేవుడు ప్రేమస్వరూపియై ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచి యున్నాడు. దేవుడు వానియందు నిలిచియున్నాడు.’ - 1 యోహాను 4:16 ‘నాయందు మీరును మీ యందు నా మాటలును నిలిచియున్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి. అది మీకు అనుగ్రహించబడును.’ - యోహాను 15:7 ప్రేమ కలిగి ఉంటే దేవుడు మనలో ఉన్నట్టే. దేవుడు మనలో ఉండి గొప్ప కార్యాలు చేయిస్తాడు. మనము అడిగినవన్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుదము. శత్రువునే ప్రేమించే స్థితిలో ఎదిగి దేవుని అపారమైన ప్రేమను పంచుటకు ప్రభువే మనకు తోడు యుండును గాక.
డఆ్యఔ ఉ్పజ డఆ్ఘఆ ద్య్యిజూ శత్రువులను శత్రువులుగా చూచుట మాని ప్రేమించు ద్వేషించే వారిని ద్వేషించక మేలుచేయి శపించేవారిని శపించక దీవించు బాధించే వారిని బాధపెట్టక ప్రార్థించు
అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును. మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు కుమార్తెలునై యుందురు.
*

-మద్దు పీటర్ 9490651256