భక్తి కథలు

సిరుల ప్రదాత శ్రీపురం అమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుభాం హిరణ్య ప్రాకారం సముద్రతనయాం జయాం
నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం .... అంటూ లక్ష్మీదేవిని స్తుతించని వారు ఎవరూ ఉండరు. ఈశ్రావణమాసంలోప్రతివారు వరలక్ష్మీ దేవి పేరిట వైకుంఠనివాసిని పూజిస్తారు.
ఆ తల్లే శ్రీపురం లో వేంచేసి ఉంది. నారాయణీ అమ్మగా శ్రీపురంలో సిరుల ప్రదాతగా సౌభాగ్యాలను అందించే అమ్మగా భక్తుల జనం చేత ఆరాధనలందుకుంటోంది. ఆ తల్లిని దర్శించుకుంటే ఇహపరసౌఖ్యాలు కలుగుతాయని ఐతిహ్యం. అమ్మ కడకంటిచూపు సోకితే చాలు సర్వసంపదలు సమృద్ధిఅవుతాయి. అమ్మ కరుణార్థ్రచూపుకోసం ముల్లోకవాసులు ఎదురుచూస్తారు. అమ్మ చల్లని చూపు లేకపోతే బతకటం కష్టం. ఆదిశంకరాచార్యులు ఒకసారి భిక్షాటనకు వెళ్లారు. అక్కడ ఒక పేదవాని దారిద్య్రాన్ని చూశారు. ఆయన మనసు ద్రవించింది. ఆ పేదరాలి దారిద్య్రాన్ని దూరం చేయాలనుకొన్నారు. ఆ లక్ష్మీదేవినుద్దేశించి సౌందర్యలహరిని గానం చేసారు. కరుణామతల్లి వాత్సల్యపూరిత అయిన అమ్మ ఆ గానానికి మురిసి ఆ పేదవానింట బంగారు ఉసిరిని పండించింది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజస్రాజాం అని వర్ణించేఆ అమ్మ దివ్యతేజోవిలాసాన్ని చూడాలంటే శ్రీపురం వెళ్లాల్సిందే. చూచిన కొద్దీ చూడాలనిపించే ఆ నారాయణీ అమ్మను పూర్వజన్మపుణ్యం కొద్దీ దర్శనం చేసుకొంటారంటారు. అమ్మను సువర్ణమూర్తిగా ప్రతిష్టించిన శక్తి అమ్మవారే ప్రకృతి సహకారంలేనిదే మనిషి మనుగడ లేదు కనుక ఆ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనిషిపైన ఉందని అంతర్లీనంగా బోధిస్తూ ఆ ప్రకృతికాంత రమణీయతను ఆస్వాదించడానికి వీలుగా అమ్మ ఆలయంలో భక్తులు నడిచి వచ్చేదారి పొడవునా ఉద్యానవనాన్ని నిర్మించారు. ఆ ఉద్యానవన మధ్యలో దేవీదేవతామూర్తులను నెలకొల్పారు. అమ్మ నారాయణీ దివ్యావతారాలను దర్శనం లభించేట్టుగా అక్కడక్కడ అమ్మ అవతారమూర్తులను సైతం నెలకొల్పారు. అంతేకాక నడిచేదారికిరువైపుల శక్తి అమ్మవారి దివ్యప్రబోధాల సూక్తులను చదువుకుని ఆచరించడానికి వీలుగా వివిధభాషలల్లో తీర్చిదిద్దారు. ఈ దేవాలయం నవావరుణ శక్తిపీఠం మాదిరిగా నెలకొల్పారు. అష్టాదశభుజ నిర్మాణంతో ఉన్న ఈ ఆలయదర్శనంతోనే భక్తులంతా ఆధ్యాత్మిక దృఢచిత్తాన్ని మనసున స్థిరీకరించుకొంటారు.
సుమారు 70కిలోల సువర్ణంతో తయారు చేసిన అమ్మ వారి రూపును గర్భాలయంలో ప్రతిష్టించారు. ఈ అమ్మను దర్శించిన భక్తజనం అలౌకికానందలోకాల్లో విహరిస్తారు. ఇక్కడ గోసంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది అని చెబుతూ గోపూజను, గోమాత సేవ విశేషంగా ఈ శక్తి అమ్మ చేస్తున్నారు.
కలియుగంలో అన్నదాన సేవే ఉత్తమ సేవ అని అన్తార్తుల క్షుద్బాధను తీర్చే సేవే అమ్మసేవ అని చెపుతూ వచ్చిన వారికందరికీ నిర్మలమైన ఆనందభరితమైన అన్నదానం చేస్తారు శక్తి అమ్మ. ఆ అమ్మవారి ప్రసాదాన్ని సేవించిన భక్తులంతా ఓమ్ నమో నారాయణీం అనే దివ్యమంత్రోచ్చారణను నామసంకీర్తన చేస్తూ అమ్మదర్శనంతో పునీతులవుతుంటారు. మానవ సేవే మాధవ సేవ అని శక్తి అమ్మ వైద్యసదుపాయాలను భక్తులకు అందిస్తారు. కలియుగవేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లిన భక్తులంతా తిరుపతికి దగ్గరలో ఉన్న శ్రీపురానికి వెళ్లి అమ్మ దర్శనం చేసుకుంటారు.

--జంగం శ్రీనివాసులు