భక్తి కథలు

అదైత్వమతస్థాపకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలో ఉన్నదే అయినప్పటికి, ప్రజలు మరిచి పోయిన అంశాలను తిరిగి ఉటంకిస్తూ అద్వైత మత స్థాపనాచార్యుడైనాడు ఆది శంకరుడు. తూర్పున జగన్నాథంలో ‘‘గోవర్ధన మఠం‘‘, పశ్చిమాన ద్వారకలో ‘‘శారదామఠం’’, ఉత్తరాన కేదారంలో ‘‘జ్యోతిర్మఠం’’, దక్షిణాన శృంగేరియందు ‘‘శృంగగిరి మఠం’’ స్థాపించి మత కార్యనిర్వహణార్థం దేశం నలు చెరుగులా సంచరించి, అద్వైత తత్వాన్ని వివరించి, దిగ్విజయ యాత్ర కొనసాగించారాయన. సమకాలీన హైందవ మతంపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆయన. హిందూ మతాన్ని ఉద్ధరించిన ‘‘త్రిమతాచార్యులలో ప్రథములు’’ ఆదిశంకరులు. క్ర.శ.788-820 మధ్య శంకరులు జీవించి ఉంటారని ఒక భావన. ‘‘ దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే, న ఏవ శంకరాచార్య: సాక్షాత్ కైవల్య నాయక:’’ దుష్టాచారాలను నశింప చేసేందుకై కైలాస నాథుడే ఆది శంకరుని రూపంలో అవతరించారని ‘‘శివన్యాసం’’ స్పష్టపరుస్తున్నది. ‘‘కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహిత:, శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా’’. శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలపెట్టడానికి త్రినేత్రుడే స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని ‘‘కూర్మపురాణం’’ విశదీకరిస్తున్నది. త్రిచూర్‌లోని వృషాచల పర్వతంపైగల శివున్ని ప్రార్థించి, ఆయన అనుగ్రహం పొందిన కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురువులకు కేరళలోని పూర్ణానదీ తీరాన గల కాలడిలో వైశాఖ శుక్ల పంచమి నాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా, శంకరులు జన్మించారు. సన్యాసం తీసుకోవడానికి తల్లిని అనుమతి కోరగా, ఆమె నిరాకరించగా, ఒక నాడు పూర్ణానదిలో స్నామాచరించే సమయాన మొసలి పట్టుకోగా, మరణించేలోగానైనా సన్యాసిగా ఉంటానని తల్లిని కోరగా, ఆమె అంగీకారంతో సన్యాసిగా మారే మంత్ర పఠనం చేస్తుండగా, మొసలి శంకరులను వదిలేసింది. వ్యాస కుమారుడైన శుకుని శిష్యులైన గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదుల నర్మదా తీర గుహ దర్శనం లభించగా, గోవింద పాదులు జ్ఞాన సమాధి నుండి చూసి, సాక్షాత్తూ భువికి దిగి వచ్చిన పరమశివుడే శంకరుడని అన్నారు. శంకరులు మొదటిసారిగా గోవింద భగవత్పాదలకు పాదపూజ చేయగా, నేటికీ పరంపర కొనసాగుతూనే ఉంది. గురుసేవతోనే జ్ఞానార్జన సాధ్యమని ప్రపంచానికి చాటారాయన. వారణాసిలో సదానందుడు శంకరుని మొదటి శిష్యులైనారు. గంగానది వైపు వెళుతున్న సమయంలో నాలుగు శునకాలతో చండాలుడు అడ్డురాగా, చండాలుని మాటలు విన్న శంకరుడు పరమ శివుడే చతుర్వేదాలతో వచ్చారని గ్రహించి మనీషా పంచక స్తోత్రం చేసి, బ్రహ్మసూత్రాలకు భాష్య సూత్రాలు రాసి, సిద్ధాంత వ్యాప్తికి, సంరక్షణకు దేశవ్యాప్తంగా శిష్యులను పంపాలనే శివుని ఆదేశం పొంది, కర్తవ్య ముఖులైనారాయన. 8రోజుల చర్చానంతరం వ్యాస భగవానుని సంతృప్తి పరిచి, ఆయుర్దాయాధిక వరం పొందారు శంకరులు. సన్యాసం తీసుకున్నాక కొత్తపేరును సూచించే యోగపట్టం - తీర్థ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనే పది పేర్లను శంకరుడు మఠ నిర్వాహకులకు నిర్ణయించారు. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, వేదాంత విరుద్ధ హిందూ భావజాలాన్ని ఖండించి, ఉపనిషత్తుల ఆధారంగా అద్వైత మతాన్ని నిరూపణ చేసేందుకు, స్వానుభవాన్ని జోడించి, తర్కానికి ప్రముఖ స్థానం కల్పించి, భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తూత్రాలు రచించారాయన. ఆత్మ, బ్రహ్మం (పరమాత్మ) ఒకటే అనేది అద్వైత మూలసూత్రం. ఇందుకు మూలిక సూత్రాలను ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు - ప్రస్తాన త్రయం నుండి గ్రహించారు

- సంగనభట్ల రామకిష్టయ్య 9440595494