భక్తి కథలు

సహోదరుల ఐక్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు’ - కీర్తన 1:33
ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఎంత మనోహరం. కుటుంబాలలో, పనిచేసే స్థలాలలో ఐక్యత ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అత్యధిక సంతోషం కలుగుతుంది. ఐతే - వాస్తవానికి మనమంతా ఐక్యత కలిగి ఉంటున్నామా? ప్రతి చిన్న విషయానికీ గొడవలు. తగాదాలు. విభేదాలు.. కొట్లాటలు. ప్రతి చిన్న సమస్యకీ ‘ఇగో’లూ. చివరికి నువ్వెంత అంటే నువ్వెంత అనేంత వరకూ వెళుతుంది. అకారణంగా మనస్ఫర్థలు. దీంతో అన్నింట్లోనూ దూరాలు.
‘కలసి ఉంటే కలదు సుఖం’ అంటూ ఆత్రేయ అన్న మాటలు.. 3వేల సంవత్సరాల క్రితమే బైబిల్‌లో రాయబడి ఉన్నాయి. కలసి ఉంటే మేలు, మనోహరమని. అయితే ఈ కలసి ఉండటం అనేది ఎలా సాధ్యం? మానవుని ప్రేమ క్షణక్షణానికి మారుతోంది. ఉదయం ఉన్న ప్రేమ రాత్రికి ఉండదు. రాత్రి ఉన్న ప్రేమ ఉదయానికి ఉండదు. క్షణానికో విధంగా మారే ప్రేమ. ఇక - ఈ మారే ప్రేమతో కలసి ఉండటం సాధ్యమా?
ఇది దేవుని ప్రేమ వల్లనే సాధ్యం. యేసు ప్రభువు సిలువలో మనలను క్షమించిన ప్రేమ ఉంటేనే ఈ ఐక్యత ఉంటుంది. ఆయన ప్రేమ మారనిది. మార్పు లేనిది. ఆయన ప్రేమను మనమూ కలిగి ఉంటేనే మనకు ఐక్యత. మనకు శాంతి. సమాధానం. దేవుడు ఐక్యతను కోరుకుంటాడు. సాతాను భేదాన్ని కోరుకుంటాడు. ఐక్యత అనేది పరిమళ తైలంగా ఉంటుందని బైబిల్ చెబుతోంది. ఇది దేవునికి ఇష్టమైనది. ఇంపైనది.
మన చుట్టూ ఉన్నవారికి కూడా ఇంపైన భావనలు కలిగిస్తుంది. ఐక్యతహార్మోను మంచు లాంటిదని బైబిల్ సెలవిస్తోంది. మంచు చల్లనిది, సేదదీర్చేది. ప్రాణాన్ని తెప్పరిల్లజేసేది. ఇది ప్రభువు ఇచ్చే బహుమానం.
ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఐక్యత కలిగి ఉన్నట్లయితే గొప్ప కార్యాలను సాధించవచ్చునన్న సంగతి బైబిల్‌లో చాలా సందర్భాలలో తెలియజేయబడింది. ఈ దినాలలో ఐక్యత లేక ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లు ఉన్నారు. ఒకరికి నష్టమొస్తే మరొకరికి సంతోషం. ఇలాంటి పరిస్థితి శత్రువుకు లాభం. మనలను సులభంగా ఓడిస్తాడు. రాజ్యాలు కోల్పోవటానికి కారణం ఐక్యత లేకపోవటమే.
ఐక్యంగా ఉండటమంటే మనం ఇతరుల నుండి పొందుకోవటం కాకుండా మనమే ఇతరులకిచ్చే గుణాన్ని పెంపొందించుకోవటం. ఐక్యత వల్ల ఆశీర్వాదం. ఐక్యత వల్ల జీవము. ఐక్యత వల్ల సమాధానం. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అని చిన్ననాడు చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసుకొని కలసికట్టుగా ముందుకు సాగుదాం.
అందరం కలిసిందే కుటుంబం.
అన్ని కుటుంబాలు కలిస్తేనే దేశం.
కనుక ఐకమత్యంతో ఉందాం.
*

-మద్దు పీటర్ 9490651256