భక్తి కథలు

దివ్యనేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ దివ్య చక్షువు ద్వారా వాల్మీకి మహర్షి శ్రీరాముడు జన్మించకముందే రామాయణం అంతా దర్శించి వ్రాశాడు. ఆ దివ్య చక్షువు!ఏ దివ్య చక్షువువల్ల రాయబార సభలో ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనాన్ని చూడగలిగాడో.. ఆ దివ్యచక్షువు!ఏ దివ్యచక్షువునైతే శ్రీకృష్ణుడు సంజయునికి ఇచ్చి మహాభారత యుద్ధాన్ని హస్తినలోనే చూసి ధృతరాష్ట్రునికి రన్నింగ్ కామెంటరీ ఇప్పించాడు. ఆ దివ్య చక్షువు! ఏ దివ్య చక్షువు ద్వారా సత్యానే్వషణం గౌతమబుద్ధుడు తన జన్మలన్నీ చూసుకున్నాడో.. ఆ దివ్య చక్షువు!ఏ దివ్య చక్షువులో అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం తెలుసుకుని చెప్పాడో.. ఆ దివ్యచక్షువు!ఏ థర్డ్‌ఐ ద్వారా నోస్ట్రడామస్ రాబోయే శతాబ్దాలల్లో ఏమీ జరుగుతాయో దర్శించి చెప్పాడో ఆ దివ్య చక్షువు!ఈ దివ్యచక్షువు గురించి శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్పాడు.
బహూనిమే వ్యతీతాని జన్మానితవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వంవేత్థ పరంతప॥ (భ॥ శ్లో.) ఓ అర్జునా! నువ్వూ, నేనూ ఎన్నో జన్మలు ఎత్తాం. కలిసి వున్నాం. అయితే నేను నా జన్మజన్మలన్నింటినీ తెలుసుకున్నవాడిని- నీకు నీ జన్మలు తెలియవు అని! మరి శ్రీకృష్ణుడు తన అన్ని జన్మలనూ ఎలా తెలుసుకున్నాడు? తన దివ్యచక్షువు ద్వారానే! శ్రీకృష్ణుడు, వాల్మీకి, బుద్ధుడు, వీరబ్రహ్మేంద్రస్వామి, నోస్ట్రడామస్, ఓషా, రామకృష్ణ పరమహంస, పత్రీజీ- మరి వీరంతాకూడా ధ్యానంవల్లనే దివ్యచక్షువును తగిన సాధనతో సాధించుకున్నారు- పరమగురువులైన వారెందరో!
అలాగే ఒక బాలుడైనా, బాలికైనా, కండక్టరయినా, కలెక్టరయినా కార్మికుడు అయినా, కావ్యపండితుడైనా, పామరుడైనా, రాక్షసుడయినా, రాముడయినా మరి ఇండియాలోనైనా, ఇండోనేషియాలోనైనా, ఇంగ్లాండ్‌లోనయినా తగిన ధ్యానసాధన చేసి శ్వాసమీద ధ్యాసపెడితే వారు తప్పక దివ్యనేత్రాన్ని సంపాదించుకుంటారు తగిన సాధనతో! ధ్యానానికి గతంతో సంబంధం లేదు; వర్తమానంతోనే సంబంధం! వర్తమానమే బహుమానం! కావలసిందల్లా మరికాస్త సాధన! సాధనతో సమకూరు పనులు ధరణిలోనా! ధ్యానాభ్యాసం (శ్వాసమీద ధ్యాస)వల్ల చిత్తం అతి స్వల్పకాలంలోనే ‘వృత్తిరహితం’ అవుతుంది. చిత్తం అన్నది వృత్తిరహితమవుతూనే ‘‘కుండలినీ జాగృతం’’అన్నది మొదలవుతుంది. వెంటనే దివ్యనేత్రం ఉత్తేజితం కావడం ప్రారంభమవుతుంది. ‘‘యోగః చిత్తవృత్తినిరోధః అని అందుకే పతంజలి మహర్షి అన్నారు. దివ్యనేత్రం విచ్చుకుంటున్న తొలి దశల్లో రంగులు కనపడతాయి. శబ్దాలు వినపడడం జరుగుతుంది. క్రమక్రమంగా దృశ్యాలు, ప్రకృతి, వివిధ లోకాలు కనపడడం జరుగుతుంది. ఆపై దర్శనాలు దేవతలు, ఋషులు, మునులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, అప్సరసలు, మరణించిన బంధుమిత్రులు ఇలాకనపడడం మొదలవుతుంది. సూక్ష్మ శరీరయానం జరుగుతుంది. కుండలినీ జాగృతి విస్తృతమయ్యేకొద్దీ టెలిపతి (దూరశ్రవణం), క్లియర్ వాయస్స్(దూరదర్శనం) సైకోమెట్రీ (వేళ్ళతో దర్శించే విద్య) ఇలా ఒక్కొక్కస్థితీ సంప్రాప్తమవుతుంది. కుండలినీ జాగృతమయి చక్రాలన్నింటినీ ఉత్తేజితం చేసుకుని ఆపై ‘సహస్రారాస్థితి’ చేరుకున్నపుడు అది అక్కడ సంపూర్ణంగా స్థితమైనపుడు మనకు అత్యవసరమయినపుడు, తప్పనిసరి అయినపుడు, ఏదికావాలంటే దాన్ని చూడగల, వినగల శక్తివచ్చినపుడు.. ‘దివ్యచక్షువు’ సంపూర్ణంగా విప్పారింది’’అంటారు. ఆత్మజ్ఞానం దివ్యచక్షువు ద్వారా లభించే ప్రథమస్థితి! బ్రహ్మజ్ఞానం దివ్యచక్షువు ఒక్క పరమ పరిపక్వతా స్థితి! * దివ్యచక్షువు పరిపక్వం చెందినప్పుడు, మనం కూడా ‘‘పరమ గురువుల’’ కోవలో చేరుతాం.

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908