విశాఖపట్నం

భక్తుల కల సాకారమైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, నవంబర్ 29: శ్రీ వరాహ లక్ష్మీనృసంహస్వామివారి భక్తుల కల సాకారమైంది. దేవస్థానం అధికారికంగా దీక్షలు నిర్వహించేలా చేయాలని సుమారు దశాబ్దన్నర కాలంగా భక్తులు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్రస్వామి, రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, గంటా శ్రీనివాసరావుల చొరవతో నృసింహ దీక్షలు పేరున డిసెంబర్ 2వ తేదీ నుండి దీక్షలు అధికారికంగా ప్రారంభించేందుకు దేవస్థానం ముహూర్తం ఖరారు చేస్తూ అధికారికంగా ఆదివారం ప్రకటన విడుదల చేసింది. 41 రోజుల మండల దీక్షకు 2వ తేదీ నిర్ణయించగా, 32 రోజుల దీక్షను స్వామివారి ఆవిర్భావ నక్షత్రమైన స్వాతి నక్షత్రం (డిసెంబర్ 8వ తేదీ) రోజున ప్రారంభించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మండల దీక్షలను సింహగిరిపైన నృసింహ మండపంలో ప్రారంభిస్తారు. 32 రోజుల దీక్షలను గిరిజన ప్రాంతాల్లోని భక్తుల సౌకర్యార్థం స్వామివారి ధర్మప్రచార రథంలో దేవస్థానం అర్చకులు ఆయా ప్రాంతాలకు వెళ్లి స్వయంగా విధివిధానాలు బోధించి భక్తులకు దీక్షాధారణ చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. మండల దీక్షా భక్తులు పుష్యశుద్ధ పాఢ్యమి జనవరి 11వ తేదీన, 32 రోజులు దీక్ష ఆచరించే భక్తులు జనవరి 8వ తేదీన సింహగిరిపై దీక్ష విరమణ చేయాలని దేవస్థానం సూచించింది. దీక్షలు విరమణ రోజున నృసింహ హోమం, మహా పూర్ణాహుతి, శాంతి కల్యాణంతో దీక్షలు పరిపూర్ణం చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
నియమాలు
దీక్షలు ఆచరించే భక్తులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలని, నదిలోకాని, తటాకంలో కాని, బావి నీటిలో కాని స్నానమాచరించాలని, నుదుటిన తిరునామం ధరించాలని, చందనం రంగు వస్త్రాలు వేసుకోవాలని, బ్రహ్మచర్యం పాటించాలని, ప్రాతఃకాలంలోను, సాయంత్రం సంధ్యాకాలంలోను స్వామివారి సుప్రభాతం సంకీర్తనలు చేయడం, స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలని, దీక్ష విరమణ రోజున మహాపూర్ణాహుతిలో వినియోగించే ద్రవ్యాలను తిరుముడిగా సమర్పించాలని నియమాలను నిర్ధేశించారు. పదేళ్లలోపు ఆడపిల్లలు, 50 సంవత్సరాలు దాటిన మహిళలు మాత్రమే దీక్షలు ఆచరించాలని స్ర్తిలకు వయస్సును నిర్ధేశించారు. వీటితో పాటు దీక్షా కాలంలో చేయకూడని పనులను కూడా నియమావళిలో సూచించారు. దీక్షా సమయంలో ధరించిన మాల, ప్రతివారు దీక్ష అనంతరం పూజా మందిరాల్లో భద్రపరచాలని సూచించారు.