జాతీయ వార్తలు

పిఒకెలో భారత్ సర్జికల్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:ఉరీ సైనికశిబిరంపై పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం అర్థరాత్రి దాటాక జరిపిన సైనిక ఆపరేషన్ సంచలనం రేపింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రమూకలకు శిక్షణ ఇస్తున్న శిబిరాలపై భారత కమాండోలు దాడి చేశారు. నియంత్రణ రేఖను దాటి హెలికాప్టర్లలో వెళ్లిన సైనికులు ప్యారాచూట్ల సహాయంతో కిందకు దిగారు. ముందుగానే గుర్తించిన ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ముప్పేట దాడి చేశారు. వారి రాకెట్ లాంచ్ పాడ్లను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో 38మంద తీవ్రవాదులు హతమయ్యారు. పెద్దసంఖ్యలో గాయపడ్డారు. దాదాపు ఎనిమిదిమంది ఉగ్రవాదనుల బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం ఉంది. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్‌లో భారత జవాన్లు ఎవరూ గాయపడకపోవడం విశేషం. దాడి అనంతరం మన కమాండోలు మళ్లీ భారత్‌లోకి క్షేమంగా అడుగుపెట్టారు.