జాతీయ వార్తలు

భారత్ ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: పాకిస్తాన్‌పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. బాంబుల దాడితో జమ్మూ కాశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ ఆవల నౌషేరా సెక్టార్‌లో పాక్ బంకర్ పోస్టులను ధ్వంసం చేసింది. భారత్ బాంబుల ధాటికి పాక్ బంకర్లు నామరూపాల్లేకుండా పోయాయి. జమ్మూ కాశ్మీర్‌లోకి ఇస్లామిక్ ఉగ్రవాదులను పంపుతూ, సైనిక శిబిరాలపై దాడులకు పాల్పడుతున్న పాక్‌కు బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం ప్రత్యక్ష దాడులకు దిగింది. ప్రత్యక్ష దాడుల్లో భాగంగానే వాస్తవాధీన రేఖ వద్ద నౌషేరా సెక్టార్‌లోని పాక్ బంకర్ పోస్టులను భారీ ఆయుధాలు, మోర్టార్లతో ధ్వంసం చేసింది. పాక్ బంకర్ పోస్టులపై భారత సైన్యం దాడికి దిగటం గత నెల రోజుల్లో ఇది రెండోసారి. భారత సైన్యం ఏప్రిల్ 26న కృష్ణఘాటీలోని పాక్ బంకర్ పోస్టుపై రాకెట్లతో దాడి చేసి ధ్వంసం చేయటం తెలిసిందే.
కృష్ణఘాటి దాడి అనంతరం భారత సైన్యం ఇప్పుడు రెండోసారి నౌషేరా సెక్టార్‌లోని బంకర్ పోస్టును భారీ బాంబులు, మోర్టర్లతో ధ్వంసం చేసింది. పాక్ బోర్డర్ టీం భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఇద్దరు భారత సైనికుల తలలు నరికి తీసుకుపోయినందుకు, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకే ప్రతీకార దాడులకు దిగినట్టు మేజర్ జనరల్ అశోక్ నరూలా మంగళవారం మీడియాకు వెల్లడించారు. భారత సైన్యం విడుదలు చేసిన వీడియోలో పాక్‌కు చెందిన నాలుగు బంకర్లు క్షణాల్లో నేలమట్టం కావటం కనిపించింది. భారత సైన్యం తమ వైపునుంచి పాక్ బంకర్లపై భారీ ఆయుధాలు, మోర్టార్లతో బాంబులు కురిపించటం స్పష్టంగా కనిపించింది. భారత సైన్యం కురిపించిన బాంబులకు నాలుగు బంకర్లు నేలమట్టమయ్యాయి. ఆ సమయంలో మంటలతోపాటు పెద్దఎత్తున దుమ్ము లేవటం కనిపించింది. కృష్ణఘాటీలోని పాకిస్తాన్ బంకర్‌పై రాకెట్ దాడి జరిగినప్పుడూ అది క్షణాల్లో నేలమట్టమైంది. నౌషేరాలో కొండను ఆనుకున్న ఉన్న పాకిస్తాన్ బంకర్ల నుంచి భారత సైనికులపై కొన్ని రోజుల నుంచి క్రమం తప్పకుండా కాల్పులు జరుగుతున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు అవసరమైన అవకాశాన్ని కలిగించటమే ఈ కాల్పుల లక్ష్యం. పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోకి వచ్చి అశాంతి సృష్టించేందుకు వస్తున్న ఉగ్రవాదులకు మద్దతిస్తోంది కాబట్టే తామూ పాక్ బంకర్లను ధ్వంసం చేస్తున్నామని అశోక్ నరులా స్పష్టం చేశారు.
chitram...
బంకర్లు నేలమట్టం అవుతున్నపుడు పెద్దఎత్తున లేచిన దుమ్ము మేఘాలు