తెలంగాణ

భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: వివాహేతర సంబంధం వద్దన్నందుకు భర్తను భార్య గొడ్డలితో నరికి చంపిన ఉదంతం శనివారం పాల్వంచలో వెలుగు చూసింది. పాల్వంచలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో కూలిపనులు చేసుకునే గోపాలకృష్ణ భార్య రాములమ్మ అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై దంపతుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతోంది. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలన్న ఆలోచనతో రాములమ్మ ఈ కిరాతకానికి తెగించింది. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై గొడ్డలితో దాడి చేసి హతమార్చాక ఆమె పరారైంది. శనివారం ఉదయం ఈ దారుణం వెలుగు చూశాక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, పరారీలో ఉన్న రాములమ్మ, ఆమె ప్రియుడి కోసం గాలింపు చేపట్టారు.