భాస్కర వాణి

ఆర్భాటాలతో ఆధ్యాత్మికతకు చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకడు బహిర్భూమికి వెళ్లినపుడు ఒక చెట్టు మీద ఊసరవెళ్లిని చూశాడు. అతడు తన మిత్రులతో ‘నేనొక ఎరుపు రంగు తొండను చూశాను’ అ న్నాడు. ఆ తొండ రంగు ఎరుపే అని అతని నమ్మకం. అక్కడికి వచ్చిన మరొక వ్యక్తి ‘నేను ఆకుపచ్చరంగు తొండను చూశాను’ అన్నాడు. ఆ తొండ రంగు ‘ఆకుపచ్చే’ అని అతని దృఢ విశ్వాసం. ఇంకోవ్యక్తి ‘మీరు చెబుతున్నదంతా నిజమే. ఆ ప్రాణి ఒక సమయంలో ఎరుపు రంగులో, మరో సమయంలో ఆకుపచ్చ రంగులో, మరికొన్ని వేళల్లో ఎటువంటి రంగు లేకుండా ఉంటుంది. అలాగే వేదాలు భగవంతుడిని సగుణుడని, నిర్గుణుడని వర్ణించాయి’ అంటూ సగుణ, నిర్గుణ తత్త్వాన్ని శ్రీరామకృష్ణులు ఇంత అత్యద్భుత సమన్వయంతో పేర్కొన్నట్టు వివరించాడు.
మరి నేడు హిందూమతం పేరుతో ఎన్నో ఆచరణలు, ఆలోచనలు, సంప్రదాయాలు, పర్వాలు నిర్వహిస్తున్నాం, కానీ వాటిలోని పరమార్థాన్ని విస్మరిస్తున్నాం. వివిధ శాస్త్రాల మధ్య సమన్వయం గురించి పట్టించుకోకుండా వదిలేశాం. మనల్ని కొందరు దోషుల్లా నిందిస్తున్నా గుడ్లప్పగించి చూస్తున్నాం. మత పరిజ్ఞానం అంతా అంధవిశ్వాసాలుగా కొట్టి పారేసే శక్తులకు ఊతమిస్తున్నాం. మన ప్రాచీన పరంపరతో దేశ విదేశాల్లో అవార్డులు కొట్టేసే వాళ్లకు మనమే పరోక్షంగా సహకరిస్తున్నాం. భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక సెంటిమెంట్‌కు బ్రిటిష్ కాలం నుండి పునాదులు పడ్డాయి. ఉదాహరణకు గుడిపాటి వెంకటాచలానికి తెలుగు సాహిత్యంలో కొందరు స్థిరమైన స్థానం కల్పించారు. పాశ్చాత్య భోగవాద దృక్పథాన్ని మన సమాజంలో ప్రవేశపెట్టి రెండు దశాబ్దాల పాటు తెలుగు సమాజాన్ని ధ్వంసం చేశాడు చలం. విధ్వంసం తర్వాత ఆయన ఆత్మశాంతి కోసం తిరువణ్ణామలై వెళ్లి రమణ మహర్షిని ఆశ్రయించారు. చలం రమణాశ్రమానికి వెళ్లక ముందు చెప్పిన విషయాలకే ఇప్పటికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అతను మెచ్చుకొనే ఫ్రాయిడ్‌ను ఆధ్యాత్మికత ఎలా అధిగమించ గలిగిందో చెప్పడం లేదు. చలం సాహిత్యాన్ని ఎదుర్కోవడానికి విశ్వనాథ లాంటి వారు తప్ప వేరెవరూ బలంగా ప్రయత్నించలేదు. స్ర్తిల ఔన్నత్యాన్ని, ఉదాత్తతను మన సమాజం పట్టించుకోకపోతే చలం లాంటి శక్తులు ఈ గడ్డపై విజృంభించాయి. అందుకే మన గ్రంథాలను, అందులోని తత్త్వాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. పైపైన మెరుగులకు మనం ప్రాధాన్యం ఇచ్చి ధర్మంలోని వైశిష్ట్యాన్ని మనంతట మనం తగ్గించకూడదు. ‘మానవులను ఏకం చేసే మహత్తర విషయాల్లో మతం కూడా ఒకటి’ అంటారు స్వామి వివేకానంద. మతం ద్వారా మనుషులు ఏకమార్గం వైపు నడవడానికి ఆధ్యాత్మికత ఆలంబనగా ఉండాలి. ఆధ్యాత్మికత,మతం వినోదంగా, ఈవెంట్‌గా మారకూడదు.
వినాయక విగ్రహాలను వీధులవారీగా,కులాల వారీగా, ఎవరికి వారు విభజన రేఖలు గీసుకొని ప్రతిష్ఠ చేయకూడదు. వినాయక ఉత్సవాల ద్వారా స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించడానికి ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్ సంకల్పించారు. 1893లో ఆయన గణపతి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించాలని ప్రకటించారు. పూణె సమీపంలోని ఒక గ్రామంలో గణపతి మండలిని తొలిసారి స్థాపించి ఈ మహోత్సవం జనాన్ని సంఘటిత పరచుకోవడం కోసమే అని ప్రకటించారు. నేడు చాలాచోట్ల రాజకీయ నేతలను, సెలబ్రిటీలను తీసుకొచ్చి పోటాపోటీగా గణపతి నవరాత్రులను జరపడం సరైంది కాదు. ఆధ్యాత్మిక దృక్పథాన్ని చాటడానికి ఆలంబన కావలసిన ఈ ఉత్సవం ‘ఈవెంట్’గా మారిపోవడం చింతనీయం.
ప్రజలను ఒకచోటకు చేర్చుతూ గణపతి ఉత్సవాలు, దుర్గానవరాత్రులు, పంచాంగ శ్రవణాలు మన ఆధ్యాత్మిక తత్వాన్ని, హిందూ ధర్మ వైభవాన్ని ప్రస్ఫుటం చేయాలి. ఆడంబరాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా మన దేశంపై, హిందూ ధర్మంపై విషం చిమ్మే శక్తులకు ఊతం ఇచ్చినట్లవుతుంది. సన్మానాలు, పొగడ్తలు, ఆడంబరాలు ఎక్కువై ఆధ్యాత్మిక భావన పలుచనబడిపోతుంది. ప్రతి పండుగ, ప్రతి ఉత్సవం ఆధ్యాత్మికతను, దేశభక్తిని, దైవభక్తిని పెంచాల్సింది పోయి అందుకు వ్యతిరేక దిశలో పయనిస్తుంది. దానివల్ల చాలామంది సెలబ్రిటీల ముసుగులో కొందరు మనపై విరుచుకు పడుతున్నారు. ఇటీవల కమల్‌హాసన్, రాంగోపాల్‌వర్మ, ప్రకాష్‌రాజ్ వంటి వాళ్లు ఇదే మార్గం అవలంబిస్తున్నారు. వీళ్లకు పరోక్షంగా మనమే పేరును తెచ్చిపెడుతున్నాం. మరోవైపు చాలామంది ప్రవచన కారులు పంచకావ్యాలూ, కాళిదాసు పద్యాలు వల్లెవేస్తూ క్రొత్త గ్రంథాలు చదవలేని దుస్థితిలో ఉన్నారు. మనకు ఇదొక గ్రహపాటు! దాంతో సెలబ్రిటీలు చెలరేగిపోతున్నారు. ఈ సెలబ్రిటీలతో పాటు విదేశీ సంస్థలకు అమ్ముడుపోయి వర్గ దృక్పథంతో పనిచేస్తూ కులవాదం రెచ్చగొడుతున్న శక్తులకు విస్తృతమైన హిందూ సమాజంలోని కొన్ని అంశాలు సులభంగా దొరుకుతున్నాయి. శంకరాచార్యుని నుండి బోనాల పండుగ వరకు వీళ్లు దేన్నైనా విమర్శిస్తారు. సముద్రం లాంటి హిందూమతాన్ని పట్టుకొని ఎక్కడో ఒక విమర్శ చేస్తారు. ఏది జరిగినా హిందూ సమాజంలో జరిగే విషయంగా వాళ్లు ప్రొజెక్ట్ చేస్తారు. గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం అలాంటిదే. కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో జరిగిన సంఘటనల వలన యావత్ హిందూ సమాజంలో ఉన్న అవలక్షణంగా గురజాడ చిత్రించారు. అదే గురజాడ రాసిన ‘పెద్దమసీదు’ రచనను విస్మరించిన మార్క్సిస్టు సాహిత్య లోకం కన్యాశుల్కానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించింది. దీనికి కారణం అందులో భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక దృక్పథం ఉండడమే!
ఇలాంటపుడు మనం మన పురాణ, ఇతిహాసాల్లోని ప్రతీకవాదం (సింబాలిజం) గమనించకుండా, వేలం వెర్రిగా ఉత్సవాలను జరిపితే ప్రతి అజ్ఞానికి సమాధానం ఇస్తూ పోవాల్సిందే. మన పర్వోత్సవాల్లోని ఆధ్యాత్మికత, తాత్విక వైజ్ఞానిక, ఖగోళ దృక్పథాన్ని మనం సమాజానికి అందించాలి. ఈ జ్ఞాన ప్రసారానికి దేవాలయాలు, ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు కేంద్రాలు కావాలి. అందుకు పండుగలు, ఉత్సవాలు ఉపయోగపడాలి. ‘ఎప్పుడైతే మీరు ధ్యానం- పూజ- ప్రార్థన చే స్తారో అప్పుడు మీకు లభించిన శాంతిని వెంటనే అందరికీ పంచకపోతే మిమ్మల్ని నాస్తికులు, అధర్మ పరాయణులని అంటాను’- అని బుద్ధుడు తన శిష్యులకు ఉపదేశించాడు. మన కార్యక్రమాలు కేవలం నామకార్థం జరిపే తంతులు కావు. ప్రతి మనిషిలో శాంతి తత్వాన్ని నింపే అమృత గుళికలు. దురదృష్టవశాత్తూ ఆధ్యాత్మికతను రాజకీయ నీలినీడలు కమ్ముకొన్నాయి. సూర్య నమస్కారాలు చేస్తే దాదాపు 12 ఆసనాలు అందులో మనకు తెలియకుండానే జరిగిపోతాయి. ఓంకారం దీర్ఘంగా ఉచ్చరిస్తే సృష్టి అంతా వ్యాపించి ఉండే నాదంతో ఏకమై ప్రాణాయామం జరుగుతుంది. ధ్వని తరంగ విజ్ఞానానికి, దేవాలయ నిర్మాణ శైలికి ప్రగాఢమైన సంబంధం ఉంది. దేవాలయం ఓ సామాజిక కేంద్రం. యోగవిద్య భారతీయ ప్రాచీనమైన ఆధ్యాత్మిక శాస్త్రం. ప్రస్తుతం వీటిని మతాల ముసుగులో రాజకీయం చేశారు. హర్యానా పాఠశాలలో భగవద్గీత శ్లోకాలు, గాయత్రీ మంత్రం నేర్పిస్తామంటే అది హిందూ మతోన్మాదం అని గోల చేస్తారు. మరి ప్రభుత్వాన్ని నడిపే నాయకులే రూమీ టోపీలు, షేర్వానీలు ధరించి ఇఫ్తార్ విందులు చేస్తే అది లౌకిక వాదం! ఈ మధ్య జ్యోతిషాన్ని వ్యాపారంగా ఒకవర్గం మార్చితే, దాని తలాతోక తెలియనివారు దానిలోని సైన్సును కాకుండా వ్యాపారాన్ని చూపిస్తూ విమర్శిస్తున్నారు.
ఈ మధ్య మరోగుంపు ‘సూడో సైన్సు’ను బాగా ప్రచారం చేస్తోంది. వారు మార్క్సిస్టు పార్టీ సిద్ధాంతాలను సైన్సు, విజ్ఞానం, నాస్తిక, హేతువాదాల పేరుతో బాగా వండి వార్చుతున్నారు. టీవీ చర్చల్లో, సోషల్ మీడియాలో ప్రతి దాన్నీ సైన్సు దృక్కోణంలో అంటూ బోల్తా కొట్టిస్తారు. ‘నూనెలతో, నీళ్లతో,ప్రార్థనలతో చచ్చిన వాళ్లను బ్రతికిస్తాం, అంగవైకల్యం ఉన్నవాళ్లను అద్భుతంగా నడిపిస్తాం’-అన్న వాళ్లను గురించి అస్సలు నోరు విప్పరు. కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే దోపిడీని ప్రశ్నించరు. హైదరాబాద్‌లో బత్తిన సోదరులు ఇచ్చే ‘చేప ప్రసాదం’ వల్లనే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందన్నట్లు మాట్లడుతారు. సత్యానికి, సైన్సుకు ఉన్న భేదాన్ని గుర్తించరు! సైన్సు అంటే ఓ పద్ధతి అన్న పరిజ్ఞానం కూడా వీళ్లకు లేదు. ‘సత్యం’ అంటే ఏమిటని బుద్ధుడిని అడిగితే ‘ఉపయోగించదగింది’ అన్నాడు. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే నీరు ఏర్పడుతుందని సైన్సు చెప్తుంది. ఈ నిర్వచనం సత్యమా? కాదా? అని మనం ఆలోచించం. కానీ హైడ్రోజన్, ఆక్సిజన్లను కలిపి నీటిని తయారు చేసే ప్రయోగం చూస్తే మనం సత్యం అంటాం. నిర్వచనాలలో బలం లేదు- కానీ దాని తయారీలో, ఉపయోగంలో బలం ఉంది.
5 వేల యేళ్ల క్రితం మతం సత్యాన్ని గురించి చెప్పిన నిర్వచనాన్ని సైన్సు ఈరోజు ఆమోదించింది. సత్యనిరూపణను మతం ఉపయోగం ద్వారా నిరూపిస్తుంది. మంత్రాలకు అర్థాలు వెతకకూడదు. దాన్ని ఉపయోగించడం ఒక కళ. అది మనం ఎప్పుడో గ్రహించాం. దురదృష్టవశాత్తూ అన్నీ వ్యాపారమయం అయినట్లే మతం, ఆధ్యాత్మికత కూడా అలాంటి గోతిలో పడుతోంది. ఆచరించే వాళ్లకు అవగాహన లేకపోవడం, విమర్శించే వాళ్లకు లోతులు తెలియక పోవడం మన దురదృష్టం తప్ప ఇంకేం కాదు.
‘మన అనుభవంలోకి వచ్చే శక్తులు సంభవింపజేసే వా టిలో ఒకశాతం కూడా మనం అర్థం చేసుకోలేక పో తున్నాం’ అని మైఖేల్ గాక్వెలిన్ అనే గొప్ప శాస్తవ్రేత్త విశ్వంలోని శక్తులపై అధ్యయనం చేసి చెప్పాడు. అజ్ఞాన పూరితమైన ఆధ్యాత్మికతను చెప్పడం ఎంత తప్పో, అవగాహన లేకుండా మత పరిజ్ఞానాన్ని విమర్శించడం అంతే తప్పు. ఇటీవల ఈ రెండు సమాంతరంగా సాగుతున్నాయి. లోతైన ఆధ్యాత్మికత, మత పరిజ్ఞానం క న్న ఛాందసం చాలా మందిలో కన్పిస్తుంది. అక్కసుతో విమర్శలు చేసేవాళ్లలో అపరిపక్వత, ఆక్రోశం పాలే ఎక్కువ. ఈ సంఘర్షణ వల్ల- విజయనగర రాజులు మల్లెపూలలా సంతలో వజ్రాలు అమ్మారన్నా, మన నుంచి వైద్యం, జ్యోతిషం అరబ్బులు, గ్రీకులు నేర్చుకొన్నారన్నా, మన ఋషులు దర్భలతో మంత్రించారన్నా నమ్మలేని దుస్థితిలో ఉన్నాం. మన ఆధ్యాత్మికతలో మార్పు రావాల్సిన తరుణం ఇదే. *

-డా. పి.్భస్కరయోగి bhaskarayogi.p@gmail.com