ఖమ్మం

ఎన్నెస్పీ కాల్వ పనుల్లో అవినీతిపై రైతులతో పాదయాత్ర చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జాలిముడి రైతులకు కొత్త చట్టం ప్రకారం పరిహారం అందించాలి
* టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి
బోనకల్, డిసెంబర్ 18: ఎన్నెస్పీ కాల్వ ఆధునికీకరణ పనుల్లో అవినీతిపై, నాసిరక నిర్మాణాలపై త్వరలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తానని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ముందుగా ఆయన మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామంలో శుక్రవారం వివిధ గ్రామాల ప్రజలతో పలు సమస్యలపై చర్చించారు. ప్రజలు మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలు జరిగాయని, పనులు చెయ్యకుండానే కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకున్నారని భట్టికి ఆళ్ళపాడు ప్రజలు ఫిర్యాదు చేశారు. ఎనె్నస్పీ కాల్వ పనుల్లో కూడా ఎటువంటి మరమ్మత్తులు చేయకుండానే తూతూ మంత్రంగాం కాంట్రాక్టర్లు పనులు నిర్వహించారని గ్రామస్తులు భట్టికి తెలిపారు. అర్హులైన వికలాంగులకు పెన్షన్లు అందడంలేదని, ఎన్నిసార్లు మండల అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, ఆళ్ళపాడు నుండి నారాయణపురం రోడ్డు పనులు నాసిరకంగా జరుగుతున్నాయని తెలిపారు. స్పందించిన భట్టి జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారులతో ఫోన్లో మాట్లాడి ఆళ్ళపాడు, నారాయణపురం రోడ్డు పనులను వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలని, లేని యడల ఆ కాంట్రాక్ట్ రద్దుచేసి మరలా టెండర్ పిలవాలని సూచించారు. ఎంపిడిఓ విద్యాలతతో ఫోన్లో మాట్లాడిన ఆయన అర్హులైన పెన్షన్‌దారులకు, మరుగుదొడ్ల నిర్మాణాలకు వెంటనే మంజూరు ఇవ్వాలన్నారు. అనంతరం ఆయన జాలిముడి పంట కాల్వ నిర్మాణ పనులను పరిశీలించి రైతులను అడిగి స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాయన్నపేట రైతులు తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందేవరకు పనులు జరగనివ్వమని భట్టి దృష్టికి తీసుకెళ్ళారు. కొత్త చట్టం ప్రకారమే తమకు పరిహారం ఇవ్వాలని రైతులు భట్టిని కోరారు. ఈ సందర్భంగా భట్టి ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు. రాయన్నపేట రైతులు ఆర్డీఓను కలుస్తారని, వారి సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేయాలని ఆయన ఫోన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎనె్నస్పీ కాల్వ ఆధునీకరణ పనులకు తమ ప్రభుత్వమే 4444కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందన్నారు. కాల్వ నిర్మాణ పనుల్లో ఎటువంటి అవకతవకలు జరిగినా సాహించేది లేదని, భావితరాల వారికి ఉపయోగపడేలా ఆధునీకరణ పనులు జరగాలన్నారు. జాలిముడి ప్రాజెక్ట్ రైతులకు కొత్త చట్టం ప్రకారం పూర్తిస్థాయిలో పరిహారం అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఐబి డిఇ నారాయణరావు, ఎఇ ఇస్మాయిల్, కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గాలి దుర్గారావు, పైడిపల్లి కిషోర్‌కుమార్, చందు, కర్నాటి కోటి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.