భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.హెచ్.ఎన్.దిలీప్- ఏలూరు
ప్ర: పై చదువులు, విదేశీయానం?
సమా:- చదువు విషయంలో శారీరిక సంబంధమూ, ఆరోగ్య సంబంధమూ సమస్యల కారణంగా చదువులో ఆటంకాలు కలగవచ్చు- విదేశీయానం తప్పకుండా జరుగుతుంది.
ఎం.శివప్రసాద్, బేతంచెర్ల (కర్నూలు)
ప్ర:- స్వగృహయోగం
సమా:- ఆలస్యంగా మీరున్న దిశనుండి ఉత్తర దిశలో గృహమొందము కలదు- అయితే కొనుగోలు విషయంలో కాని, నిర్మాణ విషయంలో కాని వ్యక్తుల కారణంగా ఘర్షణ అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం-
టి.ఎస్.చంద్రకాంత్- కాలిఫోర్నియా (యూ.ఎస్.ఏ)
ప్ర: మీరు చెప్పిన ప్రకారం నాకు విదేశీయానం సిద్ధించింది. ఉద్యోగమూ దొరికింది. వివాహ విషయం చెప్పండి!. ప్రేమా? సంప్రదాయమా?
సమా: వచ్చే శ్రావణం (దుర్ముఖి)లో మీకు వివాహం జరిగే అవకాశం ఉంది- సాంప్రదాయికమే సామరస్యంగా జరుగుతుంది-
బి.బసంతి, బరంపురం- (ఒడిసా)
ప్ర: భూముల అమ్మకం-
సమా: ఇంకా చాలా ఆలస్యం ఉంది.
కె.కె.మృదుల, తాడేపల్లిగూడెం (ప.గో.)
ప్ర: ఇష్టపడిన వ్యక్తితో వివాహం జరుగుతుందా?
సమా: సానుకూలత తక్కువగా ఉంది- మీ జాతకంలో కుజ వేధ ఉంది (కుజదోషం కాదు)- మీరు ఇష్టపడే వ్యక్తి జాతకం తెలియనిదే నిక్కచ్చిగా చెప్పటం సాధ్యంకాదు-
ఎ.వౌనిక, కవాడీగూడా (హైదరాబాద్)
ప్ర: ఇంటర్ తరువాత ఏం తీసుకోమంటారు?
సమా: లెక్కల ప్రాధాన్యంలేనిది తీసుకోండి. భూగర్భశాస్త్ర సంబంధం (జియోలజీ) బాగా యోగిస్తుంది-
టి.అరుణ, అలుగు, శ్రీకాకుళం
ప్ర: నా కుమారుడు ఇంట్లోనుండి వెళ్ళిపోతాడని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. నాకు మీ మాటమీద నమ్మకం కలిగింది. అతను చెప్పింది నిజమేనా?
సమా: ఆందోళన పడకండి!. జన్మస్థానానికి దూరంగా ఉద్యోగరీత్యా వెళ్ళటంకూడా గృహ త్యాగం కిందకే వస్తుంది. శుభమే జరుగుతుంది.
సారుూశరణ్య, జనగామ, వరంగల్
ప్ర: విద్య, ఉద్యోగం?
సమా: విద్యాస్థానం చాలా బాగుంది. ఉద్యోగం శారీరిక శ్రమను కలిగించేదిగా, దక్షిణ దిశలో అవకాశం.
బి.వి.కుమారి, ఆత్మకూర్, (నెల్లూరు)
ప్ర: అనారోగ్య కారణం ఏమిటి?
సమా:- మీకు మోకాళ్ళు, పాదాలు, బలహీన స్థానాలు- నరాల బలహీనతవల్ల కాని ఒక చిన్నప్రమాదంవల్ల కాని ఇబ్బంది కలిగినట్లు కనిపిస్తున్నది. సంతాన మూలకంగా మానసికం. జల దోషం కారణంగా శారీరిక రుగ్మతలు కనిపిస్తున్నాయి.
కె.శ్రీనివాసులు, బాగ్‌అంబర్‌పేట, (హైదరాబాద్)
ప్ర: జీవితంలో స్థిరత్వం, దాంపత్యానుకూలత?
సమా: మీరు చాలావరకు ఆడంబరప్రియులు. కళాహృదయంగల సున్నిత మనస్కులు, అయితే మనఃకారక చంద్రుడు అనుకూలంగా లేడు. ఆ కారణంగా మానసిక దౌర్బల్యం- శ్రమపడే లక్షణాలు లేకపోవుటమూ కారణంగా ఆలస్యంగా లక్ష్యసిద్ధి. వాస్తవికంగా ఆలోచించటం ప్రారంభించండి.
పి.వి.నరసింహారావు, రాజమహేంద్రవరం (తూ.గో.)
ప్ర: నాకు వివాహయోగం కలగటంలేదు. బ్రహ్మచారిగా ఉండటం శాస్త్ర సమ్మతమేనా?
సమా: అదే మీ నిర్ణయమైతే సన్యాసాశ్రమ తీసుకోవాలి. కేవలం బ్రహ్మచారిగా ఉంటే పరాంగతుల విషయంలో అధర్మమవుతుంది.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ